తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Ganesh Visarjan : హుస్సేన్ సాగర్ లో పీవోపీ విగ్రహల నిమజ్జనం వద్దు, హైకోర్టు కీలక ఆదేశాలు

Hyderabad Ganesh Visarjan : హుస్సేన్ సాగర్ లో పీవోపీ విగ్రహల నిమజ్జనం వద్దు, హైకోర్టు కీలక ఆదేశాలు

HT Telugu Desk HT Telugu

25 September 2023, 14:53 IST

    • Hyderabad Ganesh Visarjan : హైదరాబాద్ గణేష్ నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. హుస్సేన్ సాగత్ పాటు నగరంలోని చెరువుల్లో పీవోపీ విగ్రహాలను నిమరజ్జనం చేయొద్దని ఆదేశించింది.
హైదరాబాద్ గణేష్ నిమజ్జనం
హైదరాబాద్ గణేష్ నిమజ్జనం

హైదరాబాద్ గణేష్ నిమజ్జనం

Hyderabad Ganesh Visarjan : హైదరాబాద్ లో వినాయకుడి నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తో పాటు నగరంలోని అన్నీ చెరువులలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక విగ్రహాలను నిమజ్జనం వద్దని కీలక ఆదేశాలు ఇచ్చింది. తక్షణమే హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సిందిగా హైదరాబాద్ సీపీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ లను ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కృతిమ నీటి కుంటల్లోనే విగ్రహాలను నిమజ్జనం చెయ్యాలని హైకోర్టు సూచించింది. నగరంలో ఇప్పటికే గణేశ్ నిమజ్జనాలు ఊపందుకున్నాయి. ఈ నెల 18న గణేష్ చతుర్థి రోజు కొలువుదీరిన గణనాథులకు భక్తులు వీడ్కోలు పలుకుతున్నారు.

నిమజ్జనానికి ఏర్పాట్లు

హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందడి మొదలైంది. కాలనీల్లో ప్రతిష్టించిన వినాయకులను నిమజ్జనానికి తరలిస్తున్నారు. ఈ నెల 18న గణేష్ చతుర్థి రోజు కొలువుదీరిన గణనాథులకు భక్తులు వీడ్కోలు పలుకుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో నవరాత్రులు ముగిసిన అనంతరం పదో రోజు లేదా పదకొండో రోజు వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. అయితే హైదరాబాద్ నగరంలో మాత్రం గణేష్ విగ్రహాల సంఖ్య ఎక్కువ కావడంతో మూడో రోజు నుంచే నిమజ్జనాలు సందడి మొదలవుతంది. జంట నగరాల్లో గణేష్ నిమజ్జనానికి ఇబ్బందులు లేకుండా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. నగర పరిధిలోని 22 ప్రాంతాల్లో భారీ పోర్టబుల్ వాటర్ ట్యాంకులు, 23 ప్రాంతాల్లో కొలనులు, 27 ప్రదేశాల్లో బేబీ పాండ్స్ ఏర్పాటు చేసింది.

28న ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం

ఖైరతాబాద్ గణేష్ భక్తుల విశేష పూజలందుకుంటున్నారు. ఖైరతాబాద్ గణేష్ పండుగ తర్వాత వచ్చే 9 రోజుల పాటు భక్తులు దర్శించుకుంటారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం తేదీ, సమయాలు, నిమజ్జనానికి వెళ్లే మార్గాన్ని నిర్వాహకులు ప్రకటించారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఈనెల 28న (గురువారం) జరుగనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత గణేష్ శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. ఖైరతాబాద్‌ గణేష్‌ ను దర్శించుకునేందుకు భక్తుల పెద్ద సంఖ్యలో వస్తు్న్న నేపథ్యంలో ఈనెల 28 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే ట్రాఫిక్ నిరంకారి జంక్షన్ వైపు మళ్లించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రాజ్‌దూత్‌ లేన్ నుంచి బడా గణేష్ వైపు వచ్చే ట్రాఫిక్ ఇక్బాల్ మినార్ వైపు మళ్లించినట్లు తెలిపారు. మింట్ కాంపౌండ్ నుంచి IMAX థియేటర్ వైపు ట్రాఫిక్ తెలుగు తల్లి జంక్షన్ వైపు మళ్లించారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్ , హైదరాబాద్

తదుపరి వ్యాసం