తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Kcr : ఉద్యోగులకు సీఎం కేసీర్ గుడ్ న్యూస్- కొత్త పీఆర్సీ, సింగరేణి కార్మికులకు రూ.1000 కోట్ల బోనస్

CM KCR : ఉద్యోగులకు సీఎం కేసీర్ గుడ్ న్యూస్- కొత్త పీఆర్సీ, సింగరేణి కార్మికులకు రూ.1000 కోట్ల బోనస్

15 August 2023, 14:03 IST

    • CM KCR : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. కొత్త పీఆర్సీ ప్రకటిస్తామన్నారు. ఈ ఏడాది దసరా, దీపావళికి సింగరేణి కార్మికులకు రూ.1000 కోట్ల బోనస్ ఇస్తామన్నారు.
సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

CM KCR : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ఉద్యోగులకు ఉత్తమ పీఆర్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ గోల్గొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఉద్యోగులకు పీఆర్సీ, సింగరేణి కార్మికులకు బోనస్ వంటి వరాలు కురిపించారు. ఉద్యోగుల సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం మిగతా రాష్ట్రాల కన్నా ముందుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యోగులే దేశంలో అత్యధిక వేతనాలు పొందుతున్నారని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఉద్యోగులకు ఇంక్రిమెంట్స్ ఇచ్చామన్నారు. ఇప్పటివరకూ రెండు సార్లు పీఆర్సీల ద్వారా 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని సీఎం తెలిపారు. కరోనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించినా ఉద్యోగులకు మెరుగైన ఫిట్‌మెంట్‌ అందిచామన్నారు. త్వరలోనే నూతన పీఆర్సీ నియమించి, ఉద్యోగుల వేతనాలను పెంచుతామన్నారు. అప్పటివరకూ మధ్యంతర భృతిని చెల్లిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

Mulugu District : లిఫ్ట్ ఇచ్చి రేప్..! అడవిలో అంగ‌న్వాడీ టీచ‌ర్ హత్య

Karimnagar Rains : అకాల వర్షాలు, తడిసిపోయిన ధాన్యం..! అన్నదాత ఆగమాగం

TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ హాల్ టికెట్లు విడుద‌ల‌ - డౌన్లోడ్ లింక్ ఇదే

Hyderabad Crime : బీమా డబ్బుల కోసం కోడలి దాష్టీకం..! అత్తమామల హత్యకు కుట్ర, కత్తులతో దాడి చేసిన సుఫారీ గ్యాంగ్

వీఆర్ఏ, పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణ

నీరటి, మస్కూరీ, లష్కర్ వంటి పేర్లతో పిలుస్తూ.. భూస్వామ్య వ్యవస్థకు చిహ్నంగా మిగిలిన వీఆర్ఏలకు ప్రభుత్వ ఉద్యోగులుగా అవకాశం కల్పించామని సీఎం కేసీఆర్ తెలిపారు. వీఆర్ఏ సేవలను క్రమబద్ధీకరిస్తూ పేస్కేల్ అమలుచేస్తున్నామన్నారు. వీఆర్ఏలకు విద్యార్హతల బట్టి వివిధ శాఖల్లో సర్దుబాటు చేసేందుకు కొత్తగా 14,954 పోస్టులను మంజూరు చేశామన్నారు. గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను కూడా క్రమబద్ధీకరించాలని నిర్ణయించామని సీఎం కేసీఆర్ తెలిపారు.

సింగరేణి కార్మికులకు రూ.1000 కోట్ల బోనస్

నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం లాభాల బాట పట్టించిందని సీఎం కేసీఆర్ అన్నారు. కంపెనీ టర్నోవర్ 12 వేల కోట్ల నుంచి 33 వేల కోట్లకు పెరిగిందన్నారు. సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఈసారి దసరా, దీపావళి పండుగల బోనస్ గా రూ.1000 కోట్లు పంపిణీ చేయబోతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం బలోపేతం చేసిందని తెలిపారు. రూ.3,12,319 తలసరి ఆదాయంతో తెలంగాణ దేశంలోనే నెం.1గా నిలిచిందన్నారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామన్నారు.

ఆర్టీసీ విలీనం

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీని బలోపేతం చేయడానికి, సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏడాదికి రూ. 1500 కోట్లను బడ్జెట్‌లో పెట్టామని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంస్కరణల ఫలితంగా ఆర్టీసీ గతంలో కంటే కొంత మెరుగైన ఫలితాలను సాధించగలుగుతోందన్నారు. కానీ నష్టాలు మాత్రం తప్పడంలేదన్నారు. ఆర్టీసీ సంస్థను కాపాడాలి, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా 43, 373 మంది ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించామని సీఎం కేసీఆర్ తెలిపారు.ఆర్టీసీ బిల్లు అసెంబ్లీలో కూడా ఆమోదం పొందింద‌న్నారు.

తదుపరి వ్యాసం