తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Porn Rocket : నగ్న చిత్రాలతో నయా దందా…మహిళ చొరవతో గుట్టు రట్టు…

Porn Rocket : నగ్న చిత్రాలతో నయా దందా…మహిళ చొరవతో గుట్టు రట్టు…

HT Telugu Desk HT Telugu

05 December 2022, 8:40 IST

    • Porn Rocket పేదరికం, మహిళల అమాయకత్వంతో డబ్బులు ఎర చూపి నగ్న చిత్రాలు సేకరిస్తున్న ముఠాను హైదరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. పాతబస్తీ కేంద్రంగా సాగుతున్న ఈ ముఠా  గుట్టును ఓ మహిళ సహకారంతో పోలీసులు బయటపెట్టారు. 
వివాహితపై అత్యాచారం...
వివాహితపై అత్యాచారం...

వివాహితపై అత్యాచారం...

Porn Rocket ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళల్ని లక్ష్యంగా చేసుకుని వారికి డబ్బులిస్తామని ఎర వేసి నగ్న చిత్రాలను సేకరిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మహిళల్ని గుర్తించి వారిని ప్రలోభ పెడుతున్నట్లు గుర్తించారు. మహిళల ఫోటోలు సేకరించి ఇంటర్నెట్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మహిళల నిస్సహాయ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఈ అకృత్యాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు

Hyderabadi In UK Polls: యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో సిద్ధిపేట ఐటీ ఇంజనీర్‌, లేబర్ పార్టీ తరపున పోటీ

Graduate Mlc Election: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై బీజేపీ గురి, కీలక నేతలకు ఇన్‌ఛార్జి బాధ్యతలు

Warangal Rains: వరంగల్‌లో ఈదురు గాలులతో భారీ వర్షం, రైతులకు తీవ్ర నష్టం.. గ్రేటర్ లో ఆఫీసర్లు అలర్ట్

CM Revanth Reddy : తెలంగాణలో భూముల మార్కెట్ విలువ సవరణ…! కీలక ఆదేశాలు జారీ

హైదరాబాద్‌లో మహిళల నగ్న చిత్రాలు, వీడియోలను సేకరించి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మహిళల పేదరికం, నిస్స‍హాయతను ఆధారంగా చేసుకుని ఈ ముఠా పెద్ద సంఖ్యలో మహిళల ఫోటోలను సేకరించినట్లు గుర్తించారు. మహిళల శరీర ఆకృతి ఆధారంగా ఫోటోలకు ధరలను నిర్ణయిస్తున్నారు. ఈ దందాపై సమాచారం అందడంతో సామాజిక కార్యకర్త ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చింది. చాంద్రాయణ గుట్ట సిఐ ప్రసాద్ వర్మ సాయంతో వ్యభిచార ముఠా ఆగడాలకు పోలీసులు కళ్లెం వేశారు.

కర్ణాటకలోని బీదర్ జిల్లా బసవకళ్యాణ్‌ తాలుకా రాజేశ్వర్ గ్రామానికి చెందిన సయ్యద్ హుస్సేన్ లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. కలబురిగి ప్రాంతంలో వ్యభిచార గృహాలను నిర్వహించే గులాంకు అనుచరుడిగా ఉండేవాడు. గులాం సూచనలతో కొద్ది రోజుల క్రితం పాతబస్తీ చేరుకున్నాడు. బార్కస్‌ సలాలా ప్రాంతంలో ఉంటున్న మరదలి ఇంటికి వచ్చి పని కోసం నగరానికి వచ్చినట్లు నమ్మబలికాడు. ఆ ప్రాంతంలో అద్దె గది కావాలని కోరడంతో ఆమె తన ఇంట్లోనే ఓ గదిని అద్దెకు ఇచ్చింది.

పాతబస్తీలో ఉపాధి కోసం తిరుగుతున్నట్లు నటిస్తూ మహిళలకు గాలం వేసేవాడు. ఫలక్‌నామా ప్రాంతం వట్టెపల్లికి చెందిన ఓ మహిళతో కలిసి వ్యభిచార కార్యకలాపాలకు అనువుగా ఉండే యువతుల కోసం గాలించేవాడు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండే వారికి నమ్మకంగా మాటలు చెప్పి వారిని ప్రలోభ పెట్టేవాడు. కష్టాలు తొలగించడానికి తాను చెప్పినట్లు చేయాల్సిందిగా సూచించేవాడు. యువతుల ముఖం, పాదాలు కనిపించకుండా ఫోటోలు తీసుకునే వాడు. యువతుల నగ్న చిత్రాలను, వీడియోలను సేకరించేవాడు. వాటిని కలబురిగిలోని గులాంకు పంపేవాడు. ఫోటోల ఆధారంగా గులాం ధర నిర్ణయించేవాడు. వారం రోజుల్లో పది మంది మహిళల్ని ఇలా ప్రలోభ పెట్టాడు. బాధితుల్లో పాతబస్తీకి చెందిన ఇద్దరు యువతులు ఉన్నారు.

హుస్సేన నిర్వాకం గురించి తెలిసిన ఓ మహిళ మరొకరితో కలిసి అతడిని సంప్రదించింది. పొట్టిగా ఉన్నందున ఫోటోలు తీసుకోడానికి అతను నిరాకరించాడు. మరో మహిళను సోమవారం ముస్తాబై రావాలని సూచించాడు. ఫోటోలు, వీడియో తీశాక ధర నిర్ణయిస్తామని చెప్పాడు. ఈ సమాచారం పోలీసులకు చెరవేయడంతో చాంద్రాయణగుట్ట పోలీసులు అతడు ఉంటున్న గదిపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. హుస్సేన్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడి ఫోన్లో ఫోటోలు చూసి షాక్ తిన్నారు. నిందితుడు హైదరాబాద్‌లో బాలికలు, మహిళలకు డబ్బు ఎర వేసి ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నట్లు గుర్తించారు.

తదుపరి వ్యాసం