తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kalyana Lakshmi | కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ దరఖాస్తు ఎలా చేసుకోవాలి?

Kalyana Lakshmi | కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ దరఖాస్తు ఎలా చేసుకోవాలి?

28 December 2021, 10:54 IST

    • Kalyana Lakshmi scheme: కళ్యాణ లక్ష్మి పథకం : పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకుండా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకం ఇది.
వివాహ బంధం (ప్రతీకాత్మక చిత్రం)
వివాహ బంధం (ప్రతీకాత్మక చిత్రం) (Unsplash)

వివాహ బంధం (ప్రతీకాత్మక చిత్రం)

కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డల వివాహ సమయంలో చేయూత ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకం. తెలంగాణ రాష్ట్రంలో యువతుల కోసం అమలవుతున్న అతి ముఖ్యమైన సంక్షేమ పథకం.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

ఆడబిడ్డ వివాహ సమయంలో తల్లి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం నేరుగా ఆర్థిక సహాయాన్ని జమ చేస్తుంది. కళ్యాణ లక్ష్మి పథకం కింద ప్రభుత్వం రూ. 1,00,116 లు అందజేస్తుంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ యువతులకు అందజేసే పథకాన్ని కళ్యాణ లక్ష్మి పథకం అని, మైనారిటీ యువతులకు సాయం అందజేసే పథకాన్ని షాదీ ముబారక్‌ పథకంగా ప్రభుత్వం అమలు చేస్తోంది.

18 ఏళ్ల లోపు పిల్లలకు వివాహం చేయడాన్ని నిరోధించేందుకు కూడా ఈ పథకం సహాయపడుతుంది. ఈ సహాయం అందుకోవాలంటే అమ్మాయి వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి.

కళ్యాణ లక్ష్మి పథకం పొందేందుకు అర్హతలు

షెడ్యూలు కులాలైతే ఆదాయం రూ. 2 లక్షల లోపు ఉండాలి.

షెడ్యూలు తెగలు (ఎస్టీ) అయితే ఆదాయం రూ. 2 లక్షల లోపు ఉండాలి.

బీసీ, ఈబీసీ ఆదాయ పరిమితి పట్టణ వాసులకైతే రూ. 2 లక్షలు, గ్రామీణులైతే రూ. 1,50,000 లోపు ఉండాలి.

షాదీ ముబారక్‌ (మైనారిటీల కోసం)కు అర్హులవ్వాలంటే ఆదాయ పరిమితి రూ. 2 లక్షల లోపు ఉండాలి.

కళ్యాణ లక్ష్మి పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

తెలంగాణ ఈ పాస్‌ వెబ్‌ సైట్‌లో కళ్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది.

పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఆధార్‌ నెంబర్‌, విద్యార్హతలు, ఫోన్‌ నెంబర్‌, కులం, ఉప కులం, తల్లి పేరు(బ్యాంకు ఖాతాలో ఉన్న పేరు యథాతథంగా ఉండాలి), తల్లి ఆధార్‌ నెంబర్‌, ఆదాయ ధ్రువీకరణ పత్రం వివరాలు, కుల ధ్రువీకరణ పత్రం వివరాలు పొందుపరచాలి.

అలాగే శాశ్వత చిరునామా, అనాథలైతే వారి బ్యాంకు ఖాతా వివరాలు, లేదంటే తల్లి బ్యాంకు ఖాతా వివరాలు పొందుపరచాలి.

పెళ్లి కొడుకు వివరాలు కూడా పొందుపరచాల్సి ఉంటుంది. తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఆధార్‌ నెంబర్‌, విద్యార్హత, మతం, కులం, ఉప కులం, కుటుంబ ఆదాయం, వృత్తి, శాశ్వత చిరునామా, వివాహం జరిగిన తేదీ, వివాహం జరిగిన స్థలం, చిరునామా వివరాలు కూడా పొందుపరచాలి.

ఇక సంబంధిత ధ్రువీకరణ పత్రాలన్నింటినీ 50 కేబీ నుంచి 150 కేబీ మధ్య సైజుతో జేపీజీ ఫార్మాట్‌లో స్కాన్‌ చేసి అప్‌ లోడ్‌ చేయాలి.

అప్‌లోడ్‌ చేయాల్సిన ధ్రువీకరణ పత్రాలుః

1. మొదటి వివాహమే అని ధ్రువీకరణ పత్రం

2. వీఆర్వో లేదా పంచాయతీ కార్యదర్శి ఆమోద ధ్రువీకరణ

3. పెళ్లి కూతురు ఫోటో

4.  వయసు ధ్రువీకరణ పత్రం

5. ఆధార్‌ కార్డులు (తల్లి, పెళ్లి కొడుకు సహా)

6. తల్లి బ్యాంక్‌ ఖాతా పాస్‌ బుక్‌ స్కాన్‌డ్‌ కాపీ, 

7. పెళ్లి కూతురు బ్యాంక్‌ ఖాతా స్కాన్‌డ్‌ కాపీ

దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ ఈపాస్‌ వెబ్‌ సైట్‌ను సందర్శించవచ్చు. మీ సేవ సెంటర్‌లోనైనా, తెలిసిన వారి సాయమైనా తీసుకోవచ్చు.

 

తదుపరి వ్యాసం