తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  కేసీఆర్‌కు ప్రధాన మంత్రి, రాష్ట్రపతి ఫోన్

కేసీఆర్‌కు ప్రధాన మంత్రి, రాష్ట్రపతి ఫోన్

HT Telugu Desk HT Telugu

17 February 2022, 9:23 IST

  • ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు జన్మదినం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఫోన్ చేసి కేసీఆర్‌కు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కూడా కేసీఆర్‌కు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

పూరిలో మానస్ సాహూ నిర్మించిన సైకత శిల్పం
పూరిలో మానస్ సాహూ నిర్మించిన సైకత శిల్పం (PTI)

పూరిలో మానస్ సాహూ నిర్మించిన సైకత శిల్పం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేసీఆర్‌కు ఈ ఉదయం ఫోన్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే సందర్భంగా విషెస్ తెలియజేశారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ ట్వీట్ కూడా చేశారు. కేసీఆర్ ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థించారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయువుతో ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను..’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

TSRTC Jeevan Reddy Mall : అద్దె ఒప్పందం రద్దు , జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం - టీఎస్ఆర్టీసీ ప్రకటన

Telangana Rains : కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం - పిడుగుపాటుతో ఇద్దరు మృతి

Bhadradri District : ఎంత అమానుషం! పండగకు చందా ఇవ్వలేదని 19 కుటుంబాల గ్రామ బహిష్కరణ

Heavy Rain in Hyderabad : ఒక్కసారిగా మారిన వాతావరణం - హైదరాబాద్‌లో కుండపోత వర్షం

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సర్జికల్ స్ట్రైక్స్ వివాదంపై నిన్నామొన్నటి వరకు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం సాగిన సంగతి తెలిసిందే.

‘తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మా కామాఖ్య, శ్రీమంత శంకర్‌దేవ్ మీకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువును ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అని హిమంత ట్వీట్ చేశారు.

కాగా, హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ జాగృతి నిర్వహించిన కేసీఆర్ కప్ వాలీబాల్ ఫైనల్స్ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా హోంమంత్రి మహమ్మద్‌ మహమూద్‌ అలీ, పార్టీల నేతలతో కలిసి ఆమె కేక్‌ కట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఒకవైపు కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుగుతుండగా.. మరోవైపు రేవంత్ రెడ్డి చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘జన్మదిన శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేస్తూ.. దానిలో ఒక ఊసరవెల్లి బొమ్మను పోస్ట్ చేశారు. 

కేసీఆర్‌ మెదక్ జిల్లా చింతమడకలో ఫిబ్రవరి 17, 1954లో జన్మించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ముందున్న తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) వ్యవస్థాపక అధ్యక్షుడు.

ఆయన వివిధ నియోజకవర్గాల నుంచి పలు దఫాలుగా శాసనసభ సభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. కేంద్రంలో కార్మిక, ఉపాధి కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు.

2014 ఎన్నికలలో 119 అసెంబ్లీ స్థానాలకు గాను 63 స్థానాల్లో టిఆర్ఎస్ విజయం సాధించింది, తద్వారా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన శాసనసభ్యుల సంఖ్యను పొందింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు.

2018 అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి 88 సీట్లు గెలుచుకుంది. డిసెంబర్ 13, 2018న తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 

దేశ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధానాల్లో గుణాత్మక మార్పు తేవాలని భావిస్తున్న కేసీఆర్.. ఇటీవల తన వ్యాఖ్యలతో దేశాన్ని ఆకర్షించారు. మమతా బెనర్జీ, స్టాలిన్, ఉద్దవ్ థాక్రే తదితర నేతలతో బీజేపీకి వ్యతిరేకంగా సంప్రదింపులు జరుపుతున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అన్నదానం, రక్తదానం, ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు.

 

తదుపరి వ్యాసం