తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Rgi Airport : విమాన ప్రయాణికులకు శుభవార్త.....శంషాబాద్ నుంచి మరో 4 కొత్త సర్వీసులు

Hyderabad RGI Airport : విమాన ప్రయాణికులకు శుభవార్త.....శంషాబాద్ నుంచి మరో 4 కొత్త సర్వీసులు

HT Telugu Desk HT Telugu

18 November 2023, 13:20 IST

    • Hyderabad Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్ పోర్టు నుంచి మరో 4 విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు వివరాలను ప్రకటించారు అధికారులు.
శంషాబాద్ నుంచి మరో నాలుగు ఫ్లైట్ సర్వీసులు
శంషాబాద్ నుంచి మరో నాలుగు ఫ్లైట్ సర్వీసులు

శంషాబాద్ నుంచి మరో నాలుగు ఫ్లైట్ సర్వీసులు

Hyderabad Shamshabad Airport: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుతం అనేక దేశాలకు విమాన సేవలు అందిస్తుంది.దేశంలోని అనేక ప్రధాన నగరాలకు దేశీయ విమాన సేవలు అందుబాటులో ఉన్నాయి.ఇటీవలే శంషాబాద్ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ ను ప్రారంభించారు.ఈ క్రమంలోనే విమాన ప్రయాణికులకు ఆర్జిఐఎ అధికారులు మరో శుభవార్త అందించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మరో నాలుగు విమాన సర్వీసులను అంధుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

Mulugu District : లిఫ్ట్ ఇచ్చి రేప్..! అడవిలో అంగ‌న్వాడీ టీచ‌ర్ హత్య

Karimnagar Rains : అకాల వర్షాలు, తడిసిపోయిన ధాన్యం..! అన్నదాత ఆగమాగం

TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ హాల్ టికెట్లు విడుద‌ల‌ - డౌన్లోడ్ లింక్ ఇదే

Hyderabad Crime : బీమా డబ్బుల కోసం కోడలి దాష్టీకం..! అత్తమామల హత్యకు కుట్ర, కత్తులతో దాడి చేసిన సుఫారీ గ్యాంగ్

ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సహకారంతో ఈ విమానాలు అంధుబాటులోకి వచ్చాయి. కొచ్చి,గ్వాలియర్,అమృతసర్ మరియు లక్నో నగరాలకు ఏ నూతన విమాన సర్వీసులు నడుస్తాయని అధికారులు వెల్లడించారు. శుక్రవారం నుంచే అమృత్సర్,లక్నో,కొచ్చి నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయని జీఏంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ సీఈఓ ప్రదీప్ పణిక్కర్ తెలిపారు.

ఈ నగరాలకు శంషాబాద్ నుంచి విమాన సేవలు

గ్వాలియర్ కు వెళ్ళే విమానాలు ఈనెల 28 నుంచి ప్రారంభం కానునట్లు ఆయన వెల్లడించారు.మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కోసం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఇక అమృతసర్ వెళ్ళే విమానాలు ప్రతిరోజు ఉదయం ఏడున్నార గంటలకు శంషాబాద్ నుండి బయల్దేరి 10:15 గంటలకు అమృతసర్ చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు.కొచ్చికి వెళ్ళే విమానం ప్రతిరోజూ రాత్రి 7:45 గంటలకు శంషాబాద్ నుండి బయల్దేరి రాత్రి 9:30 గంటలకు కొచ్చికి చేరుకుంటుందని ఆయన తెలిపారు. ఇక శంషాబాద్ లక్నో మద్య విమానం వారానికి ఆరు సర్వీసులు ఉంటాయని ఆయన అన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 2:30 గంటలకు బయల్దేరి 4:35 గంటలకు లక్నో చేరుకుంటుందని ఆయన వివారిచారు. నవంబర్ 28 నుండి ప్రారంభం కానున్న గ్వాలియర్ విమానాలు శంషాబాద్ నుంచి మధ్యాహ్నం 2:30 గంటలకు బయల్దేరి సాయంత్రం 4:20 గంటలకు గ్వాలియర్ చేరుకుంటుంది అని అధికారులు తెలిపారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

తదుపరి వ్యాసం