తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kishan Reddy: కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యిందన్న కిషన్‌రెడ్డి

Kishan Reddy: కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యిందన్న కిషన్‌రెడ్డి

HT Telugu Desk HT Telugu

15 August 2023, 10:33 IST

    • Kishan Reddy: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీగా మారిందని  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు.  బీజేపీ కార్యాలయంలో జరిగన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పలువురు నేతలు పాల్గొన్నారు. 
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేసీఆర్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేసీఆర్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేసీఆర్

Kishan Reddy: తెలంగాణ సమాజాన్ని మద్యానికి బానిసలుగా చేసిన ఘనత సిఎం కేసీఆర్‌కు దక్కుతుందని బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ఒకే కుటుంబానికి మెజార్టీ మంత్రిత్వ శాఖలు దక్కాయని, ఒక కుటుంబం చేతిలో తెలంగాణ రాష్ట్రం బందీగా మారిందని ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు

Karimnagar Rains : అకాల వర్షాలు, తడిసిపోయిన ధాన్యం..! అన్నదాత ఆగమాగం

TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ హాల్ టికెట్లు విడుద‌ల‌ - డౌన్లోడ్ లింక్ ఇదే

Hyderabad Crime : బీమా డబ్బుల కోసం కోడలి దాష్టీకం..! అత్తమామల హత్యకు కుట్ర, కత్తులతో దాడి చేసిన సుఫారీ గ్యాంగ్

BRS Mlc Election Burden: బీఆర్​ఎస్ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ భారమంతా ‘పల్లా’పైనే! సహకరించని గులాబీ​ నేతలు

కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ దోపిడికి గురవుతోందన్నారు. దేశంలో అత్యధికంగా అవినీతికి పాల్పడుతున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కిషన్‌ రెడ్డి ఆరోపించారు. వేల కోట్ల రుపాయలు అప్పుగా తెచ్చి వాటిలో కమిషన్ల రూపంలో దోచుకుంటోందని, దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఫైనాన్స్ చేస్తున్నారని ఆరోపించారు.

ఎన్ని వేల కోట్ల రుపాయలు అక్రమంగా సంపాదించుకున్నారో తెలంగాణ ప్రజానీకం అంతా చూస్తున్నారన్నారు. ప్రభుత్వం 30పర్సెంట్ వాటాలు కుటుంబానికి వెళుతున్నాయని, ప్రశ్నించే గొంతుల్ని నొక్కి, పౌర హక్కుల్ని కాలరాస్తున్నాయని ఆరోపించారు. ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు తెలిపే స్వేచ్ఛ లేకుండా చేశారన్నారు.

బీజేపీ కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోరాడుతుంటే వాటికి అనుమతి ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వం బిఆర్‌ఎస్‌ అగ్రస్థానంలో ఉంటుందన్నారు. యువత ఆశల్ని నీళ్లు చల్లి, నోటిఫికేషన్లు ఇవ్వడం పేపర్లు లీక్‌లతో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు.

తదుపరి వ్యాసం