తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  పెళ్లిలో విషాదం.. జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో కుప్పకూలిన వధువు

పెళ్లిలో విషాదం.. జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో కుప్పకూలిన వధువు

HT Telugu Desk HT Telugu

12 May 2022, 13:49 IST

    • విశాఖలో జరిగిన ఓ వివాహంలో విషాదం చోటు చేసుకుంది. సరిగ్గా జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో పెళ్లికుమార్తె కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
పెళ్లిలో విషాదం
పెళ్లిలో విషాదం

పెళ్లిలో విషాదం

విశాఖపట్నం మధురవాడలో ఓ పెళ్లిలో విషాదం జరిగింది. పెళ్లిపీటలపైనే వధువు స్పృహ కోల్పోయింది. సరిగ్గా జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో వధువు కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించిగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది.

ట్రెండింగ్ వార్తలు

AP EAPCET 2024 Updates : ఐఎండీ రెయిన్ అలర్ట్... ఏపీ ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు కీలక అప్డేట్

TTD August Online Quota: రేపు ఆగస్టు నెల ఆన్‌లైన్‌ కోటా టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల..

DEECET 2024 Hall Tickets: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్ హాల్ టిక్కెట్లు విడుదల చేసిన విద్యాశాఖ

Arakku Simhachalam Tour : అరకు, సింహాచలం ట్రిప్ - సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

బుధవారం రాత్రి 7 గంటలకు శివాజీ, సృజనల వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో నిన్న భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. అనుకున్నట్లే పెళ్లి జరుగుతుండగా పెళ్లికుమార్తె కుప్పకూలింది. బంధువులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే సృజన మృతికి గల కారణాలు పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో ఇరువైపు బంధువులు పుట్టెడు దుఖంలో ఉన్నారు.

తదుపరి వ్యాసం