తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ys Sharmila | ప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిలపై తేనె టీగల దాడి

YS Sharmila | ప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిలపై తేనె టీగల దాడి

HT Telugu Desk HT Telugu

23 March 2022, 20:07 IST

    • ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. ఆమెపై తేనె టీగలు దాడి చేశాయి.
ప్రజా ప్రస్థానం యాత్రలో షర్మిలపై తేనె టీగల దాడి
ప్రజా ప్రస్థానం యాత్రలో షర్మిలపై తేనె టీగల దాడి

ప్రజా ప్రస్థానం యాత్రలో షర్మిలపై తేనె టీగల దాడి

నల్గొండ జిల్లా కొండపాక గూడెం నుంచి.. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు.. వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర మెుదలుపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె యాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతోంది. అయితే షర్మిల పాదయాత్ర జరుగుతున్న సమయంలో ఓ ఘటన చోటుచేసుకుంది. మోటకొండూరు మండలం నుంచి ఆత్మకూరు మండలానికి వెళ్తున్న క్రమంలో ఆమెపై తేనెటీగలు దాడి చేశాయి.

ట్రెండింగ్ వార్తలు

Yadadri Temple : యాదాద్రిలో 'ప్లాస్టిక్' పై నిషేధం - భక్తుల డ్రెస్ కోడ్ పై కీలక నిర్ణయం...!

Kakatiya University VC : కేయూ వీసీపై విజిలెన్స్ విచారణ - సర్కార్ ఆదేశాలు

TS SET 2024 Updates : తెలంగాణ సెట్ దరఖాస్తులు ప్రారంభం - ఆగస్టు 28 నుంచి పరీక్షలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

దుర్శగానిపల్లి గ్రామం వద్ద చెట్టు కింద గ్రామస్తులతో ఆమె మాట్లడారు. కాసేపటి తర్వాత.. తేనెటీగలు ఒక్కసారిగా పైకి లేచాయి. వైఎస్ షర్మిలపై దాడి చేశాయి. అయితే ఆమె వెంటే ఉన్న సహాయక సిబ్బంది.. వెంటనే అప్రమత్తమయ్యారు. అక్కడి నుంచి.. తప్పించారు. తేనెటీగలు దాడి చేయకుండా.. చేతి రూమాలుతో ఊపారు సిబ్బంది. దీంతో ప్రమాదం తప్పింది. ఇప్పటి వరకు 400 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు షర్మిల.

తేనె టీగల దాడి ఘటన తర్వాత.. పాదయాత్రను షర్మిల కొనసాగించారు. రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యంగా వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని ముందుకుసాగుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడుతున్నారు. బుధవారం నాటికి షర్మిల పాదయాత్ర 34వ రోజుకు చేరుకుంది. తెలంగాణ నిరుద్యోగ సమస్యలపై.. షర్మిల ప్రధానంగా ప్రస్తావిస్తూ ముందుకు సాగుతున్నారు.

 

తదుపరి వ్యాసం