తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  సిజేరియన్ కాన్పులకు ముహూర్తాలు.. కలెక్టర్ ఎంట్రీతో పురోహితుల కీలక నిర్ణయం

సిజేరియన్ కాన్పులకు ముహూర్తాలు.. కలెక్టర్ ఎంట్రీతో పురోహితుల కీలక నిర్ణయం

HT Telugu Desk HT Telugu

04 May 2022, 10:37 IST

    • పెళ్లి.. గృహ ప్రవేశం, ఆఫీస్ ఓపెనింగ్ లేదా మరో ఏదైనా శుభకార్యం చేస్తున్నామంటే.. ముహూర్తం చూడాల్సిందే. ఇంతవరకు ఓకే.. కానీ ఇటీవల కాలంలో పిల్లలను కనేందుకు పూజారులు, పండితులు ముహూర్తం ఫిక్స్ చేయటం కలవరపెడుతోంది. ఫలితంగా సీజేరియన్‌ ఆపరేషన్ల సంఖ్య భారీగా పెరిగిపోతుంది.
సీ- ఆపరేషన్లపై అవగాహన కార్యక్రమం
సీ- ఆపరేషన్లపై అవగాహన కార్యక్రమం

సీ- ఆపరేషన్లపై అవగాహన కార్యక్రమం

discourage c sections delivery  సిజేరియన్ కాన్పులు పెరిగిపోతుండటం వైద్యారోగ్యశాఖను తీవ్రంగా కలవరపెడుతోంది. అయితే దీనికి కాస్త ముహూర్తాల మూఢ నమ్మకం తోడు కావటంతో... ఈ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. అయితే వీటికి చెక్ పెట్టేందుకు కరీంనగర్ జిల్లా అధికార యంత్రాగం చర్యలు చేపట్టింది. ఏకంగా పండితులు, పూజారులతో ఓ మీటింగ్ నే ఏర్పాటు చేసింది. సిజేరియన్ల ద్వారా వచ్చే అనర్ధాలను వివరించే ప్రయత్నం చేయటంతో పాటు.. వీటికి స్వస్తి పలకాలని స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Mlc Kavitha Remand : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, జూన్ 3 వరకు రిమాండ్ పొడిగింపు

Hyderabad Fish Prasadam : జూన్ 8, 9 తేదీల్లో చేప మందు పంపిణీ, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాట్లు

Do Dham IRCTC Tour Package : కేదార్ నాథ్, బద్రీనాథ్ దో ధామ్ యాత్ర- 7 రోజుల ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే!

TS ECT Results 2024 : తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డు ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

శుక్రవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ అవగాహన కార్యక్రమంలో... పూజారులు, జ్యోతిషులు బిడ్డలను కనేందుకు ఎలాంటి ముహూర్తాలు పెట్టబోమని హామీనిచ్చారు. దీనిపై కలెక్టర్ ఆర్కే కర్ణన్ హిందూస్థాన్ టైమ్స్ తో మాట్లాడుతూ.." వివాహం చేసే సమయంలో జాతకాలు, నక్షత్రాలు చూసేందుకు జ్యోతిషులను, పండితులను ప్రజలు కలవటం సంప్రాదాయంగా వస్తోంది. అయితే ఇది పిల్లలకు జన్మనిచ్చేందుకు కూడా ఆచరిస్తున్నారు. వీరి సూచన మేరకు గర్భిణీలకు సిజేరియన్ ఆపరేషన్లు చేయిస్తున్నారు " అని చెప్పారు.

నార్మల్ డెలివరీలపై అవగాహన..

ఈ మీటింగ్ లో నార్మల్ డెలివరీలపై అవగాహన కల్పించారు అధికారులు. పలువురు సీనియర్ గైనకాలజిస్టులతో పాటు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ అధికారులు కూడా హాజరయ్యారు. సాధారణ కాన్పులతో తల్లి బిడ్డకు చేకూరే లాభాలను వివరించారు.

'ఎమర్జెన్సీ అయితేనే ఆపరేషన్లు చేయాలి. సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీలకు ప్రయత్నించాలి. ఈ విషయంలో డాక్టర్లు అన్ని విధాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సిజేరియన్ డెలివర్లను పండితులు, జ్యోతిషులు ప్రోత్సహించవద్దని కోరుతున్నాను. అశాస్త్రీయమైన విధానాలతో టైమ్, తేదీలు చెప్పి  సీ- ఆపరేషన్లు జరిగేలా చూడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. సీ ఆపరేషన్లు కొన్నిసార్లు ప్రాణాలకు మీదకు వచ్చే పరిస్థితి ఉంటుంది. డాక్టర్లు కూడా సాధారణ డెలివరీలపై అవగాహన కల్పించాలి" - ఆర్కే కర్ణన్, కరీంనగర్ జిల్లా కలెక్టర్

ఈ సందర్భంగా సాధారణ డెలివరీలతో కలిగే లాభాలు.. సీ - ఆపరేషన్లతో వచ్చే నష్టాలను తెలిపేలా పోస్టర్లను రిలీజ్ చేశారు జిల్లా కలెక్టర్. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వీటిని ప్రదర్శించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమావేశం నేపథ్యంలో ఆదివారం పురోహితులు, పండితులు ఓ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సీ - ఆపరేషన్లకు ఎలాంటి ముహుర్తాలు పెట్టవద్దని నిర్ణయించారు. కొన్ని ఆలయాల్లో పోస్టర్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రజలు ఈ విషయంలో తమని సంప్రదించవద్దని విజ్ఞప్తి చేశారు.

'సీ- ఆపరేషన్లను మేం ప్రోత్సహించటం లేదు. బిడ్డ జననం అనేది సాధారణంగా జరిగిపోవాలి.  అందుకోసం ముహుర్తం అనేది దేవుడు నిర్ణయిస్తాడు. కానీ ప్రజలు ఆపరేషన్ల కోసం ముహుర్తం చూడమని తమని సంప్రదిస్తే మేం ఏం చేయాలి' అని పురోహితుడు నాగరాజ శర్మ అని అభిప్రాయపడ్డారు.

దేశంలోనే రెండో స్థానం…

2021 ఏడాదికి సంబంధించి నీతి అయోగ్ విడుదల చేసిన గణాంకాల్లో సీ- ఆపరేషన్లలో 53.51 శాతంతో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది తెలంగాణ. ఈ విషయంలో55.51 శాతంతో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. జాతీయ సగటు రేటు కంటే రెండింతలు తెలంగాణలో ఈ ఆపరేషన్లు జరుగుతున్నట్లు తేల్చింది. ఇక ఈ విషయంలో కరీంనగర్ జిల్లా 69.93శాతంతో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 65.42 శాతంతో ఖమ్మం జిల్లా మూడో స్థానంలో ఉంది.

మరోవైపు ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. రాష్ట్రంలో సీ- ఆపరేషన్ల సంఖ్య పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.  వీటిని తగ్గించటంపై ప్రభుత్వం దృషి పెట్టిందని.. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

తదుపరి వ్యాసం