తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  1 Lakh For Bcs : రూ. లక్ష సాయంపై కీలక అప్డేట్… ఈనెల 15న చెక్కుల అందజేత..!

1 Lakh For BCs : రూ. లక్ష సాయంపై కీలక అప్డేట్… ఈనెల 15న చెక్కుల అందజేత..!

13 July 2023, 13:48 IST

    • Telangana Govt News: బీసీల్లో వెనుకబడిన చేతివృత్తులు, కుల వృత్తుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక ప్రకటించిన సంగతి తెలిసిందే. లబ్ధిదారులకు డబ్బుల అందజేతకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది సర్కార్.
బీసీలకు లక్ష సాయం
బీసీలకు లక్ష సాయం

బీసీలకు లక్ష సాయం

1 Lakh Aid to Practitioners of BC Caste Occupations: తెలంగాణలోని బీసీ చేతి, కుల వృత్తుల వారికి రూ.లక్ష ఆర్థికసాయం పథకాన్ని తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తికాగా.... లబ్ధిదారుల ఎంపిక పై కసరత్తు కూడా పూర్తి కావొచ్చింది. ఇప్పటికే రూ.400 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. వీటిని బీసీ కార్పొరేషన్‌ ద్వారా వెచ్చించాలని ఆదేశించగా…. ఈ పథకానికి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే లబ్ధిదారలకు చెక్కుల అందజేతకు ముహుర్తం ఫిక్స్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Sircilla News : రూ. 7 వేలు లంచం డిమాండ్, ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ సీనియర్ అసిస్టెంట్

ACB Raids On MRO : భూమి రిజిస్ట్రేషన్ కు లంచం డిమాండ్- ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో, ధరణి ఆపరేటర్

Hyderabad Finance Fraud : హైదరాబాద్ లో బోర్డు తిప్పేసిన మరో ఫైనాన్స్ సంస్థ, రూ.200 కోట్లు స్వాహా!

TS Cabinet Decisions : ధాన్యం కొనుగోళ్ల బాధ్యత కలెక్టర్లకే, సన్న వడ్లకే రూ.500 బోనస్- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే!

జులై 15న చెక్కులు అందజేత…!

ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులకు జులై 15వ తేదీన చెక్కులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా వీటిని అందజేయనున్నారు. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక కూడా ఖరారైంది. ఆ దిశగా ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తోంది. తొలి విడతలో ప్రతి నియోజకవర్గంలో 50 కుటుంబాలకు ఈ సాయాన్ని అందించనున్నారు.మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 5,950 మందికి తొలి విడతలో ఈ సాయం అందించనున్నారు.

మరో విడతలో మరికొందరికి….

ఈ స్కీమ్ కు 5 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా…. తొలి విడతలో మాత్రం 5950 మందికి మాత్రమే లక్ష రూపాయల సాయం అందించనున్నారు. మరికొన్ని విడతల్లో అర్హులైన వానిరి ఎంపిక చేస్తారు. ఇదే విషయంపై ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసింది. విడతల వారీగా ప్రతి నెల 15వ తేదీన చెక్కులను అందజేస్తామని పేర్కొంది. ప్రతి నెల 5వ తేదీలోపు కలెక్టర్లు లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపిస్తారు. ఇన్‌చార్జి మంత్రులు ధ్రువీకరించిన జాబితాలోని లబ్ధిదారులకు ప్రతి నెలా 15లోగా స్థానిక ఎమ్మెల్యేలు రూ.లక్ష ఆర్థికసాయం అందజేస్తారు. దరఖాస్తు ఫారంను ఏ ఆఫీసులోనూ, ఏ అధికారికి అందజేయాల్సిన అవసరం లేదు. లబ్ధిదారులు నెలరోజుల్లోగా తమకు నచ్చిన, కావాల్సిన పనిముట్లను, సామగ్రిని కొనుకోవాలని…. ఆ నిర్ణయాధికారం పూర్తిగా లబ్ధిదారులదేనని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కొనుగోలు చేసిన యూనిట్ల ఫొటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

తదుపరి వ్యాసం