తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Bray Wyatt Dead: 36 ఏళ్లకే కన్ను మూసిన స్టార్ రెజ్లర్.. డబ్ల్యూడబ్ల్యూఈలో తీవ్ర విషాదం

Bray Wyatt Dead: 36 ఏళ్లకే కన్ను మూసిన స్టార్ రెజ్లర్.. డబ్ల్యూడబ్ల్యూఈలో తీవ్ర విషాదం

Hari Prasad S HT Telugu

25 August 2023, 7:55 IST

    • Bray Wyatt Dead: 36 ఏళ్లకే కన్ను మూశాడు స్టార్ రెజ్లర్ బ్రే వ్యాట్. దీంతో వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్మెంట్ (WWE)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతని అకాల మరణం రెజ్లింగ్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది.
స్టార్ రెజ్లర్ బ్రే వ్యాట్
స్టార్ రెజ్లర్ బ్రే వ్యాట్

స్టార్ రెజ్లర్ బ్రే వ్యాట్

Bray Wyatt Dead: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్మెంట్ (WWE)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్టార్ రెజ్లర్ బ్రే వ్యాట్ (Bray Wyatt) 36 ఏళ్ల వయసులోనే కన్ను మూశాడు. ఈ విషయాన్ని డబ్ల్యూడబ్ల్యూఈ సీఈవో ట్రిపుల్ హెచ్ (Triple H) ధృవీకరించాడు. ఈ అకాల మరణం గురించి అతని కుటుంబ సభ్యులు తమకు వెల్లడించినట్లు అతడు చెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

బ్రే వ్యాట్ అసలు పేరు విండామ్ రొటుండా. "డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమర్ మైక్ రొటుండా నుంచి ఇప్పుడే కాల్ వచ్చింది. డబ్ల్యూడబ్ల్యూఈ కుటుంబ సభ్యుడైన విండామ్ రొటుండా అలియాస్ బ్రే వ్యాట్ అకాల మరణం చెందినట్లు ఆయన చెప్పారు. ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి. ఈ సమయంలో ఆ కుటుంబానికి కావాల్సిన ప్రైవసీ ఇవ్వండి" అని సోషల్ మీడియాలో ట్రిపుల్ హెచ్ కోరాడు.

గురువారం (ఆగస్ట్ 24) రాత్రి బ్రే వ్యాట్ కన్నుమూసినట్లు డబ్ల్యూడబ్ల్యూఈ కూడా ఒక ప్రకటనలో వెల్లడించింది. అతని మరణ వార్త విని షాక్ కు గురైనట్లు చెప్పాడు ది రాక్ (డ్వేన్ జాన్సన్). "బ్రే వ్యాట్ మరణం నన్ను కలిచి వేసింది. అతనిపై ఎప్పుడూ ఎంతో గౌరవం, ప్రేమ ఉన్నాయి. ప్రత్యేకమైన వ్యక్తి. అరుదైన వ్యక్తిత్వం అతని సొంతం. లెజెండ్ టెర్రీ ఫంక్ మరణవార్తను జీర్ణించుకునేలోపే బ్రే మరణం చాలా బాధేస్తోంది" అని ది రాక్ అన్నాడు.

ఈ మధ్య కాలంలో బ్రే వ్యాట్ డబ్ల్యూడబ్ల్యూఈ (WWE)లో కనిపించడం లేదు. 2009లో ప్రొఫెషనల్ రెజ్లర్ గా మారాడు వ్యాట్. రింగులోకి అతని ఎంట్రీ ఎంతో ఆకట్టుకునేది. ప్రముఖ రెజ్లర్ అండర్‌టేకర్ వచ్చేటప్పుడు లైట్లన్నీ ఎలా ఆపేసేవారో బ్రే వ్యాట్ వచ్చే సమయంలోనూ అలాగే చేసేవారు. అతడో లాంతరు పట్టుకొని మెల్లగా ఎంట్రీ ఇచ్చేవాడు.

అంతేకాదు డిఫరెంట్ క్యారెక్టర్లతోనూ బ్రే వ్యాట్ అలరించేవాడు. రింగులో తన రెజ్లింగ్ స్కిల్స్ తోపాటు బయట అతడు చేసే విన్యాసాలు పిల్లలను బాగా ఆకట్టుకునేవి. డబ్ల్యూడబ్ల్యూఈ రింగులో బ్రే వ్యాట్ చివరిసారి 2023 రాయల్ రంబుల్ లో తలపడ్డాడు.

టాపిక్

తదుపరి వ్యాసం