తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wpl Auction: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో అత్యధిక ధర పలికిన టాప్ 10 ఇండియన్ ప్లేయర్స్ వీళ్లే

WPL Auction: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో అత్యధిక ధర పలికిన టాప్ 10 ఇండియన్ ప్లేయర్స్ వీళ్లే

Hari Prasad S HT Telugu

13 February 2023, 21:15 IST

    • WPL Auction: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం(WPL Auction)లో అత్యధిక ధర పలికిన టాప్ 10 ఇండియన్ ప్లేయర్స్ లో ఇండియన్ టీమ్ కు ఆడుతున్న ప్లేయర్సే ఉన్నారు. వేలంలోనే అత్యధికంగా స్మృతి మంధానా రూ.3.4 కోట్లు పలికింది.
స్మృతి మంధానా, హర్మన్‌ప్రీత్ కౌర్
స్మృతి మంధానా, హర్మన్‌ప్రీత్ కౌర్ (AFP)

స్మృతి మంధానా, హర్మన్‌ప్రీత్ కౌర్

WPL Auction: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం(WPL Auction)లో ఏకంగా 10 మంది ఇండియన్ ప్లేయర్స్ రూ.కోటికిపైగా ధర పలకడం విశేషం. వీళ్లలో స్మృతి మంధానా టాప్ లో నిలవగా.. ఆల్ రౌండర్ దీప్తి శర్మ కూడా రూ.2.6 కోట్లతో ఆశ్చర్యపరిచింది. సోమవారం (ఫిబ్రవరి 13) ముంబైలో ఈ డబ్ల్యూపీఎల్ వేలం జరిగింది. ముందుగానే ఊహించినట్లే ఇండియన్ ప్లేయర్సే ఎక్కువ డిమాండ్ పలికారు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

తొలి డబ్ల్యూపీఎల్ మార్చి 3 నుంచి 26 వరకూ జరగనుంది. మొత్తం వేలంలో రూ.3.4 కోట్లతో ఇండియన్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధానా టాప్ లో నిలవడం విశేషం. ఆమెను బెంగళూరు టీమ్ కొనుగోలు చేసింది. ఇప్పుడీ టీమ్ కు ఆమెనే కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆమె తర్వాత ఆల్ రౌండర్ దీప్తి శర్మను రూ.2.6 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది యూపీ వారియర్స్.

ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ కోసం సౌతాఫ్రికాలో ఉన్న ఇండియన్ ప్లేయర్స్ ఈ వేలాన్ని టీవీల్లో లైవ్ చూశారు. తనకు వేలంలో అత్యధిక ధర పలికిన తర్వాత స్మృతి మంధానా నమస్కార బెంగళూరు అంటూ ట్వీట్ చేసింది. అటు బెంగళూరు టీమ్ కూడా విరాట్ కోహ్లితో స్మృతి షేక్ హ్యాండ్ ఇచ్చిన ఫొటోను షేర్ చేసింది. ఇక ఇండియన్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రూ.1.8 కోట్లు పలకడం విశేషం.

డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ లో మొత్తం ఐదు టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇందులో మూడు టీమ్స్ ను ఇప్పటికే ఐపీఎల్లో ఉన్న ఫ్రాంఛైజీలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ డబ్ల్యూపీఎల్లో ఆడనున్నాయి.

వేలంలో టాప్ 10 ఇండియన్ ప్లేయర్స్ వీళ్లే..

స్మృతి మంధానా - రూ.3.4 కోట్లు (బెంగళూరు)

దీప్తి శర్మ - రూ.2.6 కోట్లు (యూపీ వారియర్స్)

జెమీమా రోడ్రిగ్స్ - రూ.2.2 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)

షెఫాలీ వర్మ - రూ.2 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)

పూజా వస్త్రకర్ - రూ.1.9 కోట్లు (ముంబై ఇండియన్స్)

రిచా ఘోష్ - రూ.1.9 కోట్లు (బెంగళూరు)

హర్మన్‌ప్రీత్ కౌర్ - రూ.1.8 కోట్లు (ముంబై ఇండియన్స్)

రేణుకా సింగ్ - రూ.1.5 కోట్లు (బెంగళూరు)

యాస్తికా భాటియా - రూ.1.5 కోట్లు (ముంబై ఇండియన్స్)

దేవికా వైద్య - రూ.1.4 కోట్లు (యూపీ వారియర్స్)

తదుపరి వ్యాసం