తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  World Cup Qualifiers: వన్డేల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన జింబాబ్వే.. చిత్తుచిత్తుగా ఓడిన యూఎస్ఏ

World Cup qualifiers: వన్డేల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన జింబాబ్వే.. చిత్తుచిత్తుగా ఓడిన యూఎస్ఏ

Hari Prasad S HT Telugu

26 June 2023, 21:44 IST

    • World Cup qualifiers: వన్డేల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది జింబాబ్వే. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో యూఎస్ఏని చిత్తుచిత్తుగా ఓడించింది. వన్డేల్లో రెండో అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.
జింబాబ్వే బ్యాటర్ సీన్ విలియమ్స్
జింబాబ్వే బ్యాటర్ సీన్ విలియమ్స్ (AP)

జింబాబ్వే బ్యాటర్ సీన్ విలియమ్స్

World Cup qualifiers: వన్డే క్రికెట్ లో జింబాబ్వే టీమ్ ఓ కొత్త రికార్డును సొంతం చేసుకుంది. వన్డే వరల్డ్ క్వాలిఫయర్స్ లో భాగంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా(యూఎస్ఏ)తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 304 పరుగులు తేడాతో విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇది రెండో అతి పెద్ద విజయం కావడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

సీన్ విలియమ్స్ కేవలం 101 బంతుల్లోనే 174 రన్స్ చేశాడు. దీంతో జింబాబ్వే 50 ఓవర్లలో 6 వికెట్లకు 408 రన్స్ చేసింది. ఆ జట్టుకు వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు. అయితే ఆ తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన యూఎస్ఏ కేవలం 104 పరుగులకే కుప్పకూలింది. గ్రూప్ ఎలో ఉన్న జింబాబ్వేకు ఇది వరుసగా నాలుగో విజయం.

వన్డేల్లో పరుగుల పరంగా అతిపెద్ద విజయం ఇండియా పేరిట ఉంది. తిరువనంతపురంలో శ్రీలంకపై 317 పరుగుల తేడాతో ఇండియా గెలిచింది. ఆ రికార్డుకు జింబాబ్వే 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

జింబాబ్వే ఇన్నింగ్స్ లో సీన్ విలియమ్స్ చెలరేగిపోయాడు. అతని ఇన్నింగ్స్ లో 21 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఇక మిగతా బ్యాటర్ల విషయానికి వస్తే సికిందర్ రజా 27 బంతుల్లో 48, రియాన్ బర్ల్ 16 బంతుల్లో 47 రన్స్ చేశారు. ఆ తర్వాత యూఎస్ఏ 25.1 ఓవర్లలోనే 104 పరుగులకు ఆలౌటైంది. రిచర్డ్ ఎన్‌గరవ, సికిందర్ రజా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

జింబాబ్వే వరుసగా నాలుగు విజయాలతో గ్రూప్ ఎలో టాప్ లో కొనసాగుతోంది. నెదర్లాండ్స్ నాలుగు మ్యాచ్ లలో మూడు విజయాలతో రెండోస్థానంలో, వెస్టిండీస్ 4 మ్యాచ్ లలో రెండు విజయాలు, రెండు పరాజయాలతో మూడోస్థానంలో ఉన్నాయి. ఇక గ్రూప్ బిలో శ్రీలంక వరుసగా మూడు విజయాలతో టాప్ లో ఉంది.

తదుపరి వ్యాసం