తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  World Cup 2023 Qualifiers: డేంజర్‌లో వెస్టిండీస్.. టాప్‌లో శ్రీలంక.. క్వాలిఫయర్స్ సూపర్ 6 నేటి నుంచే..

World Cup 2023 Qualifiers: డేంజర్‌లో వెస్టిండీస్.. టాప్‌లో శ్రీలంక.. క్వాలిఫయర్స్ సూపర్ 6 నేటి నుంచే..

Hari Prasad S HT Telugu

28 June 2023, 9:45 IST

    • World Cup 2023 Qualifiers: డేంజర్‌లో వెస్టిండీస్.. టాప్‌లో శ్రీలంక.. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ సూపర్ 6 బుధవారం (జూన్ 28) నుంచే ప్రారంభం కాబోతోంది. ఈ స్టేజ్ షెడ్యూల్ ఏంటో ఓసారి చూద్దాం.
వెస్టిండీస్ క్రికెట్ టీమ్
వెస్టిండీస్ క్రికెట్ టీమ్ (AP)

వెస్టిండీస్ క్రికెట్ టీమ్

World Cup 2023 Qualifiers: వన్డే వరల్డ్ కప్ తొలి రెండుసార్లు ఛాంపియన్ గా నిలిచిన వెస్టిండీస్ డేంజర్ లో ఉంది. 1996 ఛాంపియన్ శ్రీలంక మాత్రం టాప్ లో క్వాలిఫయర్స్ సూపర్ 6 స్టేజ్ కు అర్హత సాధించింది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ లలో జరగబోయే వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధించడానికి ఆరు జట్లు బుధవారం (జూన్ 28) నుంచి క్వాలిఫయర్స్ సూపర్ 6 స్టేజ్ లో తలపడనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

గ్రూప్ ఎ నుంచి జింబాబ్వే, వెస్టిండీస్, నెదర్లాండ్స్ ఈ సూపర్ 6కు అర్హత సాధించగా.. గ్రూప్ బి నుంచి శ్రీలంక, ఒమన్, స్కాట్లాండ్ వచ్చాయి. ఇప్పుడీ ఆరు జట్లలో ఫైనల్ చేరబోయే రెండు టీమ్స్ వరల్డ్ కప్ కు అర్హత సాధిస్తాయి. రెండు మాజీ ఛాంపియన్ టీమ్స్ వెస్టిండీస్, శ్రీలంక ఉండటంతో ఈ సూపర్ 6 స్టేజ్ ఆసక్తి రేపుతోంది.

ఏంటీ సూపర్ 6 స్టేజ్?

లీగ్ స్టేజ్ లో సొంతం చేసుకున్న పాయింట్లలో సగం పాయింట్లు ఈ సూపర్ 6 స్టేజ్ కు కూడా జట్లు తీసుకెళ్లడం ఇక్కడ విశేషం. ఆ లెక్కన శ్రీలంక, జింబాబ్వే జట్లు నాలుగేసి పాయింట్లతో ప్రస్తుతం సూపర్ 6లో టాప్ లో ఉన్నాయి. స్కాట్లాండ్, నెదర్లాండ్స్ రెండేసి పాయింట్లతో ఉండగా.. వెస్టిండీస్, ఒమన్ జట్లు సున్నా పాయింట్లతో ఉన్నాయి. ఈ లెక్కన వెస్టిండీస్ ఫైనల్ చేరాలంటే సూపర్ 6లో అన్ని మ్యాచ్ లలోనూ గెలవాల్సిన పరిస్థితి.

క్వాలిఫయర్ సూపర్ 6 స్టేజ్ షెడ్యూల్

జూన్ 29: జింబాబ్వే v ఒమన్

జూన్ 30: శ్రీలంక v నెదర్లాండ్స్

జులై 1: స్కాట్లాండ్ v వెస్టిండీస్

జులై 2: జింబాబ్వే v శ్రీలంక

జులై 3: నెదర్లాండ్స్ v ఒమన్

జులై 4: జింబాబ్వే v స్కాట్లాండ్

జులై 5: వెస్టిండీస్ v ఒమన్

జులై 6: స్కాట్లాండ్ v నెదర్లాండ్స్

జులై 7: శ్రీలంక v వెస్టిండీస్

జులై 9: ఫైనల్

ఈ సూపర్ 6 మ్యాచ్ లు అన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమవుతాయి. వీటిని స్టార్ స్పోర్ట్స్ ఛానెల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లలో చూడొచ్చు. ఫ్యాన్‌కోడ్ వెబ్‌సైట్, యాప్ లలోనూ ఈ మ్యాచ్ లు స్ట్రీమ్ అవుతాయి.

తదుపరి వ్యాసం