SL vs AFG: 96 బాల్స్‌లోనే వ‌న్డే మ్యాచ్‌ను ముగించేశారు - వ‌న్డే సిరీస్ శ్రీలంక‌దే-sri lanka beat afghanistan by 9 wickets in 3rd odi win series ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Sri Lanka Beat Afghanistan By 9 Wickets In 3rd Odi Win Series

SL vs AFG: 96 బాల్స్‌లోనే వ‌న్డే మ్యాచ్‌ను ముగించేశారు - వ‌న్డే సిరీస్ శ్రీలంక‌దే

HT Telugu Desk HT Telugu
Jun 08, 2023 07:03 AM IST

SL vs AFG: ఆఫ్ఘ‌నిస్తాన్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో శ్రీలంక తొమ్మిది వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌తో మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-1 తేడాతో శ్రీలంక సొంతం చేసుకున్న‌ది.

హ‌స‌రంగ
హ‌స‌రంగ

SL vs AFG: ఆఫ్ఘ‌నిస్తాన్‌తో జ‌రిగిన మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-1 తేడాతో శ్రీలంక సొంతం చేసుకున్న‌ది. బుధ‌వారం జ‌రిగిన మూడో వ‌న్డేలో లంక బౌలింగ్ ధాటికి ఆఫ్ఘ‌న్ బ్యాట్స్‌మెన్స్ విల‌విల‌లాడిపోయారు. ఈ వ‌న్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో ఆఫ్ఘ‌నిస్తాన్‌ను శ్రీలంక చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘ‌నిస్తాన్ 22.2 ఓవ‌ర్ల‌లో 116 ప‌రుగుల‌కే ఆలౌటైంది.

ట్రెండింగ్ వార్తలు

23 ర‌న్స్‌తో న‌బీ టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఇబ్ర‌హీం జ‌ర్దాన్ 22, గుల్‌బ‌దానై 20 ర‌న్స్ చేశారు. వారి త‌ర్వాత 11 నంబ‌ర్ బ్యాట్స్‌మెన్ ఫ‌రీద్ అహ్మ‌ద్ 13 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా ఉన్నాడు. శ్రీలంక బౌల‌ర్ల‌లో చ‌మీరా నాలుగు, హ‌స‌రంగ 3 వికెట్లు, కుమార రెండు వికెట్లు ద‌క్కించుకున్నారు. పొదుపుగా బౌలింగ్ చేసిన హ‌స‌రంగ నాలుగు ఓవ‌ర్ల‌లో కేవ‌లం ఏడు ర‌న్స్ మాత్ర‌మే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.

117 ప‌రుగుల ల‌క్ష్యాన్ని శ్రీలంక కేవ‌లం 96 బాల్స్‌లోనే (16 ఓవ‌ర్లు)ఛేదించింది. ఓపెన‌ర్లు నిస్సాంక‌, క‌రుణ ర‌త్నే హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. నిస్సాంక 34 బాల్స్‌లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 51 ర‌న్స్ చేయ‌గా, క‌రుణ‌ర‌త్నే 45 బాల్స్‌లో ఏడు ఫోర్ల‌తో 56 ర‌న్స్ చేశాడు.

నిస్సాంక ఔట్ కావ‌డంతో శ్రీలంక విజ‌యం ఆల‌స్య‌మైంది. లేదంటే 15 ఓవ‌ర్ల‌లోపే ఈ వ‌న్డే మ్యాచ్ ముగిసేలా క‌నిపించింది. 204 బాల్స్ మిగిలుండ‌గానే శ్రీలంక విజ‌యాన్ని అందుకున్న‌ది. బాల్స్ ప‌రంగా వ‌న్డేల్లో శ్రీలంక‌కు అతి పెద్ద విజ‌యాల్లో ఇది ఒక‌టి కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ విజ‌యంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-1 తేడాతో శ్రీలంక కైవ‌సం చేసుకున్న‌ది. తొలి వ‌న్డేలో ఆఫ్ఘ‌నిస్తాన్ విజ‌యం సాధించ‌గా మిగిలిన రెండు వ‌న్డేల్లో శ్రీలంక విజ‌యాన్ని సాధించింది.

WhatsApp channel