తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kohli Breaks Dravid Record: రాహుల్ ద్రావిడ్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన కోహ్లి

Kohli Breaks Dravid Record: రాహుల్ ద్రావిడ్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన కోహ్లి

26 September 2022, 12:30 IST

  • Kohli Breaks Dravid Record: ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో కోహ్లి రాణించాడు. ఈ మ్యాచ్ తో టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ అరుదైన రికార్డును కోహ్లి అధిగమించాడు. ఆ రికార్డ్ ఏదంటే...

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (twitter/kohli)

విరాట్ కోహ్లి

Kohli Breaks Dravid Record: ఆదివారం ఆస్ట్రేలియాతో జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 63 ప‌రుగుల‌తో కోహ్లి రాణించాడు. ప్రారంభంలోనే కె.ఎల్‌.రాహుల్‌, రోహిత్ శ‌ర్మ (Rohit sharma) వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ఉన్న టీమ్ ఇండియాను సూర్య‌కుమార్ యాద‌వ్‌తో క‌లిసి కోహ్లి విజ‌యానికి చేరువ‌లోకి తీసుకొచ్చాడు. చివ‌ర్లో హార్దిక్ మెరుపుల‌తో ఆరు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా విజ‌యాన్ని అందుకున్న‌ది. ఈ టీ20 మ్యాచ్ లో కోహ్లి 48 బాల్స్ లో నాలుగు సిక్స‌ర్లు, మూడు ఫోర్ల‌తో 63 ర‌న్స్ చేశాడు. గ‌త కొన్ని రోజులుగా ఫామ్ కోల్పోయి స‌త‌మ‌త‌మ‌వుతున్న కోహ్లి ధనాధన్ ఇన్నింగ్స్ తో విమ‌ర్శ‌కుల‌కు మ‌రోసారి స‌మాధానం చెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు కోహ్లి భారీ ఇన్నింగ్ తో ఆక‌ట్టుకోవ‌డంతో క్రికెట్ అభిమానులు సంబ‌ర‌ప‌డుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌తో కోహ్లి అరుదైన రికార్డ్‌ను నెల‌కొల్పాడు. మూడు ఫార్మెట్ల‌లో క‌లిసి అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో టీమ్ ఇండియా క్రికెట‌ర్‌గా నిలిచింది. టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid)రికార్డును కోహ్లి అధిగమించాడు.

మూడు ఫార్మెట్లలో కలిసి ద్రావిడ్ 504 మ్యాచుల్లో 24064 రన్స్ చేశాడు. ఆదివారం నాటి మ్యాచ్ తో కోహ్లి 24078 రన్స్ తో ద్రావిడ్ రికార్డును అధిగమించాడు. కేవలం 471 మ్యాచుల్లోనే కోహ్లి ఈ రన్స్ చేయడం గమనార్హం. ఈ జాబితాలో కోహ్లి కంటే ముందు క్రికెట్ దిగ్గజం సచిన్ (Sachin) మాత్రమే ఉన్నాడు. 664 మ్యాచ్ లు ఆడిన సచిన్ 34 357 రన్స్ చేశాడు.

అత్యధిక పరుగుల జాబితాలో కోహ్లి తర్వాతే సౌరభ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వగ్, ధోనీ ఉన్నారు. అంతే కాకుండా టీ20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్ గా కోహ్లి నిలిచాడు. 107 టీ20 ఇంటర్ నేషనల్ మ్యాచ్ లు ఆడిన కోహ్లి 3660 రన్స్ చేశాడు. 3694 రన్స్ తో అతడి కంటే ముందు రోహిత్ శర్మ ఉన్నాడు.

తదుపరి వ్యాసం