తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli On Roger Federer: ఆటలో ఉన్న అందమిదే.. ఇంతకంటే బెస్ట్ పిక్చర్ లేదు.. ఫెదరర్‌ రిటైర్మెంట్‌పై కోహ్లీ పోస్ట్

Virat Kohli on Roger Federer: ఆటలో ఉన్న అందమిదే.. ఇంతకంటే బెస్ట్ పిక్చర్ లేదు.. ఫెదరర్‌ రిటైర్మెంట్‌పై కోహ్లీ పోస్ట్

24 September 2022, 13:29 IST

    • Virat kohli on Federer and Nadal: రోజర్ ఫెదరర్ లేవర్ కప్‌ అనంతరం తన ప్రొఫెషనల్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా ఈ టోర్నీలో ఓటమి పాలవడంతో కన్నీటి పర్యంతం అయ్యాడు. ఫెదరర్‌తో నాదల్‌ కూడా ఎమోషనల్ అయ్యాడు. దీంతో వీరిద్దరూ కలిసున్న ఫొటోను భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ షేర్ చేశాడు.
ఫెదరర్-నాదల్
ఫెదరర్-నాదల్ (Twitter)

ఫెదరర్-నాదల్

Virat Kohli Tweet on Roger Federer: స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ప్రొఫెషనల్ శకం ముగిసింది. ఆటకు ఇప్పటికే గుడ్‌బై చెప్పిన ఫెదరర్.. శుక్రవారం లేవర్ కప్‌లో రఫెల్ నాదల్‌తో కలిసి తన చివరి మ్యాచ్ ఆడాడు. ఈ డబుల్స్ మ్యాచ్‌లో జాక్ సాక్స్-ఫ్రాన్సీస్ టియాఫో చేతిలో ఫెదరర్-నాదల్ ద్వయం పరాజయం పాలైంది. కెరీర్‌ను విజయంతో ముగించాలనుకున్న రోజర్‌కు ఘనమైన వీడ్కొలు దక్కలేదు. చివరి ప్రొఫెషనల్ మ్యాచ్ అనంతరం ఫెదరర్‌తో పాటు సహచర ఆటగాడు నాదల్ కూడా కన్నీటి పర్యంతం అయ్యాడు. ఫెదరర్ రిటైర్మెంట్‌పై ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తన స్పందనలను తెలియజేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఫెదరర్ గురించి పోస్టు పెట్టాడు. నాదల్‌తో కలిసి అతడు కూర్చున్న ఫొటోను షేర్ చేసి.. అత్యంత అందమైన స్పోర్ట్స్ పిక్చర్ ఇదేనంటూ ట్వీట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

"ప్రత్యర్థులు ఒకరితో మరొకరు ఇలా ఉంటారని ఎవరు అనుకుంటారు? ఇంత ఆత్మీయతతో ఉంటారని ఎవ్వరూ భావించరు. ఇదే ఆటలోనే అందం. నాకు నచ్చిన అత్యంత అందమైన స్పోర్ట్స్ పిక్చర్ ఇదే. మీ సహచరులు మీ కోసం ఏడుస్తారు, భగవంతుడు ఇచ్చిన ప్రతిభతో గౌరవం మినహా ఇంతకంటే ఏం సాధించలేరు. వీరిద్దరిని ఓ సారి చూడండి." అంటూ విరాట్ కోహ్లీ తన ట్విటర్‌లో పోస్ట్ పెట్టాడు.

ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫెదరర్-నాదల్ పక్క పక్కన కూర్చొని ఉండగా.. స్విస్ స్టార్‌తో పాటు స్పెయిన్ బుల్ రఫా కూడా భావోద్వేగం చెందుతున్నట్లు ఉన్న ఈ ఫొటోపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. క్రీడా సమాజం నుంచి ఈ ఫొటోపై విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి.

స్పెయిన్ బుల్‌ రఫెల్ నాదల్‌తో కలిసి లేవర్ కప్ డబుల్స్ మ్యాచ్‌లో ఓడిన అతడు పరాజయంతో ఆటకు గుడ్‌బై చెప్పాడు. సెంటర్ కోర్టు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వరల్డ్ టీమ్.. జాక్స్ సాక్స్- ఫ్రాన్సీస్ టియాఫే జోడీ చేతిలో ఫెదరర్-రఫా ద్వయం ఓటమి పాలైంది. రెండు గంటల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో నాదల్-ఫెదరర్ తీవ్రంగా పోరాడారు. అయితే చివరకు 4-6, 7-6(7-2), 11-9 తేడాతో ఓటమి పాలయ్యారు.

తదుపరి వ్యాసం