తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli Practice Video Viral: నెట్స్‌లో కోహ్లీ చెమటలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Virat Kohli Practice Video Viral: నెట్స్‌లో కోహ్లీ చెమటలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

08 November 2022, 14:20 IST

  • Virat Kohli Practice Video Viral: ఇప్పటికే టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌కు చేరిన టీమిండియా టైటిల్ లక్ష్యంగా సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా భారత ఆటగాళ్లు నెట్స్‌లో చెమటలు చిందిస్తున్నారు. విరాట్ కోహ్లీ నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (AFP)

విరాట్ కోహ్లీ

Virat Kohli Practice Video Viral: టీ20 వరల్డ్ కప్ టోర్నీ చివరి దశకు చేరుకుంది. భారత్ మరో రెండు మ్యాచ్‌లు గెలిచిందంటే కప్పు కైవసం చేసుకునే అవకాశముంటుంది. అడిలైడ్ వేదికగా నవంబరు 10న ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్‌లో అమీ తుమీ తేల్చుకోనుంది భారత్. అందుకోసం టీమిండియా అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఆటగాళ్లంతా నెట్స్‌లో ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. తాజాగా టీమిండియా విరాట్ కోహ్లీ కూడా ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెట్స్‌లో అతడు చెమటలు చిందిస్తూ కనిపించాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ వీడియోను విరాట్ కోహ్లీనే తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ఈ ప్రాసెస్‌ను ఎంజాయ్ చేస్తున్నా అంటూ వీడియోకు క్యాప్షన్‌ను జోడించాడు. అంతేకాకుండా హార్ట్ ఎమోజీలను జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

షేర్ చేసిన గంటల వ్యవధిలోనే 5 మిలియన్లకు పైగా వీక్షణలు అందుకుంది. అంతేకాకుండా పది లక్షలు కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు కూడా విశేషంగా స్పందించారు. దయచేసి గురువారం కూడా ఇలాగే ఆడు అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. గురువారం కూల్‌గా ఆడండి అంటూ మరో వ్యక్తి పోస్ట్ పెట్టాడు.

బుధవారం సిడ్నీలో జరగనున్న తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ తలపడనుండగా.. నవంబర్ 10న జరిగే రెండో సెమీ ఫైనల్‌లో భారత్.. ఇంగ్లాండ్‌ను ఢీ కొట్టనుంది. ప్రస్తుతం టీమిండియా సెమీస్ చేరడమే కాకుండా గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఇందులో గెలిస్తే ఫైనల్‌కు చేరుతుంది.

తదుపరి వ్యాసం