Virat Kohli Birthday: హ్యాపీ బ‌ర్త్‌డే కింగ్ కోహ్లి - విరాట్‌కు స్పెష‌ల్ విషెస్‌ చెప్పిన క్రికెట‌ర్స్‌-virat kohli birthday cricket legends special wishes for virat kohli on his 34th birthday ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli Birthday: హ్యాపీ బ‌ర్త్‌డే కింగ్ కోహ్లి - విరాట్‌కు స్పెష‌ల్ విషెస్‌ చెప్పిన క్రికెట‌ర్స్‌

Virat Kohli Birthday: హ్యాపీ బ‌ర్త్‌డే కింగ్ కోహ్లి - విరాట్‌కు స్పెష‌ల్ విషెస్‌ చెప్పిన క్రికెట‌ర్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 05, 2022 12:28 PM IST

Virat Kohli Birthday: టీమ్ ఇండియా దిగ్గ‌జ క్రికెట‌ర్ విరాట్ కోహ్లి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా ద్వారా అత‌డికి ప‌లువురు క్రికెట‌ర్లు శుభాకాంక్ష‌లు అంద‌జేస్తున్నారు. ఈ పోస్ట్‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్య‌
విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్య‌

Virat Kohli Birthday: నేడు టీమ్ ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు విరాట్ కోహ్లి బ‌ర్త్‌డే. గ‌త రెండేళ్లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు ప‌డుతోన్న కోహ్లి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో మాత్రం ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో అద‌ర‌గొడుతున్నాడు. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో హ‌య్యెస్ట్ స్కోర‌ర్‌గా నిలిచాడు కోహ్లి.

ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచ‌రీలు చేశాడు. అంతే కాకుండా పొట్టి వ‌ర‌ల్డ్ క‌ప్‌లో హ‌య్యెస్ట్ ర‌న్స్‌, హ‌య్యెస్ట్ హాఫ్ సెంచ‌రీలు చేసిన క్రికెట‌ర్‌గా విరాట్ కోహ్లి రికార్డ్ క్రియేట్ చేశాడు. శ‌నివారం విరాట్ కోహ్లి పుట్టిన‌రోజు పుర‌స్క‌రించుకొని ప‌లువురు దిగ్గ‌జ క్రికెట‌ర్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా విరాట్ కోహ్లికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అంద‌జేశారు.

విరాట్ కోహ్లి స్పెష‌ల్‌గా ఓ వీడియో ద్వారా సౌతాఫ్రికా మాజీ క్రికెట‌ర్, ఆర్‌సీబీ ప్లేయ‌ర్ ఏబీ డివిలియ‌ర్స్ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అంద‌జేశాడు. బెంగ‌ళూరులో ఉండి నీకు వీడియో ద్వారా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అంద‌జేయ‌డం స‌ర‌దాగా ఉంద‌ని డివిలియ‌ర్స్ పేర్కొన్నాడు. నువ్వో అసాధార‌ణ ప్లేయ‌ర్‌వి, అంత‌కుమించి గొప్ప మ‌న‌సున్న మ‌నిషివి అంటూ డివిలియ‌ర్స్ ఈ వీడియోలో పేర్కొన్నాడు.

ప‌దిహేనేళ్ల కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన విజ‌యాల్ని, మ‌ర‌చిపోలేని జ్ఞాప‌కాల్ని క్రికెట్ అభిమానుల‌కు కోహ్లి అందించాడ‌ని, అత‌డి ఎరాలో జీవిస్తున్నందుకు ఆనందంగా ఉంద‌ని ఆర్‌సీబీ స్పెష‌ల్ వీడియోను షేర్ చేసింది.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కూడా విరాట్ కోహ్లి కిరీటాన్ని ధ‌రించి ఫోటో షేర్ చేసింది హ్యాపీ బ‌ర్త్‌డే కింగ్ కోహ్లి అని పేర్కొన్న‌ది. కోహ్లి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అత‌డిని ఆనందంగా కౌగిలించుకున్న పాత ఫొటోను రైనా ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు. కోహ్లి భ‌విష్య‌త్తులో మ‌రిన్ని సెంచ‌రీలు సాధించాల‌ని, గొప్ప ఆట‌గాడిగా వెలుగొందుతూనే త‌న బ్యాటింగ్ స్కిల్స్‌, టెక్నిక్స్‌తో ఎంతో మందిలో స్ఫూర్తిని నింపాల‌ని ఆకాంక్షించాడు.

హార్డిక్ పాండ్య కూడా కోహ్లికి బ‌ర్త్‌డే విషేస్ అంద‌జేశాడు హ్యాపీ బ‌ర్త్‌డే బ్రో అంటూ తెలిపాడు. ఇటీవ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కోహ్లితో దిగిన ఓ ఫొటోను షేర్ చేశాడు.

ఇర్ఫాన్ ప‌ఠాన్ కూడా కోహ్లికి బ‌ర్త్‌డే విషెస్ చెప్పాడు. క్రికెట్ వ‌ర‌ల్డ్‌ను చాలా కాలం నీ అస‌మాన ఆట‌తో ఇలాగే ఎంట‌ర్‌టైన్ చేస్తూ ఉండాల‌ని కోహ్లికి శుభాకాంక్ష‌లు అంద‌జేశాడు ఇర్ఫాన్ ప‌ఠాన్‌. కోహ్లిని మోడ్ర‌న్ డే లెజెండ్ అంటూ ప‌ఠాన్‌పేర్కొన్నాడు.

WhatsApp channel