తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli Record: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో కోహ్లి రేర్ రికార్డ్ - ఫ‌స్ట్ ఇండియ‌న్ క్రికెట‌ర్ అత‌డే

Virat Kohli Record: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో కోహ్లి రేర్ రికార్డ్ - ఫ‌స్ట్ ఇండియ‌న్ క్రికెట‌ర్ అత‌డే

31 October 2022, 10:04 IST

  • Virat Kohli Record: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో కోహ్లి అరుదైన రికార్డ్ నెల‌కొల్పాడు. ఈ ఘ‌న‌త‌ను సాధించిన తొలి ఇండియ‌న్ క్రికెట‌ర్‌గా నిలిచాడు. ఆ రికార్డ్ ఏదంటే...

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి

విరాట్ కోహ్లి

Virat Kohli Record: ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతోన్న టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో కోహ్లి సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 82 ప‌రుగుల‌తో రాణించి టీమ్ ఇండియా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. నెద‌ర్లాండ్స్‌పై హాఫ్ సెంచ‌రీ చేశాడు ఆదివారం సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో కేవ‌లం 12 ప‌రుగులు మాత్ర‌మే చేసి కోహ్లి ఔట‌య్యాడు. ఈ క్ర‌మంలో కోహ్లి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఓ అరుదైన రికార్డ్ నెల‌కొల్పాడు.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో వెయ్యి ప‌రుగులు పూర్తి చేసుకున్న తొలి ఇండియ‌న్ క్రికెట‌ర్‌గా నిలిచాడు. ఇప్ప‌టివ‌ర‌కు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో 24 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 22 ఇన్నింగ్స్‌ల‌లో క‌లిపి 1001 ప‌రుగులు చేశాడు.

ఈ జాబితాలో 1016 ప‌రుగుల‌తో శ్రీలంక మాజీ కెప్టెన్ మ‌హేళ జ‌య‌వ‌ర్ధ‌నే టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. అత‌డి త‌ర్వాత సెకండ్ ప్లేస్‌లో కోహ్లి నిలిచాడు. హ‌య్యెస్ట్ ర‌న్స్ చేసిన వారిలో 965 ర‌న్స్‌తో వెస్టిండీస్ స్టార్ ప్లేయ‌ర్ క్రిస్ గేల్ మూడో స్థానంలో ఉండ‌గా 919 ప‌రుగుల‌తో రోహిత్ శ‌ర్మ నాలుగో ప్లేస్‌లో నిలిచాడు.

మ‌రో 15 ప‌రుగులు చేస్తే జ‌య‌వ‌ర్ధ‌నేను అధిగ‌మిస్తూ కోహ్లి టాప్ ప్లేస్‌లోకి చేరుకుంటాడు. కాగా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అత్య‌ధిక హాఫ్ సెంచ‌రీలు చేసిన క్రికెట‌ర్‌గా కోహ్లి పేరిట‌ రికార్డ్ ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో కోహ్లి 12 హాఫ్ సెంచ‌రీలు చేశాడు. అత‌డి త‌ర్వాతి స్థానంలో గేల్‌, రోహిత్ శ‌ర్మ ఉన్నారు.

తదుపరి వ్యాసం