తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Us Open 2022 Record: యూఎస్‌ ఓపెన్‌లో రికార్డు సృష్టించిన అల్కరెజ్‌, సిన్నర్‌ మ్యాచ్‌

US Open 2022 Record: యూఎస్‌ ఓపెన్‌లో రికార్డు సృష్టించిన అల్కరెజ్‌, సిన్నర్‌ మ్యాచ్‌

Hari Prasad S HT Telugu

08 September 2022, 13:56 IST

    • US Open 2022 Record: యూఎస్‌ ఓపెన్‌లో రికార్డు సృష్టించారు కార్లోస్‌ అల్కరెజ్‌, జనిక్‌ సిన్నర్‌. వీళ్లిద్దరి మధ్య బుధవారం (సెప్టెంబర్‌ 7) జరిగిన మ్యాచ్‌ యూఎస్‌ ఓపెన్‌ చరిత్రలో నిలిచిపోనుంది.
యూఎస్ ఓపెన్ క్వార్టర్స్ లో 5 గంటల 15 నిమిషాల పాటు పోరాడి సిన్నర్ పై గెలిచిన అల్కరెజ్
యూఎస్ ఓపెన్ క్వార్టర్స్ లో 5 గంటల 15 నిమిషాల పాటు పోరాడి సిన్నర్ పై గెలిచిన అల్కరెజ్ (AFP)

యూఎస్ ఓపెన్ క్వార్టర్స్ లో 5 గంటల 15 నిమిషాల పాటు పోరాడి సిన్నర్ పై గెలిచిన అల్కరెజ్

US Open 2022 Record: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ హిస్టరీలో అత్యధిక సమయం సాగిన రెండో మ్యాచ్‌గా నిలిచింది కార్లోస్‌ అల్కరెజ్‌, జనిక్‌ సిన్నర్‌ మధ్య జరిగిన క్వార్టర్‌ఫైనల్స్‌ మ్యాచ్‌. బుధవారం (సెప్టెంబర్‌ 7) ఈ మ్యాచ్‌ జరిగింది. ఈ రికార్డుకు వేదికైంది ఆర్థర్‌ ఆషె స్టేడియం. ఐదు సెట్ల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్కరెజ్‌ విజయం సాధించి తన తొలి గ్రాండ్‌స్లామ్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో 6-3, 6-7, 6-7, 7-5, 6-3 తేడాతో సిన్నర్‌పై విజయం సాధించాడు అల్కరెజ్‌. అతడు సెమీస్‌లో లోకల్‌ బాయ్‌ ఫ్రాన్సిస్‌ టియాఫోతో తలపడనున్నాడు. క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లో 19 ఏళ్ల అల్కరెజ్‌ పోరాడిన తీరు అద్భుతమనే చెప్పాలి. తొలి సెట్‌ను 6-3తో సులువుగా గెలిచిన అతడికి.. తర్వాతి రెండు సెట్లలో గట్టి పోటీ ఎదురైంది.

సిన్నర్‌ రెండు, మూడు సెట్లను 7-6, 7-6లతో గెలుచుకున్నాడు. టైబ్రేకర్‌కు దారి తీసిన ఈ రెండు సెట్లలోనూ సిన్నర్‌ పైచేయి సాధించాడు. రెండో సెట్‌ టైబ్రేకర్‌ను 9-7తో, మూడో సెట్‌ టైబ్రేకర్‌ను 7-0తో సిన్నర్‌ సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌లో 5-6తో వెనుకబడిన సిన్నర్‌ నాలుగు సెట్‌ పాయింట్లను కాచుకొని మరీ ఆ గేమ్‌ గెలిచి సెట్‌ను టైబ్రేకర్‌కు తీసుకెళ్లాడు.

ఇక మూడో సెట్‌లోనూ ఇద్దరు ప్లేయర్స్‌ హోరాహోరీగానే తలపడటంతో ఆ సెట్‌ కూడా టై బ్రేకర్‌కు దారి తీసింది. అయితే అక్కడ సిన్నర్‌కు అసలు ప్రతిఘటన ఎదురు కాలేదు. మ్యాచ్‌లో 2-1 లీడ్‌తో నాలుగో సెట్‌లోకి అడుగుపెట్టిన సిన్నర్‌.. తొలి రెండు గేమ్స్‌ను గెలుచుకున్నాడు. అయితే ఆ తర్వాత అల్కరెజ్‌ పుంజుకొని 7-5తో సెట్‌ గెలుచుకున్నాడు.

ఐదో సెట్‌లోనూ అదే జోరు కొనసాగించిన అల్కరెజ్‌ 6-3తో సెట్‌తోపాటు మ్యాచ్‌ గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌ ఏకంగా 5 గంటల 15 నిమిషాల పాటు సాగింది. యూఎస్‌ ఓపెన్‌ చరిత్రలో అత్యధిక సమయం పాటు సాగిన రెండో మ్యాచ్‌ ఇది. 1992లో స్వీడెన్‌కు చెందిన స్టెఫాన్‌ ఎడ్‌బర్గ్‌, అమెరికా ప్లేయర్‌ మైకేల్‌ చాంగ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ 5 గంటల 26 నిమిషాల పాటు సాగింది. ఇప్పటికీ యూఎస్‌ ఓపెన్‌లో అదే రికార్డు.

టాపిక్

తదుపరి వ్యాసం