తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Umran Malik Replaces Shami: షమీ స్థానంలో ఉమ్రాన్ మాలిక్.. బంగ్లాకు వెళ్లనున్న యువ పేసర్

Umran Malik Replaces Shami: షమీ స్థానంలో ఉమ్రాన్ మాలిక్.. బంగ్లాకు వెళ్లనున్న యువ పేసర్

03 December 2022, 11:58 IST

    • Umran Malik Replaces Shami: బంగ్లాదేశ్‌తో టీమిండియా వన్డే సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహమ్మద్ షమీ గాయపడటంతో అతడి స్థానంలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు అవకాశమిచ్చింది టీమిండియా.
ఉమ్రాన్ మాలిక్
ఉమ్రాన్ మాలిక్ (BCCI Twitter)

ఉమ్రాన్ మాలిక్

Umran Malik Replaces Shami: బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఆదివారం నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానున్న సమయంలో భారత్‌కు షాక్ తగిలింది. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ భుజం గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. శనివారం నాడు అతడు భుజం నొప్పితో బాధపడగా.. విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో అతడి స్థానంలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ విషయాన్ని బీసీసీఐ తన అధికారిక పోర్టల్ ద్వారా తెలియజేసింది. గాయపడిన షమీని బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచింది. షమీ గాయ పడటంతో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. వన్డే సిరీస్‌కు దూరమైన షమీని.. డిసెంబరు 14 నుంచి బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు ఆడేది కూడా అనుమానంగా మారింది. గాయం తీవ్రంగా ఉండటంతో ఈ విషయంలో సందిగ్ధత నెలకొంది.

"మహమ్మద్ షమీ భుజం గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ నుంచి ఈ గాయంతో బాధపడుతున్నాడు. డిసెంబరు 1న జట్టుతో పాటు బంగ్లాదేశ్‌కు ప్రయాణించలేనని అడిగాడు. దీంతో అతడు ఎన్‌సీఏలోనే ఉండి చికిత్స తీసుకుంటున్నాడు. డిసెంబరు 14 నుంచి జరగనున్న టెస్టు సిరీస్‌కు ఆడేది లేనిది అనుమానమే" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలియజేశారు.

ఇప్పటికే జట్టులో బుమ్రా లేకపోవడంతో బౌలింగ్ విభాగం విఫలమవుతున్న తరుణంలో సీనియర్ బౌలర్ షమీ గాయపడటం టీమిండియాకు గట్టి దెబ్బేనని చెప్పవచ్చు. మరి అతడి స్థానంలో రానున్న ఉమ్రాన్ మాలిక్ ఏ మేరకు ఆకట్టుకుంటాడో వేచి చూడాలి.

బంగ్లాదేశ్‌‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా..

రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్.

తదుపరి వ్యాసం