Umran malik Suited for ODIs: ఉమ్రాన్ మాలిక్ టీ20ల కంటే వన్డేలకు బెస్ట్.. భారత మాజీ సంచలన వ్యాఖ్యలు-wasim jaffer says umran malika more suited for odis than t20i ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Wasim Jaffer Says Umran Malika More Suited For Odis Than T20i

Umran malik Suited for ODIs: ఉమ్రాన్ మాలిక్ టీ20ల కంటే వన్డేలకు బెస్ట్.. భారత మాజీ సంచలన వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Nov 26, 2022 02:59 PM IST

Umran malik Suited for ODIs: టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌పై మాజీ ఆటగాడు వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉమ్రాన్ టీ20ల కంటే వన్డేలకు బాగా సూటవుతాడని స్పష్టం చేశాడు.

ఉమ్రాన్ మాలిక్
ఉమ్రాన్ మాలిక్ (BCCI Twitter)

Umran malik Suited for ODIs: న్యూజిలాండ్‌‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డే టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. 306 పరుగుల భారీ స్కోరు చేసి కూడా పరాజయం పాలైంది భారత్. భారత బౌలర్ల పేలవ ప్రదర్శన కారణంగా ఆతిథ్య జట్టు కేవలం 3 వికెట్లు కోల్పోయే లక్ష్యాన్ని ఛేదించింది. అయితే అరంగేట్ర మ్యాచ్‌లోనే 2 వికెట్లతో టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఆకట్టుకున్నాడు. ఆరంభంలో అతడి ప్రదర్శనపై సర్వత్రా సానుకూల స్పందనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అతడి ప్రదర్శనపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా స్పందించాడు. ఉమ్రాన్ మాలిక్ టీ20ల కంటే వన్డేలకే బాగా సూటవుతాడని స్పష్టం చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

"ఆట స్థాయి మారే కొద్ది ఎక్కువ నైపుణ్యాలు అవసరమవుతాయి. తప్పకుండా వాటిని నేర్చుకోవాలి. ఉమ్రాన్ మాలిక్ విషయానికొస్తే అతడు టీ20ల కంటే వన్డే ఫార్మాట్‌కు బాగా సూటవుతాడనిపిస్తుంది. వన్డేల్లో అతడి ప్రదర్శన చూస్తే ఐపీఎల్‌లో మనం అతడి బౌలింగ్‌లో ఎక్కువ వైవిధ్యాలు కనిపించవు. పొట్టి ఫార్మాట్‌లో బంతిని సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో వేయాల్సి ఉంటుంది." అని వసీం జాఫర్ స్పష్టం చేశాడు.

ఇదే సమయంలో ఉమ్రాన్ మాలిక్‌తో పాటు వన్డేలకు అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్ సింగ్‌పై కూడా జాఫర్ స్పందించాడు. అర్షదీప్ క్వాలిటీ బౌలరని, అతడు ఏ ఫార్మాట్‌కైనా వేగంగా సర్దుకుపోగలడని తెలిపాడు. న్యూజిలాండ్‌తో తొలి వన్డే గురించి మాట్లాడుతూ పిచ్.. లక్ష్యాన్ని ఛేదించే జట్టుకు బాగా కలిసొచ్చిందని తెలిపాడు.

"సెకాండాఫ్ వికెట్ మెరుగ్గా ఉంది. ఫస్టాఫ్‌లో వికెట్ అలా లేదు. బంతి నేరుగా బ్యాట్‌పైకి రాలేదు. ఈ పరిస్థితులను న్యూజిలాండ్ బ్యాటర్లు బాగా అర్ధం చేసుకుని మెరుగ్గా ఆడారు. బౌలర్లకు ఇది అంత సులభతరం కాదు." అని జాఫర్ తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో టీమిండియా నెగ్గింది. ముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేయగా.. శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్ అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. అనంతరం లక్ష్య ఛేధనంలో న్యూజిలాండ్ 47.1 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను పూర్తి చేసింది. కివీస్ బ్యాటర్ టామ్ లాథమ్(145) అద్భుత శతకంతో ఆకట్టుకోగా, కేన్ విలియమ్సన్ అర్ధ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 2, అర్షదీప్ ఓ వికెట్ తీశారు.

WhatsApp channel

సంబంధిత కథనం