తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  ఫుట్‌బాల్‌ చరిత్రలో అతి ఖరీదైన ప్లేయర్స్ ట్రాన్స్‌ఫర్స్‌ ఇవే

ఫుట్‌బాల్‌ చరిత్రలో అతి ఖరీదైన ప్లేయర్స్ ట్రాన్స్‌ఫర్స్‌ ఇవే

Hari Prasad S HT Telugu

07 December 2021, 16:11 IST

    • Football.. ఈ ఆటగాళ్ల బదిలీ క్రికెట్‌ లీగ్‌ ఐపీఎల్‌లోనూ ఉంది కానీ.. ఫుట్‌బాల్‌లో ఈ ట్రాన్స్‌ఫర్స్‌ ఖరీదు చూస్తే కళ్లు తేలేయాల్సిందే. 2021లోనూ క్లబ్స్‌ మధ్య ప్లేయర్స్‌ బదిలీలు జరిగాయి. 10 అత్యంత ఖరీదైన ప్లేయర్స్‌ బదిలీల్లో రెండు ఈ సీజన్‌లోనివే కావడం ఇక్కడ విశేషం. సాకర్‌ చరిత్రలో ఖరీదైన ట్రాన్స్‌ఫర్‌ ఎవరిది?
ఫుట్‌బాల్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన ట్రాన్స్‌ఫర్‌ నెయ్‌మార్‌ జూనియర్‌దే..
ఫుట్‌బాల్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన ట్రాన్స్‌ఫర్‌ నెయ్‌మార్‌ జూనియర్‌దే.. (Reuters)

ఫుట్‌బాల్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన ట్రాన్స్‌ఫర్‌ నెయ్‌మార్‌ జూనియర్‌దే..

Football.. ఫుట్‌బాల్‌ ఓ గ్లోబల్‌ స్పోర్ట్‌. ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన ఆట. ఎక్కువ ఫాలోయింగ్‌ ఉన్న ఆటలోనే డబ్బూ ఎక్కువ. అందుకు తగినట్లే కొన్ని ఫుట్‌బాల్‌ క్లబ్స్‌ మధ్య ప్రతి ఏటా ప్లేయర్స్‌ బదిలీ అవుతుంటారు. నిజానికి ఈ ఆటగాళ్ల బదిలీ మన క్రికెట్‌ లీగ్‌ ఐపీఎల్‌లోనూ ఉంది కానీ.. ఫుట్‌బాల్‌లో ఈ ట్రాన్స్‌ఫర్స్‌ ఖరీదు చూస్తే కళ్లు తేలేయాల్సిందే. 2021లోనూ కొన్ని క్లబ్స్‌ మధ్య ప్లేయర్స్‌ బదిలీలు జరిగాయి. 

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఫుట్‌బాల్‌ చరిత్రలో 10 అత్యంత ఖరీదైన ప్లేయర్స్‌ బదిలీల్లో రెండు ఈ సీజన్‌లోనివే కావడం ఇక్కడ విశేషం. ఈ నేపథ్యంలో అసలు ఇప్పటి వరకూ సాకర్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన ట్రాన్స్‌ఫర్‌ ఎవరిది? దాని విలువ ఎంత? ఈ టాప్‌ టెన్‌ లిస్ట్‌లో ఉన్న ప్లేయర్స్‌ ఎవరు? అన్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.

10. గారెత్‌ బేల్‌ - 10.08 కోట్ల యూరోలు (సుమారు రూ. 857 కోట్లు)

ఫుట్‌బాల్‌ ఖరీదైన ట్రాన్స్‌ఫర్స్‌లో పదో స్థానంలో ఉన్నాడు గారెత్‌ బేల్‌. ఈ స్టార్‌ ఫుట్‌బాలర్‌ 2013లో టోటెన్‌హామ్‌ హాట్‌స్పర్‌ నుంచి రియల్‌ మాడ్రిడ్‌కు బదిలీ అయ్యాడు. దీని విలువ 10.08 కోట్ల యూరోలు కావడం విశేషం. అతనిపై ఇంత భారీ మొత్తం వెచ్చించినందుకు రియల్‌ మాడ్రిడ్‌ కూడా బాగానే లాభపడింది. అతను వచ్చిన తర్వాత నాలుగు ఛాంపియన్స్‌ లీగ్‌ టైటిల్స్‌, రెండు స్పానిష్‌ సూపర్‌ కప్స్‌, రెండు లా లిగా ట్రోఫీలు, నాలుగు క్లబ్‌ వరల్డ్‌కప్‌ టైటిల్స్‌ రియల్‌ మాడ్రిడ్‌ గెలిచింది.

9. పాల్‌ పోగ్బా, ఉస్మానె డెంబెలె - 10.5 కోట్ల యూరోలు (సుమారు రూ.893 కోట్లు)

ఫ్రాన్స్‌కు చెందిన ఈ ఇద్దరు ప్లేయర్స్‌ ఒకే మొత్తానికి ఒక క్లబ్‌ నుంచి మరో క్లబ్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. 2016లో పాల్‌ పోగ్బా జువెంటస్‌ నుంచి మాంచెస్టర్‌ యునైటెడ్‌లోకి వెళ్లాడు. ఆ సమయంలో అతని ట్రాన్స్‌ఫర్‌ ప్రిమియర్‌ లీగ్‌ రికార్డు కావడం విశేషం. అటు ఉస్మానె డెంబెలె కూడా 2017లో డార్ట్‌మండ్‌ నుంచి బార్సిలోనాకు 10.5 కోట్ల యూరోలకు బదిలీ అయ్యాడు.

7. రొమెలు లుకాకు - 11.5 కోట్ల యూరోలు (సుమారు రూ. 978 కోట్లు)

ఈ బెల్జియం స్టార్ ఫుట్‌బాలర్‌ 2021లో ఇంటర్‌ మిలాన్‌ నుంచి చెల్సీకి ట్రాన్స్‌ఫర్‌ అయ్యాడు. చెల్సీ క్లబ్‌ చరిత్రలో లుకాకు ట్రాన్స్‌ఫరే అత్యంత ఖరీదైనది. రెండుసార్లు చెల్సీ ఆఫర్‌ను తిరస్కరించిన లుకాకు.. మూడోసారి కాదనలేకపోయాడు.

Football.. ఫుట్‌బాల్‌ ఓ గ్లోబల్‌ స్పోర్ట్‌. ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన ఆట. ఎక్కువ ఫాలోయింగ్‌ ఉన్న ఆటలోనే డబ్బూ ఎక్కువ. అందుకు తగినట్లే కొన్ని ఫుట్‌బాల్‌ క్లబ్స్‌ మధ్య ప్రతి ఏటా ప్లేయర్స్‌ బదిలీ అవుతుంటారు. నిజానికి ఈ ఆటగాళ్ల బదిలీ మన క్రికెట్‌ లీగ్‌ ఐపీఎల్‌లోనూ ఉంది కానీ.. ఫుట్‌బాల్‌లో ఈ ట్రాన్స్‌ఫర్స్‌ ఖరీదు చూస్తే కళ్లు తేలేయాల్సిందే. 2021లోనూ కొన్ని క్లబ్స్‌ మధ్య ప్లేయర్స్‌ బదిలీలు జరిగాయి. 

ఫుట్‌బాల్‌ చరిత్రలో 10 అత్యంత ఖరీదైన ప్లేయర్స్‌ బదిలీల్లో రెండు ఈ సీజన్‌లోనివే కావడం ఇక్కడ విశేషం. ఈ నేపథ్యంలో అసలు ఇప్పటి వరకూ సాకర్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన ట్రాన్స్‌ఫర్‌ ఎవరిది? దాని విలువ ఎంత? ఈ టాప్‌ టెన్‌ లిస్ట్‌లో ఉన్న ప్లేయర్స్‌ ఎవరు? అన్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.

10. గారెత్‌ బేల్‌ - 10.08 కోట్ల యూరోలు (సుమారు రూ. 857 కోట్లు)

ఫుట్‌బాల్‌ ఖరీదైన ట్రాన్స్‌ఫర్స్‌లో పదో స్థానంలో ఉన్నాడు గారెత్‌ బేల్‌. ఈ స్టార్‌ ఫుట్‌బాలర్‌ 2013లో టోటెన్‌హామ్‌ హాట్‌స్పర్‌ నుంచి రియల్‌ మాడ్రిడ్‌కు బదిలీ అయ్యాడు. దీని విలువ 10.08 కోట్ల యూరోలు కావడం విశేషం. అతనిపై ఇంత భారీ మొత్తం వెచ్చించినందుకు రియల్‌ మాడ్రిడ్‌ కూడా బాగానే లాభపడింది. అతను వచ్చిన తర్వాత నాలుగు ఛాంపియన్స్‌ లీగ్‌ టైటిల్స్‌, రెండు స్పానిష్‌ సూపర్‌ కప్స్‌, రెండు లా లిగా ట్రోఫీలు, నాలుగు క్లబ్‌ వరల్డ్‌కప్‌ టైటిల్స్‌ రియల్‌ మాడ్రిడ్‌ గెలిచింది.

9. పాల్‌ పోగ్బా, ఉస్మానె డెంబెలె - 10.5 కోట్ల యూరోలు (సుమారు రూ.893 కోట్లు)

ఫ్రాన్స్‌కు చెందిన ఈ ఇద్దరు ప్లేయర్స్‌ ఒకే మొత్తానికి ఒక క్లబ్‌ నుంచి మరో క్లబ్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. 2016లో పాల్‌ పోగ్బా జువెంటస్‌ నుంచి మాంచెస్టర్‌ యునైటెడ్‌లోకి వెళ్లాడు. ఆ సమయంలో అతని ట్రాన్స్‌ఫర్‌ ప్రిమియర్‌ లీగ్‌ రికార్డు కావడం విశేషం. అటు ఉస్మానె డెంబెలె కూడా 2017లో డార్ట్‌మండ్‌ నుంచి బార్సిలోనాకు 10.5 కోట్ల యూరోలకు బదిలీ అయ్యాడు.

7. రొమెలు లుకాకు - 11.5 కోట్ల యూరోలు (సుమారు రూ. 978 కోట్లు)

ఈ బెల్జియం స్టార్ ఫుట్‌బాలర్‌ 2021లో ఇంటర్‌ మిలాన్‌ నుంచి చెల్సీకి ట్రాన్స్‌ఫర్‌ అయ్యాడు. చెల్సీ క్లబ్‌ చరిత్రలో లుకాకు ట్రాన్స్‌ఫరే అత్యంత ఖరీదైనది. రెండుసార్లు చెల్సీ ఆఫర్‌ను తిరస్కరించిన లుకాకు.. మూడోసారి కాదనలేకపోయాడు.

|#+|

6. జాక్‌ గ్రీలిష్‌ - 11.7 కోట్ యూరోలు (సుమారు రూ. 995 కోట్లు)

ఈ సీజన్‌లోనే ఈ స్టార్‌ ఇంగ్లండ్ ఫుట్‌బాలర్‌ ఆస్టన్‌ విలా నుంచి మాంచెస్టర్‌ సిటీకి ట్రాన్స్‌ఫర్‌ అయ్యాడు. అతన్ని రిటేన్‌ చేసుకునేందుకు ఆస్టన్‌ విలా చాలానే ప్రయత్నించింది. అయితే సిటీ చేసిన రికార్డు ఆఫర్‌ను కాదనలేక ఆ టీమ్‌తో చేరాడు జాక్‌ గ్రీలిష్‌.

5. ఆంటోనీ గ్రీజ్‌మన్‌ & ఫిలిప్‌ కౌటినో - 12 కోట్ల యూరోలు (సుమారు రూ.1020 కోట్లు)

ఈ ఇద్దరు ప్లేయర్స్‌ ఒకే మొత్తానికి ఒకే క్లబ్‌ (బార్సిలోనా)లో చేరడం విశేషం. లివర్‌పూల్‌ నుంచి 2018లో కౌటినో.. బార్సిలోనాలో చేరాడు. ఇక ఆ తర్వాతి ఏడాది అంటే 2019లో గ్రీజ్‌మన్‌ కూడా అట్లెటికో మాడ్రిడ్‌ నుంచి 12 కోట్ల యూరోల ఒప్పందంతో బార్సిలోనా టీమ్‌లోకి వెళ్లాడు. అయితే అతన్ని 2021-22 సీజన్‌ కోసం లోన్‌పై తన పాత క్లబ్‌ అట్లెటికో మాడ్రిడ్‌కు పంపించింది బార్సిలోనా.

3. జావో ఫెలిక్స్‌ - 12.6 కోట్ల యూరోలు (సుమారు రూ. 1071 కోట్లు)

ఈ పోర్చుగల్‌ ఫార్వర్డ్‌ ప్లేయర్‌ 2019లో బెన్‌ఫికా నుంచి భారీ మొత్తానికి అట్లెటికో మాడ్రిడ్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ అయ్యాడు. ఆ క్లబ్‌లో చేరిన తర్వాత లా లిగా టైటిల్‌ గెలిచాడు.

2. కైలియన్‌ ఎంబప్పె - 14.5 కోట్ల యూరోలు (సుమారు రూ. 1233 కోట్లు)

ఫ్రాన్స్‌ ఫార్వర్డ్‌ ప్లేయర్ అయిన కైలియన్‌ ఎంబప్పె 2017లో మొనాకో నుంచి పారిస్‌ సెయింట్‌-జెర్మేన్‌ టీమ్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయ్యాడు. పీఎస్‌జీ టీమ్‌లోకి అతడు వెళ్లిన తర్వాత ఆ టీమ్‌ మూడు లీగ్ 1 టైటిల్స్‌, మూడు ఫ్రెండ్‌ కప్స్‌, మూడు ఫ్రెంచ్‌ సూపర్‌ కప్స్‌, రెండు ఫ్రెంచ్‌ లీగ్‌ కప్స్‌ గెలిచింది. రియల్‌ మాడ్రిడ్‌ అతన్ని ఈ సీజన్‌లో 15 కోట్ల యూరోలకు కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది.

1. నెయ్‌మార్‌ జూనియర్‌ - 22.2 కోట్ల యూరోలు (సుమారు రూ. 1888 కోట్లు)

ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ట్రాన్స్‌ఫర్‌ ఈ బ్రెజిల్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌దే. 2017లో అతన్ని బార్సిలోనా నుంచి పారిస్‌ సెయింట్-జెర్మేన్‌ కొనుగోలు చేసింది. అతడు వచ్చిన తర్వాత పీఎస్‌జీ మూడు లీగ్‌ 1 టైటిల్స్‌, మూడు ఫ్రెంచ్‌ కప్స్‌, మూడు ఫ్రెంచ్‌ సూపర్‌ కప్స్‌, రెండు ఫ్రెంచ్‌ లీగ్‌ కప్స్‌ గెలిచింది. ఈ ఏడాదే పీఎస్‌జీ.. బార్సిలోనా నుంచే మరో స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనెల్‌ మెస్సీని కూడా తీసుకున్న విషయం తెలిసిందే.

తదుపరి వ్యాసం