తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Prize Money | ఈ స్పోర్ట్స్‌ ఈవెంట్ల ప్రైజ్‌మనీ చూస్తే కళ్లు తేలేస్తారు!

Prize Money | ఈ స్పోర్ట్స్‌ ఈవెంట్ల ప్రైజ్‌మనీ చూస్తే కళ్లు తేలేస్తారు!

Hari Prasad S HT Telugu

22 December 2021, 11:54 IST

    • Prize Money.. ఈ మధ్య ఐపీఎల్‌లోనే విజేతకు రూ. 20 కోట్ల ప్రైజ్‌మనీ ఇస్తే.. అమ్మో అంతే డబ్బే అనుకున్నారు అభిమానులు. కానీ దీనికి ఎన్నో రెట్లు ఎక్కువ ప్రైజ్‌మనీ ఇచ్చే స్పోర్ట్స్‌ ఈవెంట్లు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. వాటితో పోలిస్తే ఐపీఎల్‌ ప్రైజ్‌మనీ చాలా చాలా తక్కువ అని అనిపించడం సహజం.
ప్రపంచంలోనే అత్యధిక ప్రైజ్‌మనీ ఉన్న ఛాంపియన్స్‌ లీగ్‌ టోర్నీ
ప్రపంచంలోనే అత్యధిక ప్రైజ్‌మనీ ఉన్న ఛాంపియన్స్‌ లీగ్‌ టోర్నీ (Reuters)

ప్రపంచంలోనే అత్యధిక ప్రైజ్‌మనీ ఉన్న ఛాంపియన్స్‌ లీగ్‌ టోర్నీ

Prize Money.. స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ అంటే ఇప్పుడు కాస్ట్‌లీ అఫైర్‌ అయిపోయింది. రోజురోజుకీ ఈ ఈవెంట్లకు ఫాలోయింగ్ పెరిగిపోతుండటంతో స్పాన్సర్ల సంఖ్య భారీగా ఉంటోంది. అందుకు తగినట్లే పార్టిసిపేట్‌ చేసే టీమ్స్‌, ప్లేయర్స్‌కు భారీ ప్రైజ్‌మనీ ఇస్తున్నారు. ఈ మధ్య ఐపీఎల్‌లోనే విజేతకు రూ. 20 కోట్ల ప్రైజ్‌మనీ ఇస్తే.. అమ్మో అంతే డబ్బే అనుకున్నారు అభిమానులు. కానీ దీనికి ఎన్నో రెట్లు ఎక్కువ ప్రైజ్‌మనీ ఇచ్చే స్పోర్ట్స్‌ ఈవెంట్లు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. 

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

వాటితో పోలిస్తే ఐపీఎల్‌ ప్రైజ్‌మనీ చాలా చాలా తక్కువ అని అనిపించడం సహజం. బ్రాడ్‌కాస్టింగ్‌ హక్కులు, అడ్వర్‌టైజ్‌మెంట్లు, స్పాన్సర్‌షిప్‌ డీల్స్‌ పెద్ద మొత్తంలో వస్తుండటంతో స్పోర్ట్స్ బిజినెస్‌ రోజురోజుకూ ఊహించని స్థాయిలో పెరిగిపోతోంది. అందుకు తగినట్లే స్పోర్ట్స్‌ స్టార్లు కూడా కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నారు. ప్రతి ఏటా ఫోర్బ్స్‌ రిచ్‌ లిస్ట్‌లో క్రీడాకారుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యధిక ప్రైజ్‌మనీ ఉన్న స్పోర్ట్స్‌ ఈవెంట్లు ఏవో ఇప్పుడు చూద్దాం.

UEFA ఛాంపియన్స్ లీగ్‌ - ఫుట్‌బాల్‌

ప్రపంచంలో అత్యధిక ప్రైజ్‌మనీ ఉన్న టోర్నీ ఈ UEFA ఛాంపియన్స్‌ లీగే. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 240 కోట్ల డాలర్లు (సుమారు రూ. 18 వేల కోట్లు). కేవలం విజేతకే 10 కోట్ల డాలర్లు (సుమారు రూ. 750 కోట్లు) దక్కుతాయంటే నమ్మశక్యం కాదు. ఇది ప్రతి ఏటా జరిగే ఓ క్లబ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ. టాప్‌ యురోపియన్‌ క్లబ్‌ల మధ్య జరిగే టోర్నీ ఇది.

ఫార్ములా 1 - మోటార్‌స్పోర్ట్

మోటార్‌స్పోర్ట్స్‌ ఈవెంట్లలో ఇదే అత్యుత్తమ స్థాయి ఈవెంట్‌. ఫార్ములా 1 మొత్తం ప్రైజ్‌మనీ 80 కోట్ల డాలర్లు (సుమారు రూ. 6 వేల కోట్లు). విజేతకు 10 కోట్ల డాలర్లు (సుమారు రూ. 750 కోట్లు) దక్కుతాయి. ఒక ఫార్ములా వన్‌ సీజన్‌లో వివిధ గ్రాండ్‌ ప్రిలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న సర్క్యూట్లలో ఈ గ్రాండ్‌ ప్రిలు జరుగుతాయి. ఏడాదికి వంద కోట్ల డాలర్లపైనే ఆదాయాన్ని ఫార్ములా వన్‌ జనరేట్‌ చేస్తుండటం విశేషం.

ఫిఫా వరల్డ్‌కప్‌ - ఫుట్‌బాల్‌

ప్రతి నాలుగేళ్లకోసారి జరిగే ఫిఫా వరల్డ్‌కప్ ఫుట్‌బాల్‌ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 57.6 కోట్ల డాలర్లు (సుమారు రూ. 4300 కోట్లు). ఈ టోర్నీ విజేతకు 3.5 కోట్ల డాలర్లు (సుమారు రూ. 260 కోట్లు) దక్కుతాయి. ప్రపంచంలో ఎక్కువ మంది చూసే మెగా స్పోర్ట్స్‌ ఈవెంట్లలో ఇదీ ఒకటి. ఈ టోర్నీలో 32 టీమ్స్‌ తలపడతాయి. ఇప్పటి వరకూ బ్రెజిల్‌ అత్యధికంగా ఐదుసార్లు ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ గెలిచింది.

యూరోకప్‌ - ఫుట్‌బాల్‌

యూరప్‌లో బెస్ట్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ ఏదో తేల్చే టోర్నీ ఇది. ఇందులో కేవలం UEFA సభ్య దేశాలు మాత్రమే తలపడతాయి. మొత్తం 24 టీమ్స్‌ తలపడే ఈ టోర్నీ ప్రైజ్‌మనీ 24.5 కోట్ల డాలర్లు (సుమారు రూ. 1825 కోట్లు). ఇక టోర్నీ విజేత జట్టుకు 2.9 కోట్ల డాలర్లు (సుమారు రూ. 216 కోట్లు) దక్కుతాయి. పోర్చుగల్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా ఉండగా.. జర్మనీ, స్పెయిన్‌ మూడేసి టైటిల్స్ సాధించాయి.

వరల్డ్‌ సిరీస్‌ - మేజర్‌ లీగ్‌ బేస్‌బాల్‌

మేజర్‌ లీగ్‌ బేస్‌బాల్‌లో ప్రతి ఏటా ఈ వరల్డ్‌ సిరీస్‌ జరుగుతుంది. అమెరికా, కెనడాల్లోని అమెరికన్‌ లీగ్‌, నేషనల్‌ లీగ్‌లలోని టాప్‌ టీమ్స్ టైటిల్‌ కోసం తలపడతాయి. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 8 కోట్ల డాలర్లు (సుమారు రూ. 600 కోట్లు). ఇక విజేత జట్టుకు 3 కోట్ల డాలర్లు (సుమారు రూ. 223 కోట్లు) దక్కుతాయి.

 

తదుపరి వ్యాసం