తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Serena Williams: మరోసారి తల్లయిన సెరెనా విలియమ్స్.. రెండోసారీ పాపే

Serena Williams: మరోసారి తల్లయిన సెరెనా విలియమ్స్.. రెండోసారీ పాపే

Hari Prasad S HT Telugu

23 August 2023, 9:39 IST

    • Serena Williams: మరోసారి తల్లయింది అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్. ఆమెకు రెండోసారి కూడా పాపే జన్మించింది. అంతేకాదు ఆమె పేరును కూడా సెరెనా రివీల్ చేసింది.
సెరెనా విలియమ్స్ ఇద్దరు కూతుళ్లు
సెరెనా విలియమ్స్ ఇద్దరు కూతుళ్లు

సెరెనా విలియమ్స్ ఇద్దరు కూతుళ్లు

Serena Williams: అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ రెండోసారి తల్లయింది. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త అలెక్సిస్ ఒహానియన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ పాపకు వాళ్లు అడీరా రివర్ ఒహానియన్ అనే పేరు పెట్టారు. ఇప్పటికే సెరెనా, అలెక్సిస్ లకు ఓ పాప ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, తమ ఇల్లంతా ఆనందంతో నిండిపోయిందంటూ అలెక్సిస్ ఈ ఫొటోను షేర్ చేశాడు. తనకు మరో అసమాన బహుమతి ఇచ్చావని, గ్రేటెస్ట్ మదర్ ఆఫ్ ఆల్ టైమ్ నువ్వే అంటూ సెరెనాపై అతడు ప్రశంసలు కురిపించాడు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తాను మరోసారి తల్లినవుతుండటంపై సెరెనా స్పందించింది.

తల్లి కావడం ఓ ఘనత, ఓ సవాలు అని ఆమె చెప్పింది. టెన్నిస్ నుంచి రిటైరైన తర్వాత తాను తల్లిగా ఉండటం, ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ గా ఉండటంలో దేనిని ఎంపిక చేసుకోవాలన్న ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని ఆ ఇంటర్వ్యూలో తెలిపింది. తాను మహిళను కాబట్టే ఈ అంశం తెరపైకి వచ్చిందని, అదే పురుషుడినై ఉంటే తన ఆటను కొనసాగించేదానినే అని సెరెనా చెప్పడం విశేషం.

2017లో సెరెనా ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచినప్పుడు రెండు నెలల గర్భవతి. ఇక ఇప్పుడు రెండో పాపకు 41 ఏళ్ల వయసులో జన్మనిచ్చింది. కెరీర్ మొదట్లో పిల్లలు కావాలని తనకు ఎప్పుడూ అనిపించలేదని ఆమె చెప్పింది. మహిళల టెన్నిస్ లోని గొప్ప ప్లేయర్స్ లో సెరెనా కూడా ఒకరు.

మహిళల సింగిల్స్ లో 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచింది. ఓపెన్ ఎరాలో అత్యధిక టైటిల్స్ గెలిచిన వారిలో సెరెనా రెండోస్థానంలో నిలిచింది. అంతేకాదు ఏకంగా 319 వారాల పాటు వరల్డ్ నంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన ఘనత ఆమె సొంతం. గతేడాది సెప్టెంబర్ లో ఆమె టెన్నిస్ నుంచి రిటైరైంది.

టాపిక్

తదుపరి వ్యాసం