తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Ban 1st Test Day 4 Highlights: బంగ్లాపై విజయానికి 4 వికెట్ల దూరంలో భారత్.. తోక తెంచడమే బాకీ

Ind vs Ban 1st test day 4 highlights: బంగ్లాపై విజయానికి 4 వికెట్ల దూరంలో భారత్.. తోక తెంచడమే బాకీ

17 December 2022, 16:55 IST

    • India vs Bangladesh 1st Test: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం మరో నాలుగు వికెట్ల దూరంలో ఉంది. మరోపక్క బంగ్లా విజయం సాధించాలంటే చివరిదైన ఐదో రోజు 241 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో షకిబుల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్ ఉన్నారు.
భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్టు
భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్టు (AP)

భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్టు

India vs Bangladesh 1st Test: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. ఈ రోజుతోనే మ్యాచ్ ముగించిందనుకున్న భారత్ జట్టు.. విజయానికి ఇంకో నాలుగో వికెట్ల దూరంలో ఉంది. 513 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు 102 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. చివరిదైన ఐదో రోజు బంగ్లా విజయానికి ఇంకా 241 పరుగులు అవసరం కాగా.. భారత్ మాత్ర మరో నాలుగు వికెట్లు తీస్తే సరిపోతుంది. అయితే తోక తెంచడంలో మాత్రం ఇబ్బంది పడుతోంది టీమిండియా.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

బౌలర్ల సహనానికి పరీక్ష..

ఓవర్ నైట్ స్కోరు 42 పరుగుల వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్.. ఈ రోజు అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. ఓపెనర్లు నజ్ముల్ హుస్సేన్(67), జకీర్ హసన్(100) క్రీజులో అలాగే పాతుకుపోయి 124 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తొలి సెషన్ అంతా అలాగే ఆడుతూ.. బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. ఇద్దరూ అర్ధశతకాలు పూర్తి చేసుకుని నిలకడగా ఆడారు. ఇలాంటి సమయంలో నజ్ముల్‌ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు ఉమేశ్ యాదవ్. దీంతో బంగ్లా తొలి వికెట్ కోల్పోయింది. ఆ కాసేపటికే వన్డౌన్‌లో దిగిన యాసిర్ అలీని(5) పెవిలియన్ చేర్చాడు అక్షర్ పటేల్. మరికాసేపటికే కెప్టెన్ లిటన్ దాస్‌ను(19) వెనక్కి పంపాడు కుల్దీప్ యాదవ్.

ఓ పక్క వికెట్లు కోల్పోతున్నప్పటికీ అరంగేట్ర ఆటగాడు జకీర్ హసన్ వెనక్కి తగ్గలేదు. చెత్తబంతులను బౌండరీకి తరలిస్తూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 219 బంతుల్లో శతకం బాదేశాడు. అయితే ఈ ఆనందం అతడికి ఎంతోసేపు నిలువలేదు. అశ్విన్ అతడిని ఔట్ చేయడంతో పెవిలియన్ చేరాడు. అనంతరం ముష్పీకర్ రహీమ్(23), నరుల్ హసన్(3) కూడా విఫలం కావడంతో కీలక వికెట్లను కోల్పోయింది బంగ్లాదేశ్.

అయితే ఇలాంటి సమయంలో సీనియర్ ఆటగాడు షకిబుల్ హసన్(40) క్రీజులో అలాగే పాతుకుపోయి చివర్లో భారత బౌలర్లపై ఎదురుదాడిగి దిగాడు. దీంతో నాలుగో రోజున టీమిండియాకు మరో వికెట్ పడలేదు. ప్రస్తుతం క్రీజులో అతడితో పాటు మెహదీ హసన్ మిరాజ్(9) ఉన్నాడు. బంగ్లా విజయానికి ఇంకా 241 పరుగులు అవసరం కాగా.. నాలుగు వికెట్లు మాత్రమే చేతిలో ఉంది. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్, అశ్విన్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

తదుపరి వ్యాసం