తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Suryakumar Yadav T20 Rank: టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లోనే కొనసాగుతున్న సూర్యకుమార్.. కానీ..

Suryakumar yadav T20 Rank: టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లోనే కొనసాగుతున్న సూర్యకుమార్.. కానీ..

Hari Prasad S HT Telugu

16 November 2022, 16:00 IST

    • Suryakumar yadav T20 Rank: టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లోనే కొనసాగుతున్నాడు సూర్యకుమార్ యాదవ్‌. అయితే అతని రేటింగ్‌ పాయింట్స్‌ మాత్రం తగ్గిపోయాయి.
సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ (PTI)

సూర్యకుమార్ యాదవ్

Suryakumar yadav T20 Rank: టీమిండియా టీ20 సెన్సేషనల్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 1గానే కొనసాగుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ముగిసిన తర్వాత ఈ ర్యాంకింగ్స్‌ను అప్‌డేట్‌ చేశారు. అయితే గతంలో 869 రేటింగ్‌ పాయింట్స్‌తో టాప్‌లో ఉన్న అతడు.. తాజాగా పది పాయింట్లు కోల్పోయి 859తో సరిపెట్టుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

టీ20 వరల్డ్‌కప్‌లో అద్భుతంగా రాణించిన సూర్యకుమార్‌.. ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌గా ఎదిగాడు. అంతేకాదు తన కెరీర్‌ బెస్ట్‌ 869 రేటింగ్ పాయింట్స్‌ను కూడా అందుకున్నాడు. అయితే ఇండియా సెమీఫైనల్లో ఓడిపోవడం, ఆ మ్యాచ్‌లో సూర్య బ్యాట్‌తో రాణించకపోవడంతో అతడు 10 పాయింట్లు కోల్పోయాడు. మొత్తంగా వరల్డ్‌కప్‌లో సూర్య 59 సగటు, 189 స్ట్రైక్‌ రేట్‌తో 239 రన్స్‌ చేశాడు.

విరాట్‌ కోహ్లి, నెదర్లాండ్స్‌కు చెందిన మ్యాక్స్‌ ఓడౌడ్‌ తర్వాత అత్యధిక రన్స్‌ చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. ఇక ఈ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ రెండోస్థానంలోనే కొనసాగుతున్నాడు. అతడు 836 రేటింగ్ పాయింట్స్‌తో ఉన్నాడు. ఇక సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై హాఫ్ సెంచరీ చేసిన పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం.. డెవోన్‌ కాన్వేను వెనక్కి నెట్టి మూడోస్థానానికి చేరుకున్నాడు.

ఇక టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక రన్స్‌ చేసిన బ్యాటర్‌గా నిలిచినా.. విరాట్‌ కోహ్లి మాత్రం టాప్‌ 10లో చోటు దక్కించుకోలేకపోయాడు. అతడు 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక తాజా ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌.. ఏకంగా 22 స్థానాలు ఎగబాకి 12వ ర్యాంక్‌కు వచ్చాడు. బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో శ్రీలంక బౌలర్‌ వానిందు హసరంగానే టాప్‌లో కొనసాగుతున్నాడు. ఇక ఇంగ్లండ్‌ లెగ్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ ఐదు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు.

అతడు సెమీఫైనల్లో ఒకటి, ఫైనల్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ విశ్వవిజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌గా నిలిచిన ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్ తాజా ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంక్‌లో నిలిచాడు. ఫైనల్లో 4 ఓవర్లలో కేవలం 12 రన్స్‌ ఇచ్చి 3 వికెట్లు తీసిన కరన్‌.. మొత్తంగా 13 వికెట్లు తీశాడు.

తదుపరి వ్యాసం