తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  T20 World Cup: నేటి నుంచి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ షురూ - తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక‌

T20 World Cup: నేటి నుంచి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ షురూ - తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక‌

16 October 2022, 9:17 IST

  • T20 World Cup: క్రికెట్ అభిమానుల‌ను అల‌రించేందుకు పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ సిద్ధ‌మైంది. నేటి నుంచి ఆస్ట్రేలియా వేదిక‌గా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మొద‌లుకానుంది. తొలి మ్యాచ్‌లో న‌మీబియాతో శ్రీలంక త‌ల‌ప‌డ‌నున్న‌ది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకున్న‌ది.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్
టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్

T20 World Cup: ఆస్ట్రేలియా వేదిక‌గా నేటి నుంచి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మొద‌లుకానుంది. మొత్తం ప‌ద‌హారు టీమ్‌లు టైటిల్ కోసం పోటీప‌డ‌బోతున్నాయి. ఆదివారం నుంచి తొలి రౌండ్ అర్హ‌త మ్యాచ్‌లు జ‌రుగ‌తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

సూప‌ర్ 12లో చోటు కోసం మొత్తం ఎనిమిది టీమ్‌లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇందులో గ్రూప్ఏలో భాగంగా నేడు శ్రీలంక‌తో న‌మీబియా త‌ల‌ప‌డ‌నున్న‌ది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న‌ది. నేడు జ‌రుగ‌నున్న మ‌రో మ్యాచ్‌లో యూఏఈతో నెద‌ర్లాండ్స్ త‌ల‌ప‌డ‌నుంది. గ్రూప్‌బీలో వెస్టిండీస్‌, జింబాబ్వే, స్కాట్లాండ్‌, ఐర్లాండ్ ఉన్నాయి.

ఇందులో గెలిచిన రెండు టీమ్‌లు సూప‌ర్ 12కు అర్హ‌త సాధిస్తాయి. ఆదివారం నుంచి న‌వంబ‌ర్ 13 వ‌ర‌కు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌రుగ‌నుంది ఈ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇండియా, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి.

గ్రూప్ బీలో ఇండియా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, సౌతాఫ్రికా ఉన్నాయి. గ్రూప్ ఏలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, ఆప్ఘ‌నిస్తాన్, న్యూజిలాండ్ ఉన్నాయి. తొలి రౌండ్‌లో గెలిచిన రెండు జ‌ట్లు వీటితో పాటుగా చేరుతాయి.

ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య అక్టోబ‌ర్ 23న మ్యాచ్ జ‌రుగ‌నున్న‌ది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. గ‌త ఏడాది టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాకిస్థాన్ చేతిలో టీమ్ ఇండియా దారుణ ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. ఆ ఓట‌మికి బ‌దులు తీర్చుకోవాల‌ని రోహిత్ సేన భావిస్తోంది. అయితే గాయంతో ప్ర‌ధాన పేస‌ర్ బూమ్రా దూరం కావ‌డం టీమ్ ఇండియా క‌ల‌వ‌ర‌పెడుతోంది.

తదుపరి వ్యాసం