తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sania Mirza: సానియా మీర్జా విడాకులపై స్పందించిన సోదరి ఆనమ్.. చెప్పాల్సిన అవసరం వచ్చిందంటూ..

Sania Mirza: సానియా మీర్జా విడాకులపై స్పందించిన సోదరి ఆనమ్.. చెప్పాల్సిన అవసరం వచ్చిందంటూ..

21 January 2024, 18:14 IST

    • Sania Mirza: పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో సానియా మీర్జాతో అతడికి విడాకులు అయ్యాయా అనే విషయంలో సందిగ్ధత ఏర్పడింది. దీంతో ఈ విషయంపై సానియా సోదరి ఆనమ్ మీర్జా క్లారిటీ ఇచ్చారు.
షోయబ్ మాలిక్, సానియా మీర్జా (Photo: X (Twitter))
షోయబ్ మాలిక్, సానియా మీర్జా (Photo: X (Twitter))

షోయబ్ మాలిక్, సానియా మీర్జా (Photo: X (Twitter))

Sania Mirza: పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్‍తో సానియా మీర్జా విడాకుల అంశంపై ఆమె సోదరి ఆనమ్ మీర్జా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా నేడు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్.. మరో పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ సినీ నటి సనా జావేద్‍ను తాను వివాహం చేసుకున్నట్టు శనివారం (జనవరి 20) ప్రకటించాడు మాలిక్. దీంతో సానియాతో మాలిక్ విడాకుల ప్రక్రియ పూర్తయిందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో నేడు (జనవరి 21) ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

సానియా మీర్జా ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలను బహిరంగ పరచాలని అనుకోరని, అయితే షోయబ్ మాలిక్ వేరే పెళ్లి చేసుకోవడంతో ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చిందని ఆనమ్ ఇన్‍స్టాగ్రామ్‍లో ఓ లేఖ పోస్ట్ చేశారు. సానియా - షోయబ్‍ కొన్ని నెలల క్రితమే విడాకులు తీసుకున్నారని స్పష్టం చేశారు.

“తన వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ దృష్టి నుంచి ఎప్పుడూ దూరంగానే ఉంచుతూ వచ్చారు సానియా. అయితే, కొన్ని నెలల క్రితమే మాలిక్, ఆమె (సానియా మీర్జా) విడాకులు తీసుకున్నారని ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. కొత్త జర్నీ మొదలుపెట్టిన షోయబ్‍కు ఆమె విషెస్ చెప్పారు. జీవితంలో సెన్సిటివ్ కాలాన్ని ఆమె ఎదుర్కొంటున్న తరుణంలో.. ఎవరూ ఎలాంటి పుకార్లు వ్యాప్తి చేయవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆమెకు కావాల్సిన ప్రైవసీని గౌరవించండి” అని మీర్జా కుటుంబం, టీమ్ సానియా పేరుతో ఆనమ్ మీర్జా ఓ లేఖ పోస్ట్ చేశారు.

కాగా, షోయబ్ మాలిక్‍కు సానియా మీర్జా ఖులా ఇచ్చారని ఆమె తండ్రి ఇమామ్ మీర్జా వెల్లడించారు. అంటే, మాలిక్‍ నుంచి విడిపోవాలని సానియా మీర్జానే ముందుగా నిశ్చయించుకున్నారని చెప్పేశారు.

షోయబ్ మాలిక్ వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నాడన్న కారణంతోనే అతడితో విడిపోయేందుకు సానియా మీర్జా నిర్ణయించుకున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి.

2010 ఏప్రిల్ 12వ తేదీన సానియా మీర్జా, షోయబ్ మాలిక్ వివాహం జరిగింది. ఆ తర్వాత పాకిస్థాన్‍లోని సియాల్‍కోట్‍లో వలీమా జరిగింది. అప్పటికే ఇది షోయబ్ మాలిక్‍కు ఇది రెండో వివాహం. ఆయేషా సిద్ధిఖీ అనే మహిళతో విడిపోయి.. సానియాను పెళ్లి చేసుకున్నాడు మాలిక్. సానియా, షోయబ్ మాలిక్ దంపతులకు 2018లో ఇజాన్ అనే కుమారుడు జన్మించారు.

2020 నుంచే సానియా మీర్జా, షోయబ్ మాలిక్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. సనా జావెద్‍తో మాలిక్ డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లు వచ్చాయి. సానియా, షోయబ్ వేర్వేరుగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే, అప్పడప్పుడూ కలిసి ఉన్న ఫొటోలను వారు పోస్ట్ చేసే వారు. అయితే, వైవాహిక జీవితం సరిగా లేదని హింట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో కొన్నిసార్లు వెల్లడించారు సానియా. దీంతో వారిద్దరూ విడిపోయారంటూ ఏడాది కాలంగా రూమర్లు తీవ్రమయ్యాయి.

ఇటీవల కూడా సానియా మీర్జా.. విడాకులు అనే పదాన్ని ప్రస్తావిస్తూ ఇన్‍స్టాగ్రామ్‍లో ఓ పోస్ట్ చేశారు. ఇంతలోనే సనా జావెద్‍ను షోయబ్ మాలిక్ వివాహం చేసుకున్నాడు. దీంతో, సానియా - మాలిక్ కొన్ని నెలల క్రితమే విడాకులు తీసుకున్నారని ఇప్పుడు మీర్జా ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చింది.

తదుపరి వ్యాసం