తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sania Gift To Big Boss Winner: బిగ్‌బాస్ విన్నర్‌కు సానియా మీర్జా ఖరీదైన గిఫ్ట్

Sania Gift to Big Boss Winner: బిగ్‌బాస్ విన్నర్‌కు సానియా మీర్జా ఖరీదైన గిఫ్ట్

Hari Prasad S HT Telugu

14 April 2023, 17:15 IST

    • Sania Gift to Big Boss Winner: బిగ్‌బాస్ విన్నర్‌కు సానియా మీర్జా ఖరీదైన గిఫ్ట్ ఇచ్చింది. బిగ్ బాస్ 16 విన్నర్ అయిన ఎంసీ స్టాన్.. సానియా తనకు పంపిన గిఫ్ట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసుకున్నాడు.
బిగ్ బాస్ 16 విజేత ఎంసీ స్టాన్
బిగ్ బాస్ 16 విజేత ఎంసీ స్టాన్

బిగ్ బాస్ 16 విజేత ఎంసీ స్టాన్

Sania Gift to Big Boss Winner: బిగ్ బాస్ హిందీ సీజన్ 16 విజేత అయిన ఎంసీ స్టాన్ కు ఇప్పటికీ బహుమతులు అందుతూనే ఉన్నాయి. తాజాగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అతనికి ఖరీదైన గిఫ్ట్ పంపించింది. ఆ గిఫ్ట్ విలువ రూ.1.21 లక్షలు కావడం విశేషం. తన అక్క సానియా ఈ గిఫ్ట్ పంపింది అంటూ ఆ ఫొటోను స్టాన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఆ గిఫ్ట్ ప్యాక్ లో రూ.91 వేలు విలువ చేసే నైకీ షూస్, రూ.30 వేలు విలువ చేసే బాలెన్సియాగా సన్ గ్లాసెస్ ఉన్నాయి. ఈ గిఫ్ట్ పంపినందుకు అతడు సానియాకు థ్యాంక్స్ చెప్పాడు. బిగ్ బాస్ 16లో తాను తరచూ చెప్పే డైలాగ్ తేరే ఘర్ జాయేగా ఇస్మే (నీ ఇంటికి వస్తా..) అనే క్యాప్షన్ ఉంచాడు. చాలా బాగున్నాయ్ అక్కా అంటూ సానియాకు స్టాన్ థ్యాంక్స్ చెప్పాడు.

ఎంసీ స్టాన్, సానియా మీర్జా బిగ్ బాస్ 16 సక్సెస్ పార్టీలో కలిశారు. ఈ పార్టీని ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ హోస్ట్ చేసింది. సానియా, ఫరా మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. ఈ పార్టీలోనే స్టాన్ తోనూ సానియాకు స్నేహం కుదిరింది. అంతేకాదు సానియా రిటైరైన తర్వాత హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పార్టీలోనూ అతడు పర్ఫార్మ్ చేశాడు.

ర్యాపర్ అయిన ఎంసీ స్టాన్ బిగ్ బాస్ 16 రియాల్టీ షో విజేతగా నిలిచాడు. ఈ షోలో అతనికి శివ్ థాక్రే నుంచి గట్టి పోటీ ఎదురైంది. కానీ చివరికి స్టానే విజేతగా నిలిచాడు.

టాపిక్

తదుపరి వ్యాసం