తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rohit And Gill Centuries: సెంచరీల మోత మోగించిన రోహిత్, శుభ్‌మన్ గిల్

Rohit and Gill Centuries: సెంచరీల మోత మోగించిన రోహిత్, శుభ్‌మన్ గిల్

Hari Prasad S HT Telugu

24 January 2023, 15:35 IST

    • Rohit and Gill Centuries: సెంచరీల మోత మోగించారు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్. న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో ఈ ఇద్దరు ఓపెనర్లు ఆటాడుకుంటున్నారు.
వన్డేల్లో మూడేళ్ల తర్వాత సెంచరీ చేసిన రోహిత్ శర్మ
వన్డేల్లో మూడేళ్ల తర్వాత సెంచరీ చేసిన రోహిత్ శర్మ (AFP)

వన్డేల్లో మూడేళ్ల తర్వాత సెంచరీ చేసిన రోహిత్ శర్మ

Rohit and Gill Centuries: న్యూజిలాండ్ తో ఇండోర్ లో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ సెంచరీల మోత మోగించారు. ఈ ఇద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. రోహిత్ మూడేళ్ల తర్వాత వన్డేల్లో తొలి సెంచరీ చేయగా.. ఈ సిరీస్ లో రెండో సెంచరీ చేశాడు గిల్. రోహిత్ కేవలం 83 బంతుల్లోనే 9 ఫోర్లు, 6 సిక్స్ లతో మూడంకెల స్కోరు అందుకున్నాడు. వన్డేలలో రోహిత్ శర్మకు ఇది 30వ సెంచరీ. ఈ క్రమంలో అతడు ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ రికీ పాంటింగ్ 30 వన్డే సెంచరీల రికార్డును సమం చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

మరోవైపు అతనితో పోటీ పడి పరుగులు సాధించిన గిల్ కూడా కేవలం 72 బంతుల్లోనే మరో సెంచరీ చేశాడు. ఈ సిరీస్ తొలి వన్డేలో డబుల్ సెంచరీ బాదిన గిల్.. అదే ఫామ్ ను ఇక్కడా కొనసాగించాడు. గిల్ 13 ఫోర్లు, 4 సిక్స్ లతో సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతనికిిది 4వ సెంచరీ. ఈ ఇద్దరూ కేవలం 26.1 ఓవర్లలోనే ఏకంగా 212 రన్స్ జోడించడం విశేషం. మొదట్లో నెమ్మదిగా మొదలుపెట్టి తర్వాత క్రమంగా స్పీడు పెంచారు.

పిచ్ పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలించడం, గ్రౌండ్ చిన్నగా ఉండటంతో సులువుగా బౌండరీలు, సిక్సర్లు బాదారు. ఫెర్గూసన్ వేసిన ఒకే ఓవర్లో గిల్ ఏకంగా 22 రన్స్ బాదడం విశేషం. ఆ ఓవర్లో అతడు నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ఈ క్రమంలో మూడు వన్డేల సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లి రికార్డును కూడా గిల్ బ్రేక్ చేశాడు.

ఏ న్యూజిలాండ్ బౌలర్ ను రోహిత్, గిల్ వదల్లేదు. వీళ్ల ధాటికి జాకబ్ డఫ్ఫీ, డారిల్ మిచెల్ లాంటి బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 2020, జనవరి తర్వాత వన్డేల్లో రోహిత్ సెంచరీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే సెంచరీ కాగానే అతడు ఔటయ్యాడు. రోహిత్ చివరికి 85 బంతుల్లో 101 రన్స్ చేసి బ్రేస్‌వెల్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 6 సిక్స్ లు ఉన్నాయి.

ఆ వెంటనే గిల్ కూడా ఔటయ్యాడు. గిల్ 78 బంతుల్లో 112 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 5 సిక్స్ లు ఉన్నాయి. అతడు టిక్నర్ బౌలింగ్ లో ఔటయ్యాడు.

తదుపరి వ్యాసం