తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sohail Khan On Umran Malik: ఉమ్రాన్ లాంటి వారు మాకు గల్లీకి ఒకరున్నారు.. భారత బౌలర్‌పై పాక్ పేసర్ షాకింగ్ కామెంట్స్

Sohail Khan on Umran Malik: ఉమ్రాన్ లాంటి వారు మాకు గల్లీకి ఒకరున్నారు.. భారత బౌలర్‌పై పాక్ పేసర్ షాకింగ్ కామెంట్స్

04 February 2023, 16:51 IST

    • Sohail Khan on Umran Malik: ఉమ్రాన్ మాలిక్‌పై పాకిస్థాన్ పేసర్ సోహైల్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఉమ్రాన్ నిలకడగా రాణిస్తున్న తరుణంలో.. అతడి లాంటి బౌలర్లు తమ దేశవాళీ క్రికెట్‌లో చాలా మంది ఉన్నారని సోహైల్ స్పష్టం చేశాడు.
ఉమ్రాన్ మాలిక్
ఉమ్రాన్ మాలిక్ (Getty)

ఉమ్రాన్ మాలిక్

Sohail Khan on Umran Malik: ప్రస్తుతం టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఒకప్పుడు కేవలం బ్యాటర్ల విషయంలోనే ఈ పోటీ ఉండేది. కానీ ఇప్పుడు బౌలర్ల పరంగానూ పోటీ తీవ్రమైంది. ప్రతి ఒక్కరూ తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్ పేసర్ లోటు కనిపిస్తున్నప్పటికీ.. మిగిలిన పేసర్లు మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. వీరిలో ఉమ్రాన్ మాలిక్ ఇటీవల కాలంలో నిలకడగా రాణిస్తున్నాడు. అంతేకాకుండా రెగ్యూలర్‌గా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. దీంతో పలువురు మాజీలు సైతం అతడి బౌలింగ్‌కు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే పాక్ మాజీ పేసర్ సోహైల్ ఖాన్ మాత్రం విరుద్ధంగా స్పందించాడు. ఉమ్రాన్ లాంటి పేసర్లు పాక్ దేశవాళీలో విరివిగా దొరుతుంటారని కామెంట్ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

"ఉమ్రాన్ మాలిక్ మంచి బౌలరే కాదనను. అతడు ఆడిన 1, 2 మ్యాచ్‌లు చూశాను. అతడు బాగా రన్నింగ్ చేస్తూ బౌలింగ్ చేస్తున్నాడు. కానీ మీరు గంటకు 150 నుంచి 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే ఫాస్ట్ బౌలర్లను చూడాలంటే నేను 12 నుంచి 15 మంది పేసర్లను చూపిస్తాను. పాకిస్థాన్ దేశవాళీ మ్యాచ్‌ల్లో ఆ వేగంతో బౌలింగ్ చేసే బౌలర్లు విరివిగా కనిపిస్తారు. ఒకసారి లాహోర్ కాలండర్లు నిర్వహించే దేశవాళీ మ్యాచ్‌లను వీక్షిస్తే చాలా మంది పేసర్లు కనిపిస్తారు." అని సోహైల్ ఖాన్ స్పష్టం చేశాడు.

"ఉమ్రాన్ లాంటి బౌలర్లు మా దేశవాళీ క్రికెట్‌లో ఎంతో మంది ఉన్నారు. దేశీయ స్థాయిలో రాణించినప్పుడు అతడు తప్పకుండా మంచి బౌలర్ అవుతాడు. షాహీన్, నసీమ్ షా, హరీస్ రవూఫ్ లాంటి స్టార్ పేసర్లు ఈ కోవలోకే వస్తారు." అని సోహైల్ ఖాన్ తెలిపాడు.

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన అక్తర్(161.3) రికార్డును అతడు అధిగమిస్తాడని అనుకుంటున్నారు. అయితే ఈ అంశంపై స్పందించిన సోహైల్.. అది మానవుల వల్ల సాధ్యమయ్యే పని కాదని తెలిపాడు.

"షోయబ్ అక్తర్ రికార్డును బద్దలు కొట్టేగలిగేది ఒక్కటే ఉంది. అదే బౌలింగ్ మెషిన్. ఎందుకంటే ఆ రికార్డును మానవుడు ఎప్పటికీ అధిగమించలేడు. షోయబ్ పడిన శ్రమ ఎవరి తరం కాదు. ఒక్క రోజులో అతడు 32 రౌండ్లు పూర్తి చేశాడు. నేను ఓ వారంలో 10 రౌండ్లు వేయగలిగాను. అక్తర్ తన కాళ్లను బరువులతో కట్టేసుకుని కొండలపై వేగంగా పరుగెత్తేవాడు." అని సోహైల్ స్పష్టం చేశాడు. సోహైల్ ఖాన్ చివరగా 2017లో పాకిస్థాన్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.

తదుపరి వ్యాసం