తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Us Open 2022: మరో గ్రాండ్‌స్లామ్‌కు జకో దూరం.. ఈ సారి కూడా అదే కారణం

US Open 2022: మరో గ్రాండ్‌స్లామ్‌కు జకో దూరం.. ఈ సారి కూడా అదే కారణం

25 August 2022, 20:32 IST

    • సెర్బియా స్టార్ టెన్నీస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ మరోసారి కరోనా వ్యాక్సిన్ కారణంగా గ్రాండ్ స్లామ్‌ టోర్నీకి దూరం కానున్నాడు. ఈ సారి యూఎస్ ఓపెన్‌కు దూరమవనున్నాడు. ఈ విషయాన్ని అతడే తన ట్విటర్ ద్వారా తెలియజేశాడు.
నొవాక్ జకోవిచ్
నొవాక్ జకోవిచ్ (AFP)

నొవాక్ జకోవిచ్

సెర్బియా స్టార్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ కోవిడ్ వ్యాక్సిన్ వివాదం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ వేయించుకోలేదన్న కారణంగా గత ఆస్ట్రేలియా సీజన్‌కు దూరమైన ఈ టెన్నీస్ స్టార్.. తాజాగా మరో సారి అలాంటి వివాదంలోనే చిక్కుకున్నాడు. ఈ సీజన్ చివరి గ్రాండ్ స్లామ్ అయిన యూఎస్ ఓపెన్ ఆడేందుకు అమెరికా వెళ్లేందుకు నిరాకరించాడు. అమెరికాలో వ్యాక్సిన్ వేయించుకోకుండా అనుమతించని కారణంగా అతడు ఈ టోర్నీకి దూరం కానున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

న్యూయార్క్ వేదికగా జరగనున్న యూఎస్ ఓపెన్ అఫిషియల్ ఎంట్రీ లిస్ట్‌లో జకో పేరు కూడా ఉంది. అయితే అతడు మాత్రం అమెరికాకు వెళ్లేందుకు నిరాకరించాడు. వ్యాక్సిన్ వేయించుకోని కారణంగా యూఎస్‌కు వెళ్లడం లేదు. ముఖ్యంగా యూఎస్ఏలో జరిగిన ట్యూన్ ఈవెంట్లలో జకో కనిపించడు.

2022 ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత కోవిడ్-19కి వ్యతిరేకంగా వ్యాక్సిన్ తీసుకోడానికి జకో నిరాకరించిన రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నెంట్ ఇదే కావడం విశేషం. ఈ విషయాన్ని జకోనే స్వయంగా తన ట్విటర్ వేదికగా తెలియజేశాడు. తనకు మద్దతు తెలిపిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.

"నేను ఈ సారి యూఎస్ ఓపెన్ కోసం అమెరికా న్యూయార్క్‌కు వెళ్లలేను. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. నా సహచర ఆటగాళ్లకు శుభాకాంక్షలు. నేను మంచి స్థితిలో సానుకూల స్ఫూర్తిని కలిగి ఉన్నాను. మళ్లీ పోటీ చేసే అవకాశం కోసం ఎదురుచూస్తుంటాను??? త్వరలో కలుద్దా టెన్నీస్ వరల్డ్" అని జకోవిచ్ తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నాడు.

జకోవిచ్ కరోనా వ్యాక్సిన్ ఇంత వరకు వేయించుకోలేదు. టీకా వేయించుకోని కారణంగా ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ కూడా ఆడలేదు. అక్కడ అనుమతించని కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పుడు ఇదే విధంగా యూఎస్ ఓపెన్‌కు దూరం కానున్నాడు.

నొవాక్ జకోవిచ్ గత నెలలో జరిగిన వింబుల్డన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. ఫలితంగా కెరీర్‌లో 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఫలితంగా 7వ వింబుల్డన్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఫైనల్‌లో నిక్ కిర్గియోస్‌పై విజయం సాధించాడు.

టాపిక్

తదుపరి వ్యాసం