HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kane Williamson: కేన్ విలియమ్సన్ కు కరోనా...రెండో టెస్ట్ కు దూరం

Kane Williamson: కేన్ విలియమ్సన్ కు కరోనా...రెండో టెస్ట్ కు దూరం

10 June 2022, 9:31 IST

  • ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో న్యూజిలాండ్ కు ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కరోనా బారిన పడ్డారు. దాంతో రెండో టెస్ట్ కు అతడు దూరమయ్యాడు. 

కేన్ విలియమ్సన్
కేన్ విలియమ్సన్ (twitter)

కేన్ విలియమ్సన్

క్రికెట్ వర్గాలను కరోనా కలవరపాటుకు గురిచేస్తోంది. ఐపీఎల్ లో పలువురు ఫారిన్ క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. తాజాగా కొవిడ్ ప్రభావం ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సిరీస్ పై పడింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు కొవిడ్ పాజిటివ్ గా తేలింది.

ట్రెండింగ్ వార్తలు

Paris 2024 Olympics: ఈ ఏడాది ఒలింపిక్స్ షెడ్యూల్ ఇదే.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడొచ్చంటే..

Mansukh Mandaviya: కొత్త స్పోర్ట్స్ మినిస్టర్ ఈయనే.. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు మారిపోయిన మంత్రి

French Open 2024 Swiatek: ‘స్వియాటెక్’ హ్యాట్రిక్: మళ్లీ ఫ్రెంచ్ ఛాంపియన్‍గా పోలాండ్ స్టార్.. ప్రైజ్‍మనీ ఎన్ని కోట్లంటే!

Sunil Chhetri Last Match: కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న లెజెండరీ ప్లేయర్.. కాసేపట్లోనే ప్రారంభం.. ఎక్కడ చూడాలంటే?

ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. మ్యాచ్ కు ముందురోజు నిర్వహించిన పరీక్షల్లో కేన్ విలియమ్సన్ కు పాజిటివ్ గా ఫలితం వచ్చినట్లు న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు. రెండో టెస్ట్ కు కేన్ విలియమ్సన్ దూరంగా ఉండనున్నట్లు పేర్కొన్నాడు. కేన్ విలియమ్సన్ ఐదు రోజులు ఐసోలేషన్ లో ఉండనున్నారు. రెండో టెస్ట్ కు కేన్ విలియమ్సన్ దూరం కావడంతో కెప్టెన్ గా టామ్ లాథమ్ వ్యవహరించబోతున్నారు. విలియమ్సన్ స్థానంలో హమీష్ రూథర్ ఫర్డ్ ను ఎంపికచేశారు.

కీలకమైన మ్యాచ్ లో విలియమ్సన్ దూరం కావడం జట్టుకు ఇబ్బంది కరమేనని కోచ్ పేర్కొన్నాడు. మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ 1 0 ఆధిక్యంలో ఉంది. లార్డ్స్ లో జరిగిన తొలి టెస్ట్ లో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. శుక్రవారం నుంచి రెండో టెస్ట్ జరుగనున్నది.

 

టాపిక్

తదుపరి వ్యాసం