తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  T20 World Cup Sl Vs Nam: రాణించిన స్మిత్‌, ఫ్రైలింక్ - శ్రీలంక టార్గెట్ 164

T20 World Cup SL vs NAM: రాణించిన స్మిత్‌, ఫ్రైలింక్ - శ్రీలంక టార్గెట్ 164

16 October 2022, 12:10 IST

  • T20 World Cup SL vs NAM: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా శ్రీలంక‌తో జ‌రుగుతోన్న తొలి టీ20 మ్యాచ్‌లో న‌మీబియా ఇర‌వై ఓవ‌ర్ల‌లో 163 ప‌రుగులు చేసింది. శ్రీలంక బౌల‌ర్ల‌ను ఎదుర్కొంటూ న‌మీబియా బ్యాట్స్‌మెన్స్ పోరాడారు.

శ్రీలంక వ‌ర్సెస్ న‌మీబియా
శ్రీలంక వ‌ర్సెస్ న‌మీబియా

శ్రీలంక వ‌ర్సెస్ న‌మీబియా

T20 World Cup SL vs NAM: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా శ్రీలంక‌తో జ‌రుగుతోన్న‌ తొలి టీ20 మ్యాచ్‌లో న‌మీబియా బ్యాట్స్‌మెన్స్ పోరాడారు. స్మిత్‌, ఫ్రైలింక్ బ్యాటింగ్ మెరుపుల‌తో న‌మీబియా ఇర‌వై ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు న‌ష్ట‌పోయి 163 ప‌రుగులు చేసింది. ప‌ద‌హారు ప‌రుగుల‌కే ఓపెన‌ర్ల వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ఉన్న న‌మీబియాకు ఈట‌న్, బార్డ్ ఆదుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

ఈట‌న్ వ‌రుస‌గా రెండు సిక్స‌ర్లు కొట్ట‌డంతో న‌మీబియా స్కోరు వేగం అందుకున్న‌ది. ఈట‌న్ 20 ప‌రుగులు, బార్డ్ 26 ర‌న్స్‌తో పాటు కెప్టెన్ ఎరాస్మ‌స్ 20 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఈ ద‌శ‌లో ఫ్రైలింక్ వికెట్ల ప‌త‌నాన్ని అడ్డుకున్నాడు. 28 బాల్స్‌లో నాలుగు ఫోర్ల‌తో 44 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

చివ‌ర‌లో స్మిత్ ఫోర్లు, సిక్స‌ర్ల‌తో మెర‌వ‌డంతో న‌మీబియా 163 ర‌న్స్ చేసింది. స్మిత్ 16 బాల్స్‌లో రెండు సిక్స‌ర్లు, రెండు ఫోర్ల‌తో 32 ర‌న్స్ చేశాడు. శ్రీలంక బౌల‌ర్ల‌లో మ‌ధుషాన్ రెండు వికెట్లు తీసుకోగా హ‌స‌రంగా, తీక్ష‌ణ‌, చ‌మీరా, క‌రుణ‌ర‌త్నే త‌లో ఒక్క వికెట్ తీసుకున్నారు.

తదుపరి వ్యాసం