తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Mi Cape Town: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబయి ఇండియన్స్.. జట్టు ప్రకటన

MI Cape Town: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబయి ఇండియన్స్.. జట్టు ప్రకటన

11 August 2022, 16:15 IST

    • ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ విస్తరించనుంది. ఐపీఎల్ తరహాలో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్వహించనున్న టీ20 లీగులో ఎంఐ ఫ్రాంచైజీ కూడా తలపడనుంది. ఎంఐ కేప్ టౌన్‌ పేరుతో కొంతమంది ఆటగాళ్లను ఇప్పుటికే తీసుకుంది.
ఎంఐ కేప్ టౌన్
ఎంఐ కేప్ టౌన్ (Twitter)

ఎంఐ కేప్ టౌన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభంతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడే దేశాల్లో స్థానిక టీ20లీగుల్లో విపరీతంగా పుట్టుకొచ్చాయి. కరేబియన్ ప్రీమియర్ లీగ్, బిగ్‌బాష్, పాకిస్థాన్ సూపర్ లీగ్ ఇలా ఒక్కటేమిటి చాలా వరకు టీ20 లీగులపై మక్కువ పెంచుకున్నారు. తాజాగా ఈ జాబితాలో దక్షిణాఫ్రికా కూడా చేరిపోయింది. క్రికెట్ సౌతాఫ్రికా బోర్డు.. ఐపీఎల్ తరహాలో టీ20 లీగును ఆరంభించనుంది. ఈ టీ20లీగులో ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబయి ఇండియన్స్(MI) యాజామన్యం కూడా భాగమైంది. ఎంఐ కేప్‌ టౌన్ అనే పేరుతో ఫ్రాంచైజీని ఏర్పాటు చేసింది. తాజాగా ఈ జట్టులో ఆడేందుకు ఐదుగురు ఫస్ట్ గ్రూప్ ఆటగాళ్లను ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

క్రికెట్ సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆరంభ సీజన్‌లో ముంబయి కేప్ టౌన్ జట్టు తన మొదటి ఐదుగురు ఆటగాళ్లెవరో ప్రకటించింది. #onefamily పేరుతో ఆటగాళ్ల వివరాలను షేర్ చేసింది. అభిమానులను గుర్తించేందుకు వీలుగా బ్లూ అండ్ కలర్స్‌లో లోగోను ఆవిష్కరించింది. ఈ ఐదుగురు ఆటగాళ్లలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు కాగా.. ఓ సౌతాఫ్రికా క్యాప్‌డ్ ప్లేయర్, మరోకరు సౌతాఫ్రికా అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌ను తన జట్టులో భాగం చేసింది.

ఈ జట్టులో కగిసో రబాడా(దక్షిణాఫ్రికా), డేవాల్డ్ బ్రెవీస్(దక్షిణాఫ్రికా-అన్ క్యాప్డ్ ప్లేయర్), రషీద ఖాన్(ఆఫ్గనిస్థాన్), సామ్ కరన్(ఇంగ్లాండ్), లియామ్ లివింగ్‌స్టోన్(ఇంగ్లాండ్) లాంటి ఆటగాళ్లను ఎంఐ ఫ్రాంచైజీ తీసుకుంది. ఇప్పటికే ఎంఐ ఫ్రాంచైజీ మై కేప్‌టౌన్ వచ్చేలా, అభిమానులకు నచ్చేలా ఎంఐ కేప్ టౌన్ అని ఫిక్స్ చేసింది.

ఎంఐ కేప్ టౌన్‌లో భాగమైన ఈ ఆటగాళ్లు గత కొన్ని ఏళ్లుగా స్థిరంగా మంచి ప్రదర్శన చేస్తున్నారు. డేవాల్డ్ బ్రివీస్ 2022లో ముంబయి ఇండియన్స్‌ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ టీ20 లీగ్ నిబంధనల ప్రకారం వేలానికి ముందే కొంతమంది ఆటగాళ్లతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశముంది.

టాపిక్

తదుపరి వ్యాసం