తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Khel Ratna For Sharath Kamal: శరత్‌ కమల్‌కు ఖేల్‌ రత్న.. నిఖత్, లక్ష్య సేన్‌కు అర్జున

Khel Ratna for Sharath Kamal: శరత్‌ కమల్‌కు ఖేల్‌ రత్న.. నిఖత్, లక్ష్య సేన్‌కు అర్జున

Hari Prasad S HT Telugu

14 November 2022, 21:09 IST

    • Khel Ratna for Sharath Kamal: శరత్‌ కమల్‌కు ఖేల్‌ రత్న.. నిఖత్‌ జరీన్‌, లక్ష్య సేన్‌లకు అర్జున అవార్డులు దక్కాయి. సోమవారం (నవంబర్ 14) నేషనల్‌ స్పోర్ట్స్‌ అవార్డులను కేంద్ర క్రీడా యువజన మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఆచంట శరత్ కమల్
ఆచంట శరత్ కమల్ (PTI)

ఆచంట శరత్ కమల్

Khel Ratna for Sharath Kamal: వెటరన్‌ టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ శరత్‌ కమల్‌కు క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న అవార్డు దక్కింది. 2022 ఏడాదికిగాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు అతన్ని వరించింది. కేంద్ర క్రీడా యువజన మంత్రిత్వ శాఖ సోమవారం (నవంబర్ 14) నేషనల్‌ స్పోర్ట్స్ అవార్డులను ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ ఏడాది కామన్వెల్త్‌ గేమ్స్‌లో శరత్‌ కమల్‌ నాలుగు మెడల్స్‌ గెలిచాడు. అందులో మూడు గోల్డ్‌ మెడల్స్‌ కావడం గమనార్హం. దీంతో కామన్వెల్త్‌ గేమ్స్‌లోనే అతని మొత్తం మెడల్స్‌ సంఖ్య 13కు చేరింది. మరోవైపు తెలంగాణ బాక్సింగ్‌ క్వీన్‌, వరల్డ్ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌, బ్యాడ్మింటన్‌ యంగ్‌ సెన్సేషన్‌ లక్ష్య సేన్‌కు అర్జున అవార్డు దక్కింది. అతనితోపాటు అథ్లెటిక్స్‌లో సీమా పూనియాకు కూడా ఈ ఏడాది అర్జున దక్కడం విశేషం.

2022లో మొత్తం 25 మందికి అర్జున అవార్డులు దక్కాయి. అందులో ఒక్క క్రికెటర్‌ కూడా లేకపోవడం గమనార్హం. ఇక అత్యుత్తమ కోచ్‌లకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డు ఈసారి నలుగురికి దక్కింది. ఆర్చరీలో జీవన్‌జోత్‌ సింగ్‌ తేజ, బాక్సింగ్‌లో మహ్మద్‌ అలీ ఖమర్‌, పారా షూటింగ్‌లో సుమా సిద్ధార్థ్‌ శిరూర్‌, రెజ్లింగ్‌లో సుజీత్‌ మాన్‌లకు ఈ అవార్డులు దక్కాయి.

ఇక టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చిన్ననాటి కోచ్‌ అయిన దినేష్‌ లాడ్‌కు లైఫ్‌టైమ్‌ కేటగిరీలో ద్రోణాచార్య అవార్డు దక్కింది. అతడు క్రికెట్‌కు చేసిన సేవలకుగాను ఈ అవార్డును అందుకోనున్నాడు.

ఇదీ అవార్డుల జాబితా

మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌ రత్న అవార్డు 2022: ఆచంట శరత్‌ కమల్‌

అర్జున అవార్డులు: సీమా పూనియా (అథ్లెటిక్స్‌), ఎల్డోస్‌ పాల్‌ (అథ్లెటిక్స్), అవినాశ్‌ ముకుంద్‌ సాబ్లే (అథ్లెటిక్స్‌), లక్ష్య సేన్‌ (బ్యాడ్మింటన్), హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ (బ్యాడ్మింటన్), అమిత్‌ (బాక్సింగ్‌), నిఖత్‌ జరీన్‌ (బాక్సింగ్‌), భక్తి ప్రదీప్‌ కులకర్ణి (చెస్‌), ఆర్‌ ప్రజ్ఞానంద (చెస్‌), దీప్‌ గ్రేస్‌ ఎక్కా (హాకీ), సుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్‌ మోనీ సైకియా (లాన్ బౌల్‌), సాగర్‌ కైలాస్ ఓవ్‌హల్కర్‌ (మల్లఖంబ్), ఎలవెనిల్‌ వేలరివన్‌ (షూటింగ్‌౦, ఓంప్రకాశ్‌ మితర్వాల్‌ (షూటింగ్‌), శ్రీజ ఆకుల (టేబుట్‌ టెన్నిస్‌), వికాస్‌ ఠాకూర్‌ (వెయిట్‌ లిఫ్టింగ్‌౦, అన్షు (రెజ్లింగ్‌), సరిత (రెజ్లింగ్‌), పర్వీన్‌ (వుషు), మానసి జోషి (పారా బ్యాడ్మింటన్‌), తరుణ్‌ ధిల్లాన్‌ (పారా బ్యాడ్మింటన్‌), స్వాప్నిల్‌ సంజయ్‌ పాటిల్‌(పారా స్విమ్మింగ్‌), జెర్లిన్‌ అనికా జే (డెఫ్‌ బ్యాడ్మింటన్‌)

ద్రోణాచార్య అవార్డు: జీవన్‌జోత్‌ సింగ్‌ తేజ (ఆర్చరీ), మహ్మద్‌ అలీ ఖమర్‌ (బాక్సింగ్‌), సుమ సిద్ధార్థ్‌ శిరూర్‌ (పారా షూటింగ్‌), సుజీత్‌ మాన్‌ (రెజ్లింగ్‌)

ద్రోణాచార్య లైఫ్‌ టైమ్‌ కేటగిరీ: దినేష్‌ జవహర్‌ లాడ్ (క్రికెట్‌), బిమల్‌ ప్రఫుల్లా ఘోష్‌ (ఫుట్‌బాల్‌), రాజ్‌ సింగ్ (రెజ్లింగ్)

ధ్యాన్‌ చంద్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు: అశ్విని అకుంజి (అథ్లెటిక్స్‌), ధరమ్‌వీర్‌ సింగ్‌ (హాకీ), బీసీ సురేశ్‌ (కబడ్డీ), నీర్‌ బహదూర్‌ గురుంగ్‌ (పారా అథ్లెటిక్స్‌)

రాష్ట్రీయ ఖేల్‌ ప్రోత్సాహన్‌ పురస్కార్‌: ట్రాన్స్‌స్టేడియా ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ, లఢక్ స్కీ & స్నోబోర్డ్‌ అసోసియేషన్‌

తదుపరి వ్యాసం