Sharath Kamal: కామన్వెల్త్ గేమ్స్‌లో రెండో గోల్డ్ మెడల్ గెలిచిన శరత్ కమల్
Sharath Kamal: కామన్వెల్త్ గేమ్స్‌లో రెండో గోల్డ్ మెడల్ గెలిచాడు స్టార్ పెడ్లర్ శరత్ కమల్. సోమవారం (ఆగస్ట్ 8) చివరి రోజు జరిగిన టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో గెలిచాడు.
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్ 2022 ఆచంట శరత్ కమల్‌కు బాగా కలిసి వచ్చాయి. ఈసారి అతడు నాలుగు మెడల్స్‌తో గేమ్స్ ముగించాడు. చివరి రోజు సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి అదిరే ముగింపునిచ్చాడు. 40 ఏళ్ల శరత్ కమల్‌కు కామన్వెల్త్ గేమ్స్‌లో ఇది రెండో సింగిల్స్ గోల్డ్ మెడల్ కావడం విశేషం. 2006 మెల్‌బోర్న్ గేమ్స్‌లో గోల్డ్ గెలిచిన అతడు.. మళ్లీ ఇన్నాళ్లకు సింగిల్స్ గోల్డ్‌ను సొంతం చేసుకున్నాడు.
ఇదే కాకుండా 2022 గేమ్స్‌లో ఇప్పటికే అతడు మెన్స్ టీమ్ ఈవెంట్‌లో గోల్డ్, మెన్స్ డబుల్స్‌లో సిల్వర్, మిక్స్‌డ్ డబుల్స్‌లో గోల్డ్ గెలుచుకున్నాడు. ఇప్పుడు సింగిల్స్‌లో గోల్డ్‌తో మొత్తంగా కామన్వెల్త్ గేమ్స్‌లో 13 మెడల్స్ గెలిచిన అథ్లెట్‌గా నిలిచాడు. సోమవారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో ఇంగ్లండ్‌కు చెందిన పిచ్‌ఫోర్డ్‌పై 11-13, 11-7, 11-6, 11-8 తేడాతో గెలిచాడు.
తొలి గేమ్ హోరాహోరీగా సాగింది. ఆధిపత్యం ఇద్దరి చేతులు మారుతూ.. చివరికి పిచ్‌ఫోర్డ్ వైపు మళ్లింది. అయితే తొలి గేమ్ ఓడినా కూడా తర్వాత అద్భుతంగా పుంజుకున్న అతడు.. వరుసగా మూడు గేమ్స్ గెలిచి మ్యాచ్‌ను, గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా మూడో గేమ్‌లో ప్రత్యర్థిని పూర్తిగా డామినేట్ చేసిన శరత్ కమల్.. 11-6తో ఆ గేమ్ గెలుచుకున్నాడు.
టాపిక్