తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Jos Buttler: జోస్ బట్లర్‌కు రాజస్థాన్ రాయల్స్ బంపర్ ఆఫర్

Jos Buttler: జోస్ బట్లర్‌కు రాజస్థాన్ రాయల్స్ బంపర్ ఆఫర్

Hari Prasad S HT Telugu

29 June 2023, 16:29 IST

    • Jos Buttler: జోస్ బట్లర్‌కు రాజస్థాన్ రాయల్స్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అతనితో నాలుగేళ్లకు కాంట్రాక్ట్ కుదుర్చుకోవాలని ఈ ఐపీఎల్ ఫ్రాంఛైజీ చూస్తున్నట్లు తెలిసింది.
Mumbai: Jos Buttler of Rajasthan Royals plays a shot during match 13 of the Indian Premier League 2022 cricket tournament between the Rajasthan Royals and the Royal Challengers Bangalore, at the Wankhede Stadium in Mumbai, Tuesday, April 5, 2022. (Sportzpics for IPL/PTI Photo)(PTI04_05_2022_000225B)
Mumbai: Jos Buttler of Rajasthan Royals plays a shot during match 13 of the Indian Premier League 2022 cricket tournament between the Rajasthan Royals and the Royal Challengers Bangalore, at the Wankhede Stadium in Mumbai, Tuesday, April 5, 2022. (Sportzpics for IPL/PTI Photo)(PTI04_05_2022_000225B) (PTI)

Mumbai: Jos Buttler of Rajasthan Royals plays a shot during match 13 of the Indian Premier League 2022 cricket tournament between the Rajasthan Royals and the Royal Challengers Bangalore, at the Wankhede Stadium in Mumbai, Tuesday, April 5, 2022. (Sportzpics for IPL/PTI Photo)(PTI04_05_2022_000225B)

Jos Buttler: ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల టీమ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కు ఆడతాడన్న విషయం తెలుసు కదా. 2018లో ఆ జట్టులోకి వచ్చినప్పటి నుంచీ అతడు చెలరేగిపోతున్నాడు. ఆరు సీజన్లలో 71 మ్యాచ్ లలో ఐదు సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు చేశాడు. దీంతో బట్లర్ కు ఒకేసారి నాలుగేళ్ల కాంట్రాక్ట్ ఇవ్వాలని రాయల్స్ టీమ్ భావిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ విషయాన్ని బ్రిటన్ కు చెందిన టెలిగ్రాఫ్ న్యూస్ పేపర్ వెల్లడించింది. ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు ప్రపంచంలోని వివిధ లీగ్స్ లో టీమ్స్ ఉంటున్నాయి. దీంతో ఏడాది మొత్తం తమ టాప్ ప్లేయర్స్ ఇతర లీగ్స్ లోనూ జట్టుతోనే ఉండేలా ఆయా ఫ్రాంఛైజీలు ఒప్పందాలు కుదుర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నాయి. అందులో భాగంగానే రాజస్థాన్ రాయల్స్ కూడా జోస్ బట్లర్ కు నాలుగేళ్ల కాంట్రాక్ట్ ఇవ్వాలని చూస్తోంది.

అయితే ఈ డీల్ ఇంకా కుదరలేదని, బట్లర్ కూడా దీనిపై ఇంకా ఏమీ తేల్చలేదని టెలిగ్రాఫ్ స్పష్టం చేసింది. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కే కాదు ఆ ఫ్రాంఛైజీకి కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో ఉన్న బార్బడోస్ రాయల్స్, సౌతాఫ్రికా లీగ్ లో ఉన్న పార్ల్ రాయల్స్ జట్లకు కూడా బట్లర్ ఆడుతున్నాడు. ఇలా ప్రపంచవ్యాప్తంగా లీగ్స్ పెరిగిపోతుండటంతో టాప్ ప్లేయర్స్ తమ జాతీయ జట్లను కాదని ఏడాది మొత్తం తమతోనే ఉండేలా ఫ్రాంఛైజీలు ప్లాన్ చేస్తున్నాయి.

ఇప్పటికే ఇలా ఆరుగురు ఇంగ్లండ్ ప్లేయర్స్ తో ఐపీఎల్ ఫ్రాంఛైజీలు టచ్ లో ఉన్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఇదిలా కొనసాగితే రానురాను క్రికెట్ కూడా ఫుట్‌బాల్ లోలాగే జాతీయ జట్లు, ద్వైపాక్షిక సిరీస్ లు కాకుండా కేవలం క్లబ్ క్రికెటే జరుగుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లండ్ కు టీ20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ అయిన జోస్ బట్లర్ ను వదులుకోకూడదని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ భావిస్తోంది.

బట్లర్ లాగే అటు జోఫ్రా ఆర్చర్ కు కూడా ముంబై ఇండియన్స్ ఇలాంటి డీలే ఇవ్వాలని చూస్తోంది. 2022 మెగా ఆక్షన్ లో ఆర్చర్ ను రూ.8 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసినా.. అప్పటి నుంచి అతడు కేవలం ఐదు మ్యాచ్ లు మాత్రమే ఆడగలిగాడు. అయితే భవిష్యత్తులో అతడు ప్రధాన బౌలర్ గా ఎదగగలడన్న ఉద్దేశంతో ఆర్చర్ కు దీర్ఘకాల కాంట్రాక్ట్ ఇవ్వడానికి ముంబై ఇండియన్స్ ఆసక్తి చూపుతోంది.

తదుపరి వ్యాసం