IPL Most Popular Player : ఐపీఎల్‌లో మోస్ట్ పాపులర్ ప్లేయర్ ఎవరో తెలుసా?
IPL Popular Player : మే 28న ముగిసిన ఐపీఎల్ ఎంత విజయవంతమైందో ఓ సర్వేలో వెల్లడైంది. ఈసారి ఏ జట్టు, ఏ ఆటగాడికి ఎక్కువ ఆదరణ ఉందో తెలుసా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్‌గా నిలిచింది. ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని సీఎస్‌కే ఐదోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో అత్యధిక ట్రోఫీలు గెలిచిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) రికార్డు సమమైంది. ఈ ఐపీఎల్(IPL) కంటే ముందే ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తల నేపథ్యంలో చెన్నై జట్టుకు మరింత మద్దతు లభించింది. ఈ ఐపీఎల్ భారీ విజయం సాధించింది.
మే 28న ముగిసిన ఐపీఎల్ ఏ మేరకు విజయవంతమైందో ఓ సర్వేలో వెల్లడైంది. ఈసారి ఏ జట్టు, ఏ ఆటగాడికి ఎక్కువ ఆదరణ ఉందో ప్రకటించారు. ఈ నివేదిక ప్రకారం ఛాంపియన్ చెన్నై జట్టు సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన జట్టుగా ఉంది. సోషల్ మీడియా(Social Media)లో చెన్నై టీమ్‌కు 7.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు రెండో స్థానంలో ఉంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ 6.2 మిలియన్లతో ఉంది. ముంబై జట్టు 5.4 మిలియన్లతో 3వ స్థానంలో ఉంది. చెన్నైకి ఇంత ఆదరణ రావడానికి కారణం ధోనీ.
ఇక విరాట్ కోహ్లీ(Virat Kohli) IPLలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాడిగా ఉన్నాడు. IPL 2023 సమయంలో విరాట్ కోహ్లీని 7 మిలియన్ కంటే ఎక్కువ సార్లు సెర్చ్ చేశారు. ఎంఎస్ ధోని రెండో స్థానంలో ఉన్నాడు. 6 మిలియన్ల మంది సెర్చ్ చేశారు. 3వ స్థానంలో ఉన్న రోహిత్ శర్మ కోసం 3 మిలియన్ల మంది సెర్చ్ చేశారు.
కోహ్లీని ఇంతగా వెతకడానికి కారణం ఉంది. అదే విరాట్-గంభీర్ పోరు. ఈ ఐపీఎల్‌లో అత్యంత చర్చనీయాంశమైన అంశం ఇదే. మే 1న లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(LSG Vs RCB) జట్లు తలపడ్డాయి. మ్యాచ్ అనంతరం ఎల్‌సీజీ బౌలర్ నవీన్ ఉల్ హక్, విరాట్ కోహ్లీ మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో కోహ్లీ, గంభీర్ మధ్య గొడవ జరిగింది.
నవీన్, రింకూ సింగ్(Rinku Singh)లు కూడా అత్యధికంగా సెర్చ్ చేసిన జాబితాలో చేరారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో KKR విజయానికి చివరి 5 బంతుల్లో 30 పరుగులు అవసరం. అప్పుడు యశ్ దయాల్ బౌలింగ్ చేస్తున్నాడు. ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాదిన రింకూ సింగ్ ఉత్కంఠ విజయాన్ని అందించాడు.