తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kkr Vs Gt: ఐదు బాల్స్‌లో ఐదు సిక్స్‌లు - సంచ‌ల‌న ఇన్నింగ్స్‌తో కోల్‌క‌తాను గెలిపించిన రింకు సింగ్‌

KKR vs GT: ఐదు బాల్స్‌లో ఐదు సిక్స్‌లు - సంచ‌ల‌న ఇన్నింగ్స్‌తో కోల్‌క‌తాను గెలిపించిన రింకు సింగ్‌

09 April 2023, 19:33 IST

  • KKR vs GT: ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ప్లేయ‌ర్ రింకు సింగ్ అద్భుతం చేశాడు. చివ‌రి ఓవ‌ర్‌లో ఐదు సిక్స్‌ల‌తో మెరిసి కోల్‌క‌తాకు అదిరిపోయే విజ‌యాన్ని అందించాడు.

రింకు సింగ్
రింకు సింగ్

రింకు సింగ్

KKR vs GT: ఐపీఎల్‌లో ఆదివారం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ మ‌ధ్య జ‌రిగిన పోరు క్రికెట్ ఫ్యాన్స్‌కు అస‌లైన టీ20 మ‌జాను అందించింది. చివ‌రి బాల్ వ‌ర‌కు ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ మూడు వికెట్ల తేడాతో గుజ‌రాత్‌పై విజ‌యాన్ని సాధించింది.

ట్రెండింగ్ వార్తలు

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో 204 ప‌రుగులు చేసింది. భారీ టార్గెట్‌తో బ‌రిలో దిగిన కోల్‌క‌తాకు చివ‌రి ఓవ‌ర్‌లో 28 ప‌రుగులు అవ‌స‌రం కాగా ఐదు సిక్స్‌ల‌తో చెల‌రేగిన‌ రింకు సింగ్ అద్భుత విజ‌యాన్ని అందించాడు.

21 బాల్స్‌లో ఆరు సిక్స‌ర్లు ఒక ఫోర్‌తో 48 ర‌న్స్ చేసిన రింకు సింగ్ఓట‌మి ఖాయ‌మైన త‌రుణంలో ఒకే ఓవ‌ర్‌లో విధ్వంసం సృష్టించి కోల్‌క‌తా టీమ్‌లో ఆనందం నింపాడు. రింకు సింగ్‌కు తోడు వెంక‌టేష్ అయ్య‌ర్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌తో కోల్‌క‌తా విజ‌యంలో కీల‌క భూమిక పోషించాడు. 40 బాల్స్‌లో 5 సిక్స‌ర్లు, 8 ఫోర్ల‌తో83 ర‌న్స్ చేశాడు వెంక‌టేష్ అయ్య‌ర్‌.

అత‌డితో పాటు కెప్టెన్ నితీష్ రానా 29 బాల్స్‌లో 45 ప‌రుగుల‌తో ఆక‌ట్టుకున్నాడు. కోల్‌క‌తా విజ‌యం దిశ‌గా సాగుతోన్న త‌రుణంలో వెంక‌టేష్ అయ్య‌ర్‌, నితీష్ రానా ఔట్ కావ‌డం ఆ జ‌ట్టును దెబ్బ‌తీసింది. హిట్ట‌ర్లు ర‌సెల్‌, న‌రైన్‌తో లాస్ట్ మ్యాచ్ హీరో శార్ధూల్ ఠాకూర్ ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు వ‌రుస‌గా పెవిలియ‌న్ చేర‌డంతో కోల్‌క‌తా ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ అనుకున్నారు.

య‌శ్ ద‌యాల్ వేసిన చివ‌రి ఓవ‌ర్‌లో రింగు సింగ్ ఐదు సిక్స్‌ల‌తో మెరిసి అసాధ్య‌మున్న విజ‌యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో కెప్టెన్ ర‌షీద్‌ఖాన్ మూడు వికెట్లు, అల్టారీ జోసెఫ్ రెండు వికెట్లు తీసుకున్నారు. అంత‌కుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ విజ‌య్ శంక‌ర్‌, సాయిసుద‌ర్శ‌న్ హాఫ్ సెంచ‌రీల‌తో రాణించ‌డంతో ఇర‌వై ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు న‌ష్ట‌పోయి 204 ర‌న్స్ చేసింది.

తదుపరి వ్యాసం