తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pbks Vs Lsg: పంజాబ్, లక్నో మ్యాచ్‌కు పొంచి ఉన్న ముప్పు.. అసలు జరుగుతుందా?

PBKS vs LSG: పంజాబ్, లక్నో మ్యాచ్‌కు పొంచి ఉన్న ముప్పు.. అసలు జరుగుతుందా?

Hari Prasad S HT Telugu

28 April 2023, 15:57 IST

    • PBKS vs LSG: పంజాబ్, లక్నో మ్యాచ్‌కు ముప్పు పొంచి ఉంది. అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణంగా నిహంగ్ సిక్కులు చేస్తున్న ఆందోళనే.
పంజాబ్ కింగ్స్ టీమ్
పంజాబ్ కింగ్స్ టీమ్ (AFP)

పంజాబ్ కింగ్స్ టీమ్

PBKS vs LSG: ఐపీఎల్లో శుక్రవారం (ఏప్రిల్ 28) పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కు ముప్పు పొంచి ఉంది. అసలు ఈ మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది. ఈ మ్యాచ్ కు పంజాబ్ లోని నిహంగ్ సిక్కుల నుంచి ముప్పు పొంచి ఉండటం గమనార్హం. ఈ సీజన్ లో 38వ మ్యాచ్ మొహాలీలో జరగాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

అయితే పంజాబ్ కొన్ని రోజులుగా నిహంగ్ సిక్కుల ఆందోళన జరుగుతోంది. జైల్లో ఉన్న సిక్కు ఖైదీలను విడుదల చేయాలంటూ వీళ్లు నిరసన తెలుపుతున్నారు. నిహంగ్ సిక్కుల ఛీఫ్ బాపు సూరత్ సింగ్ ఖల్సా నిరాహార దీక్ష చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఆయన దీక్షలోనే ఉన్నారు. అయితే ఐపీఎల్ మ్యాచ్ ద్వారా వీళ్లు తమ నిరసన తీవ్రత ఎంతో తెలియజెప్పాలని భావిస్తున్నట్లు ఓ రిపోర్టు వెల్లడించింది.

తమ డిమాండ్లు పంజాబ్ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఐపీఎల్ మ్యాచ్ ను అడ్డుకుంటామని కూడా ఇప్పటికే వాళ్లు అక్కడి అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు. దీంతో ఇప్పుడు పంజాబ్, లక్నో మ్యాచ్ కు వీళ్ల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు నిర్వాహకులు భావిస్తున్నారు. ఒకవేళ వీళ్ల నిరసన కారణంగా ఈ మ్యాచ్ రద్దు చేస్తే.. పంజాబ్, లక్నో జట్లకు ఒక్కో పాయింట్ ఇస్తారు.

ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల టేబుల్లో పంజాబ్ కింగ్స్ ఆరోస్థానంలో ఉంది. ఏడు మ్యాచ్ లలో 4 గెలిచి, 3 ఓడిపోయింది. గత రెండు మ్యాచ్ ల నుంచి శిఖర్ ధావన్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అతడు లక్నోతో మ్యాచ్ లో బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ వారం రోజుల తర్వాత మరో మ్యాచ్ ఆడుతోంది. తమ చివరి మ్యాచ్ లో ఆ టీమ్ గుజరాత్ టైటన్స్ త గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయింది. చివరి ఓవర్లో 4 వికెట్లు పారేసుకొని ఓటమి కొనితెచ్చుకుంది. లక్నో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది.

తదుపరి వ్యాసం