తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rahul Breaks Kohli Record: కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన రాహుల్.. టీ20ల్లో అరుదైన ఘనత

Rahul Breaks Kohli record: కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన రాహుల్.. టీ20ల్లో అరుదైన ఘనత

23 April 2023, 16:01 IST

    • Rahul Breaks Kohli record: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో కోహ్లీ రికార్డును అధిగమించాడు. టీ20ల్లో రాహుల్ అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 7 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ (IPL Twitter)

కేఎల్ రాహుల్

Rahul Breaks Kohli record: గుజరాత్ టైటాన్స్‌తో శనివారం నాడు జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 7 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక లక్నో జట్టు పరాజయాన్ని చవిచూసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 68 పరుగులతో ఆకట్టుకున్నప్పటికీ తన జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. 61 బంతుల్లో 68 పరుగులు చేసేందుకు నిదానంగా ఆడిన అతడిపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో అతడు చేసిన ఈ అర్ధశతకంతో అరుదైన ఘనత సాధించాడు. ఫలితంగా తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించి విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు కేఎల్ రాహుల్.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

గుజరాత్‌పై రాహుల్ చేసిన అర్ధశతకంతో టీ20 క్రికెట్‌లో అతడు 7 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 210 మ్యాచ్‌ల్లో 197 ఇన్నింగ్స్‌లు ఆడిన రాహుల్ 7054 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. అంతేకాకుండా 42.49 సగటుతో బ్యాటింగ్ చేశాడు. ఇందులో 6 శతకాలు, 61 అర్ధసెంచరీలు ఉన్నాయి. అతడి అత్యుత్తమ స్కోరు వచ్చేసి 132* పరుగులు. మరోపక్క విరాట్ కోహ్లీ 212 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించడం విశేషం.

కేఎల్ రాహుల్ 136.20 స్ట్రైక్ రేటుతో 7 వేల పరుగులు రాయిని అందుకోవడం విశేషం. 72 అంతర్జాతీయ టీ20ల్లో రాహుల్ 37.75 సగటుతో 2,265 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 22 అర్ధశతకాలు ఉన్నాయి. 116 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 47.17 సగటుతో 4,151 పరుగులు చేశఆడు. ఇందులో 4 సెంచరీలు, 33 అర్ధశతకాలు ఉన్నాయి. రాహుల్ అత్యుత్తమ స్కోరు 132.

కేఎల్ రాహుల్ తర్వాత టీ20ల్లో 7 వేల పరుగులు మైలురాయిని అందుకున్న బ్యాటర్లలో విరాట్ కోహ్లీ(212 ఇన్నింగ్స్‌లు), శిఖర్ ధావన్(246 ఇన్నింగ్స్‌లు), సురేష్ రైనా(251 ఇన్నింగ్స్‌లు), రోహిత్ శర్మ(268 ఇన్నింగ్స్‌లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

కేఎల్ రాహుల్ 2020 సీజన్‌లో పంజాబ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన అతడు ఆ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. 14 మ్యాచ్‌ల్లో 670 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం సహా 5 అర్ధశతకాలు ఉన్నాయి. ఫలితంగా ఆ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు.

శనివారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 7 పరుగుల తేడాతో ఓడింది. . 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేని లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 128 పరుగులకే పరిమితమైంది. కేఎల్ రాహుల్ అర్ధశతకం చేసినా మ్యాచ్ మాత్రం గెలిపించలేకపోయాడు. లక్నో ముందుంచిన స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంది. చివరి ఓవర్లలో తెలివిగా బౌలింగ్ చేసిన గుజరాత్ బౌలర్లు ఎట్టకేలకు విజయం సాధించారు.

తదుపరి వ్యాసం