తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023: దుమ్ము రేపిన ఐపీఎల్.. తొలి వీకెండ్‌లోనే అన్ని రికార్డులు బ్రేక్

IPL 2023: దుమ్ము రేపిన ఐపీఎల్.. తొలి వీకెండ్‌లోనే అన్ని రికార్డులు బ్రేక్

Hari Prasad S HT Telugu

03 April 2023, 14:06 IST

    • IPL 2023: దుమ్ము రేపింది ఐపీఎల్. తొలి వీకెండ్‌లోనే గతంలోని అన్ని రికార్డులు బ్రేక్ చేసింది. జియో సినిమాలో ఫ్రీగా ఈ మెగా లీగ్ చూసే అవకాశం రావడంతో అభిమానులు తొలి మూడు రోజులు ఎగబడి చూశారు.
ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం
ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (PTI)

ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే తమకు ఎంత ఇష్టమో మరోసారి భారత క్రికెట్ అభిమానులు నిరూపించారు. ఈసారి ఈ లీగ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన జియో సినిమాలో తొలి మూడు రోజుల్లోనే రికార్డులు బ్రేకయ్యాయి. తొలి వీకెండ్ లోనే ఏకంగా 147 కోట్ల వీడియో వ్యూస్ రావడం విశేషం. ఇది గత సీజన్ మొత్తం కలిపి డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై వచ్చిన వ్యూస్ కంటే కూడా ఎక్కువ.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

అంతేకాదు ఒక్కో మ్యాచ్ కు ఒక్కో వ్యూయర్ సగటున 57 నిమిషాలు చూడటం కూడా మరో రికార్డే. వేల కోట్లు పోసి ఐపీఎల్ డిజిటల్ హక్కులను ఐదేళ్ల కాలానికి దక్కించుకున్న రిలయెన్స్.. మ్యాచ్ లను మాత్రం జియో సినిమాలో ఫ్రీగా చూపిస్తోంది. దీంతో ఎగబడి ఐపీఎల్ మ్యాచ్ లు చూస్తున్నారు. అంతేకాదు ఈ మూడు రోజుల్లోనే 5 కోట్ల జియో సినిమా యాప్స్ కూడా డౌన్‌లోడ్ చేసుకున్నారు.

గత సీజన్ తొలి వీకెండ్ తో పోలిస్తే జియో సినిమాలో ఒక మ్యాచ్ పై ఒక వ్యూయర్ గడిపిన సమయం 60 శాతం వరకు పెరిగింది. తొలి మూడు రోజుల్లోనే ఇన్ని రికార్డులు బ్రేకవడం మామూలు విషయం కాదు. తొలి వీకెండ్ లో ఐపీఎల్లో ఐదు మ్యాచ్ లు జరిగాయి. ఈ ఐదు మ్యాచ్ లకు కలిపే 147 కోట్ల వీడియో వ్యూస్ రావడం విశేషం.

ఐపీఎల్ ప్రారంభమైన తొలి రోజే అంటే మార్చి 31న ఏకంగా 2.5 కోట్ల జియో సినిమా యాప్స్ డౌన్‌లోడ్ అయ్యాయి. ఒక రోజులో అత్యధిక డౌన్‌లోడ్స్ అయిన యాప్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే జియో సినిమాలో ఐపీఎల్ కోసం ఉన్న ఫీచర్లు కాకుండా.. ఇక నుంచి ఐపీఎల్ ముగిసే వరకూ ప్రతి వారం ఓ కొత్త ఫీచర్ యాడ్ చేయనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

జియో సినిమా ఏకంగా 12 భాషల్లో ఐపీఎల్ లైవ్ అందిస్తోంది. అందులో ఇంగ్లిష్, హిందీతోపాటు తెలుగు, మరాఠీ, గుజరాతీ, భోజ్‌పురి, పంజాబీ, ఒడియా, బెంగాలీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో లైవ్ వస్తోంది.

తదుపరి వ్యాసం