తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl Playoffs | ఆర్‌సీబీ ఓడిపోవాలని కోరుకుంటున్న సన్ రైజర్స్ అభిమానులు

IPL Playoffs | ఆర్‌సీబీ ఓడిపోవాలని కోరుకుంటున్న సన్ రైజర్స్ అభిమానులు

HT Telugu Desk HT Telugu

19 May 2022, 13:04 IST

  • గురువారం ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతున్నది. ప్లేఆఫ్స్ చేరే జట్లు ఏవన్నది తేలే అవకాశం ఉండటంతో ఈ మ్యాచ్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ లో బెంగళూరు ఓడితేనే సన్ రైజర్స్, పంజాబ్ లకు ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. 

సన్ రైజర్స్ హైదరాబాద్
సన్ రైజర్స్ హైదరాబాద్ (twitter)

సన్ రైజర్స్ హైదరాబాద్

ఐపీఎల్ 2022 లీగ్ మ్యాచ్ లు తుది దశకు చేరుకున్నాయి. అయినా ప్లేఆఫ్స్ చేరే జట్లు ఏవన్నది ఇప్పటివరకు ఖరారు కాలేదు. వరుస విజయాలతో టాప్ 2 స్థానాల్లో నిలిచి గుజరాత్, లక్నో ప్లేఆఫ్స్ కు చేరాయి. కానీ మూడు, నాలుగు స్థానాలు ఎవరివి అన్నది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ తలపడబోతున్నది. 14 పాయింట్లతో ప్లేఆఫ్స్ కు చేరువలో బెంగళూరు ఉంది. 

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ మ్యాచ్ లో గెలిచి ఫ్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలని డికాక్ సేన భావిస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో బెంగళూరు గెలిస్తే రాజస్థాన్ తో సమానంగా పదహారు పాయింట్లతో నిలుస్తుంది.  అదే జరిగితే పంజాబ్ తో పాటు సన్ రైజర్స్ కు ప్లే ఆఫ్స్ దారులు పూర్తిగా మూసుకుపోతాయి. అందుకే బెంగళూరు ఓడిపోవాలని సన్ రైజర్స్ అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ  ఈ మ్యాచ్ లో ఓడిపోయినా కూడా బెంగళూరుకు ప్లేఆఫ్స్ కు అవకాశాలు ఉంటాయి. 

కానీ ఢిల్లీ , రాజస్థాన్ విజయాలతో పాటు రన్ రేట్ పై ఆ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. దాంతో మూడు, నాలుగు స్థానాల విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ లో పటిష్టమైన గుజరాత్ పై నెగ్గేందుకు బెంగళూరు భారీ ప్రణాళికలు చేస్తోంది. కోహ్లితో పాటు డుప్లెసిస్, మ్యాక్స్ వెల్ మెరుపులు మెరిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.  ఆరంభంలో దినేష్ కార్తిక్ దూకుడుగా ఆడిన ఇటీవల విఫలమవుతున్నాడు. హసరంగా మినహా మిగిలిన వారు బౌలింగ్ లో ఆకట్టుకోవడం లేదు. 

టాపిక్

తదుపరి వ్యాసం