తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs Pakistan Hockey: రేపే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్.. లైవ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

India vs Pakistan Hockey: రేపే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్.. లైవ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

Hari Prasad S HT Telugu

08 August 2023, 14:20 IST

    • India vs Pakistan Hockey: రేపే ఇండియా, పాకిస్థాన్ హాకీ మ్యాచ్ జరగబోతోంది. ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్ లైవ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలో ఒకసారి చూద్దాం.
ఇండియన్ హాకీ టీమ్
ఇండియన్ హాకీ టీమ్ (AFP)

ఇండియన్ హాకీ టీమ్

India vs Pakistan Hockey: ఆసియా కప్, వరల్డ్ కప్ లలో భాగంగా ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ లకు ముందు హాకీలో దాయాదులు మరోసారి తలపడబోతున్నాయి. ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బుధవారం (ఆగస్ట్ 9) ఈ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో ఇండియా ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

ఈ నేపథ్యంలో తాము పాకిస్థాన్ ఛాలెంజ్ కు సిద్ధంగా ఉన్నట్లు టీమిండియా హెడ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ చెప్పాడు. సోమవారం చైనాను 2-1తో ఓడించిన తర్వాత పాకిస్థాన్ కోచ్ ముహమ్మద్ సక్లైన్ స్పందిస్తూ.. ఇండియన్ టీమ్ బలహీనతలేంటో తమకు తెలుసని అన్నాడు. ఈ కామెంట్స్ పై ఫుల్టన్ స్పందించాడు. బుధవారం రాత్రి చూసుకుందాం అంటూ అతడు కాస్త ఘాటుగానే స్పందించాడు.

సోమవారం సౌత్ కొరియాతో జరిగిన మ్యాచ్ లో ఇండియా 3-2తో విజయం సాధించింది. ఈ గెలుపు తర్వాత ఇండియా సెమీఫైనల్ బెర్త్ ఖాయమైంది. పాకిస్థాన్ తో కీలకమైన మ్యాచ్ కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్ ను చిత్తు చేయడం ఇండియా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.

ఇండియా vs పాకిస్థాన్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ బుధవారం (ఆగస్ట్ 9) జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8.30 గంటలకు ప్రారంభమవుతుంది. చెన్నైలోని మేయర్ రాధాకృష్ణన్ హాకీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్స్ లో ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఇక డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై చూడాలంటే ఫ్యాన్‌కోడ్ (Fancode) యాప్ లో చూడొచ్చు.

తదుపరి వ్యాసం