తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Hardik Pandya Captaincy: టీమ్ ఇండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య - రోహిత్‌కు గుడ్‌బై చెప్ప‌నున్నారా?

Hardik Pandya Captaincy: టీమ్ ఇండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య - రోహిత్‌కు గుడ్‌బై చెప్ప‌నున్నారా?

22 December 2022, 10:24 IST

  • Hardik Pandya Captaincy:టీమ్ ఇండియా కెప్టెన్సీ బాధ్య‌త‌ల్ని హార్దిక్ పాండ్య చేప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. రోహిత్ శ‌ర్మ స్థానంలో హార్దిక్‌ను కెప్టెన్‌గా నియ‌మించే ఆలోచ‌న‌లో బీసీసీఐ ఉన్న‌ట్లు చెబుతున్నారు.

హార్దిక్ పాండ్య
హార్దిక్ పాండ్య

హార్దిక్ పాండ్య

టీమ్ ఇండియా కెప్టెన్సీలో మార్పులు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్లు గ‌త కొన్నాళ్లుగా బ‌లంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. రోహిత్ శ‌ర్మ స్థానంలో కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య ఎంపిక‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

వ‌న్డేల‌తో పాటు టీ20 కెప్టెన్‌గా రోహిత్ స్థానాన్ని హార్డిక్ పాండ్య‌ భ‌ర్తీ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు. 2024లో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌రుగ‌నుంది. ఈ టోర్న‌మెంట్‌ను దృష్టిలో పెట్టుకొనే కెప్టెన్సీ లోమార్పు చేయబోతున్నట్లు సమాచారం. ఫిటెనెస్‌, గాయాల స‌మ‌స్య‌తో గ‌త ఏడాది కాలంగా రోహిత్ శ‌ర్మ చాలా మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు. బొట‌న‌వేలి గాయంతో ప్ర‌స్తుతం బంగ్లాదేశ్ సిరీస్ ఆడ‌టం లేదు. గ‌తంలోఇంగ్లాండ్‌, సౌతాఫ్రికా సిరీస్‌ల‌కు దూర‌మ‌య్యాడు.

త‌ర‌చుగా కెప్టెన్ మార‌డంతో జ‌ట్టు కూర్పు ప‌రంగా స‌మ‌స్య‌లు ఎదుర‌వుతోన్నాయి. అందుకే రెగ్యుల‌ర్ కెప్టెన్‌గా హార్దిక్‌ను నియ‌మించాల‌నే ఆలోచ‌న‌లో టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఐపీఎల్ 2022లో హార్దిక్ కెప్టెన్సీలోనే గుజ‌రాత్ టైటాన్స్ క‌ప్ గెలిచింది.

ఐర్లాండ్ తో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన హార్దిక్ స‌క్సెస్ అయ్యాడు. అత‌డి కెప్టెన్సీలో టీమ్ ఇండియా ఇప్ప‌టివ‌ర‌కు ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడితే అందులో నాలుగు విజ‌యాలు ద‌క్కాయి. కెప్టెన్‌గా, ఆట‌గాడిగా అత‌డి ఫామ్ దృష్టిలో పెట్టుకొనే జ‌ట్టును న‌డిపించే బాధ్య‌త‌ను హార్దిక్‌కు అప్ప‌గించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ కెప్టెన్సీ మార్పుపై శ్రీలంక సిరీస్‌తో క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది. జ‌న‌వ‌రి లో శ్రీలంక‌తో టీ20, వ‌న్డే మ్యాచ్‌లు ఆడ‌నుంది టీమ్ ఇండియా. ఈ సిరీస్ కోసం త్వ‌ర‌లోనే జ‌ట్టును ప్ర‌క‌టించ‌బోతున్నారు. రోహిత్ ఇంకా గాయం నుంచి కోలుకోక‌పోవ‌డంతో అత‌డు అందుబాటులో ఉండేది అనుమానంగానే మారింది. ఒక‌వేళ రోహిత్ దూర‌మైతే హార్దిక్ పాండ్య‌కు కెప్టెన్సీ అప్ప‌గించే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు.

తదుపరి వ్యాసం