తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hansika Love Shaadi Drama Streaming Date: హన్సిక లవ్ షాదీ డ్రామా స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hansika Love Shaadi Drama Streaming Date: హన్సిక లవ్ షాదీ డ్రామా స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu

09 February 2023, 17:08 IST

    • Hansika Love Shaadi Drama Streaming Date: హన్సిక లవ్ షాదీ డ్రామా స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఈ టాలీవుడ్, బాలీవుడ్ నటి గతేడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
సోహైల్ కథూరియా, హన్సిక మోత్వానీ
సోహైల్ కథూరియా, హన్సిక మోత్వానీ

సోహైల్ కథూరియా, హన్సిక మోత్వానీ

Hansika Love Shaadi Drama Streaming Date: సెలబ్రిటీల పెళ్లిళ్లంటే మామూలు విషయం కాదు. దానికి చాలా హంగామా ఉంటుంది. అదే రేంజ్ లో ఆ పెళ్లిళ్ల వీడియోలు, ఫొటోలకు కూడా ఫుల్ డిమాండ్. వాటిని కూడా క్యాష్ చేసుకోవడానికి సెలబ్రిటీలు వెనుకంజ వేయరు. తాజాగా హన్సికా మోత్వానీ కూడా తన పెళ్లి తతంగాన్ని ఓ రియాల్టీ షోగా తీసుకురాబోతోంది.

ట్రెండింగ్ వార్తలు

NNS 21st May Episode: ​​​​సరస్వతిని చంపాలని చూసిన మనోహరి.. భాగీ మోసం చేసిందని కోపంతో వెళ్లిపోయిన అమర్

Prasanth Varma Ranveer Singh: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ భారీ బడ్జెట్ మూవీ అటకెక్కినట్లేనా?

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల‌లో ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ రిలీజ్ - తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే

Sreemukhi: అజిత్ కంటే ముందు గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్ శ్రీముఖిదే - రిలీజ్‌కు నోచుకోని తెలుగు యాంక‌ర్ బోల్డ్ మూవీ

గతేడాది డిసెంబర్ 4న ఆమె వ్యాపారవేత్త సోహైల్ కథూరియాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి స్ట్రీమింగ్ హక్కులను ఓ ఓటీటీ భారీ ధరకు దక్కించుకున్నట్లు అప్పుడే వార్తలు వచ్చాయి. ఆ ఓటీటీ పేరు డిస్నీ ప్లస్ హాట్ స్టార్. ఇప్పుడా ఓటీటీ ఈ పెళ్లిని హన్సికాస్ లవ్ షాదీ డ్రామా (Hansika's Love Shaadi Drama) పేరుతో స్ట్రీమింగ్ చేయనుంది.

ఈ షో ట్రైలర్ గత మంగళవారం (ఫిబ్రవరి 7) రిలీజైంది. ఇక ఈ షో శుక్రవారం (ఫిబ్రవరి 10) నుంచే స్ట్రీమింగ్ కానుంది. హన్సిక తన అఫైర్ గురించి చెప్పడం నుంచి పెళ్లి తంతు ముగిసే వరకూ ఈ షో ట్రైలర్ అన్ని ఎమోషన్స్ ను చూపించింది. దీంతో దీని కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజస్థాన్ లోని ముండోతా ఫోర్ట్ లో వీళ్ల పెళ్లి ఘనంగా జరిగింది.

ఆ పెళ్లికి ముందు జరిగిన గందరగోళం, వివాదాలను కూడా ఈ ట్రైలర్ లో చూపించారు. పెళ్లి రోజు పెళ్లి కూతురు ఏ డ్రెస్ వేసుకోవాలన్నదానిపై కూడా ఫ్యామిలీ సీరియస్ గా చర్చించుకోవడం చూడొచ్చు. ఈ ట్రైలర్ వీడియోను హన్సిక కూడా షేర్ చేసింది. మచ్ అవేటెడ్ లవ్ షాదీ డ్రామా ఫిబ్రవరి 10 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రాబోతోందని ఆమె చెప్పింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం